ECoR Special Trains To Kumbh Mela : రైల్వే ప్రయాణికులకు అలర్ట్-విశాఖ నుంచి మహా కుంభమేళాకు నాలుగు ప్రత్యేక రైళ్లు
ECoR Special Trains To Kumbh Mela : ఈస్ట్ కోస్టు రైల్వే మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ECoR Special Trains To Kumbh Mela : కుంభమేళా భక్తులకు ఈస్ట్‌కోస్టు రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు వైజాగ్ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు ప్రయాణికులు, యాత్రికులు, భక్తుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
విశాఖపట్నం- గోరఖ్‌పూర్ రైలు
1. విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-గోరక్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08562) రైలు జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో అందుబాటులోకి రానుంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి ఆదివారం రాత్రి 10:20 గంటలకు బయలుదేరుతుంది. ఇది మంగళవారం రాత్రి 8:25 గంటలకు గోరక్‌పూర్ చేరుకుంటుంది.
2. గోరక్‌పూర్ నుంచి బయలుదేరే గోరక్‌పూర్ -విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08561) రైలు జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో అందుబాటులోకి రానుంది. ఈ రైలు గోరక్‌పూర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరుతుంది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్ల గుండా వెళ్తాయి. ఈ ప్రత్యేక రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లు -4, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.
విశాఖపట్నం- దీన్ దయాళ్ ఉపాధ్యాయ్
1. విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం– దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08530) రైలు జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 27 తేదీల్లో అందుబాటులోకి రానుంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి గురువారం సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరుతుంది. ఇది శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చేరుకుంటుంది.
2. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నుంచి బయలుదేరే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08529) రైలు జనవరి11, 18, 25, ఫిబ్రవరి 8, 22, మార్చి 1 తేదీల్లో అందుబాటులోకి రానుంది. ఈ రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నుంచి శనివారం రాత్రి 8:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది సోమవారం తెల్లవారు జామున 3:25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం తదితర రైల్వే స్టేషన్ల గుండా వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ కోచ్‌లు -4, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం