Electric Scooters : డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. మంచి రేంజ్, ధర కూడా తక్కువే!
Electric Scooters Without Driving Licence : ఈ ఏడాది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం భారత మార్కెట్లో కొత్త మైలురాయిని నెలకొల్పింది. చాలా ఈవీ స్కూటీలు అమ్ముడయ్యాయి. కొన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.
ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కస్టమర్లు కూడా ఇంధన ఖర్చు లేకపోయేసరికి వీటివైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్ ఈవీ, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎనర్జీ వంటి టాప్ కంపెనీలు ఈవీ మార్కెట్‌ను ఏలుతున్నాయి. అయితే ఈ కంపెనీలే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని ఈవీ స్కూటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, 250 వాట్ల కంటే తక్కువ పవర్ అవుట్ పుట్, గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాంటి 5 మోడళ్లపై ఓ లుక్కేయండి..
లోహియా ఓమా స్టార్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.40,850. ఇందులో 250 వాట్ల పవర్ మోటార్ ఉంది. ఇది బీఎల్డీసీ హబ్ మోటార్. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు. అదే సమయంలో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 4.5 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాల వారంటీ ఇస్తుంది. దీని బరువు 66 కిలోలు. ఇది తక్కువ బ్యాటరీ ఇండికేటర్, టెయిల్ లైట్ బల్బ్, టర్న్ సిగ్నల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ కలిగి ఉంది.
ఆంపియర్ రియో ఇలైట్
ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.42,999. ఇందులో 250 వాట్ల పవర్ మోటార్ ఉంది. ఇది బీఎల్డీసీ హబ్ మోటార్. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు. అదే సమయంలో ఒకసారి ఛార్జ్ చేస్తే దీని పరిధి 55 నుండి 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 5 నుంచి 6 గంటల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై కంపెనీ 2 సంవత్సరాల వారంటీ ఇస్తుంది. దీని బరువు 70 కిలోలు. ఛార్జింగ్ పాయింట్, స్పీడోమీటర్, ప్యాసింజర్ ఫుట్రెస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కోమాకి ఎక్స్‌జీటీ కేఎం
Komaki XGT KM స్మార్ట్ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జీంగ్ కు 85 కిమీ నుండి 90 కిమీ రేంజ్ ఇస్తుంది. దీనికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.56,890 నుంచి ఉంది. ఇందులో 60 వోల్ట్ పవర్ మోటార్ ఉంది. ఇది బీఎల్డీసీ హబ్ మోటార్. ఈ స్కూటర్ గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. అదే సమయంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని పరిధి 130 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 4 నుంచి 5 గంటల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై కంపెనీ 1 సంవత్సరం వారంటీ ఇస్తుంది. ఇందులో ట్యూబ్ లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్స్, అల్ట్రా బ్రైట్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ఒకినావా ఆర్30
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.58,992. ఇందులో 250 వాట్ల పవర్ మోటార్ ఉంది. ఇది బీఎల్డీసీ హబ్ మోటార్. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. 4 నుంచి 5 గంటల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాల వారంటీ ఇస్తుంది. దీని బరువు 150 కిలోలు. ఎల్ఈడీతో డీఆర్ఎల్ ఫంక్షన్, రియర్ సస్పెన్షన్‌తో డ్యూయల్ ట్యూబ్ టెక్నాలజీ, సెంట్రల్ లాకింగ్‌తో యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
గేమోపై మిసో
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.44,000. ఇందులో 250 వాట్ల పవర్ మోటార్ ఉంది. ఇది బీఎల్డీసీ హబ్ మోటార్. ఈ స్కూటర్ స్పీడ్ 25 కిలోమీటర్లు. అదే సమయంలో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. 3 నుంచి 4 గంటల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాల వారంటీ ఇస్తుంది. దీని బరువు 45 కిలోలు. ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్ ఉంది.