ఈ ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు!-samsung galaxy a16 5g gets massive discount know this smartphone features and affordable price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు!

ఈ ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు!

Anand Sai HT Telugu
Dec 24, 2024 10:00 PM IST

Samsung Galaxy A16 5G Discount : భారీ డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, లాంగ్ డ్యూ అప్డేట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ లభిస్తుంది. ఆఫర్ గురించి వివరంగా చూడండి..

శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌పై డిస్కాంట్
శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌పై డిస్కాంట్

శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీ కోసం ఓ గుడ్‌న్యూస్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ మీద ఆఫర్ నడుస్తోంది. ఈ శాంసంగ్ లేటెస్ట్ 5జీ ఫోన్‌ బంపర్ డిస్కౌంట్‌లో లభిస్తుంది. 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో వచ్చిన చౌకైన స్మార్ట్ ఫోన్ ఇది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌లో మంచి తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, లాంగ్ డ్యూ అప్డేట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ లభిస్తుంది. దీని గురించి మరింత సమచారం తెలుసుకుందాం..

yearly horoscope entry point

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ ఎలాంటి షరతులు లేకుండా రూ.3500 చౌకగా లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.21,499కే లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే 16 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దీనితో మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును కలిగి ఉంటే దానిపై మీరు 5 శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. గెలాక్సీ ఏ15 5జీలో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీలో 5000 mAh Battery ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1.1 కస్టమ్ స్కిన్‌తో పనిచేస్తుంది. కంపెనీ 6 సంవత్సరాల ఓఎస్ అప్డేట్‌ను ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే, శాంసంగ్ గెలాక్సీ ఎ 16 5జీలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో యూనిట్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది గెలాక్సీ ఏ15 5జీ మాదిరిగానే కెమెరా సెటప్ ఉంటుంది. సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ54 రేటింగ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ గోల్డ్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 17999కు దొరుకుతుంది. దీనిని మీరు రూ.633తో ఈఎంఐ ఆప్షన్‌లో కూడా తీసుకోవచ్చు. రూ.950 క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ కూడా వస్తుంది.

గమనిక : డిస్కౌంట్ ధరలు రోజురోజుకు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆఫర్ ప్రకారం కథనం ఇచ్చాం.

Whats_app_banner