Jr NTR Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్-jr ntr fan discharged from hospital after ntr send team to look after injured person ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jr Ntr Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్

Jr NTR Fan Discharge : మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్

Bandaru Satyaprasad HT Telugu
Dec 24, 2024 11:08 PM IST

Jr NTR Fan Discharge : జూ.ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయంపై కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడారు. నిన్న ఎన్టీఆర్ బృందం తనకు ఫోన్ చేశారన్నారు. ఇవాళ రూ.12 లక్షల బిల్లు కట్టి, కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారని ఆమె తిలిపారు.

మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, రూ12 లక్షలు కట్టి వీరాభిమాని డిశ్చార్
మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, రూ12 లక్షలు కట్టి వీరాభిమాని డిశ్చార్

Jr NTR Fan Discharge : జూ.ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నారు. తన అభిమాని ప్రాణాలు కాపాడారు. రూ.12 లక్షల బిల్లు కట్టి, ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు. దేవర సినిమా టైమ్ లో ఎన్టీఆర్ వీరాభిమాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, దేవర సినిమా చూసే వరకు తన బిడ్డను బతికించాలని కౌశిక్ తల్లి వేడుకున్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ స్పందించి, తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడారు. అతడి చికిత్సకు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభుత్వం పరంగా సాయం అందించారు. అయితే ఇటీవల కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ నుంచి తమకు సాయం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయం చేసిన తప్పుగా మాట్లాడుతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

yearly horoscope entry point

రూ.12 లక్షలు కట్టిన ఎన్టీఆర్ బృందం

తాజాగా కౌశిక్ తల్లి సరస్వతి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎన్టీఆర్‌ గురించి తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చానన్నారు. తన కుటుంబమంతా ఎన్టీఆర్ అభిమానులమేనని సరస్వతి తెలిపారు. తన కుమారుడి చికిత్సకు అయిన ఖర్చును ఎన్టీఆర్ భరించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మీడియా ముందుకొచ్చి సరస్వతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఎన్టీఆర్‌ టీమ్‌ తనకు కాల్ చేసి, వస్తున్నామని చెప్పారన్నారు. వారు ఆసుపత్రికి వచ్చి మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారన్నారు. ఆ తర్వాత రూ.12 లక్షల బిల్లు కట్టి, డిశ్చార్జ్‌ చేయించారని కౌశిక్ తల్లి తెలిపారు. తనక కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగుపడిందన్నారు. తాను నిన్న మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలైనట్టున్నారన్నారు. అందరి ఆశీస్సు వల్లే తన కుమారుడు కోలుకున్నాడన్నారు.

ఆసుపత్రి నుంచి కౌశిక్ డిశ్చార్జ్

ఏపీకి చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కౌశిక్ ఎన్టీఆర్‌ వీరాభిమాని కావడంతో తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు సెప్టెంబర్ నెలలో అతని తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కౌశిక్‌ తల్లి సరస్వతి మీడియా ఎదుటవాపోయారు. ఈ విషయం తెలుసుకున్న జూ.ఎన్టీఆర్‌... కౌశిక్‌కు వీడియో కాల్‌ లో మాట్లాడారు. ఆరోగ్యం తర్వాత ఏదేమైనానని సర్దిచెప్పారు. దేవర సినిమా విడుదల తర్వాత కౌశిక్ గురంచి పెద్దగా చర్చ లేదు. కౌశిక్ ఆరోగ్యం ఎలాటంటి సమాచారం అందలేదు. అయితే నిన్న హఠాత్తుగా కౌశిక్‌ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్‌ మాట ఇచ్చి స్పందించడం లేదని అన్నారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఎన్టీఆర్‌ హామీ ఆసుపత్రి వచ్చిన ఆయన టీమ్ ఆసుపత్రిలో బిల్లులు చెల్లించారు. విషయం జూ.ఎన్టీఆర్‌ వరకు వెళ్లడంతో గంటల వ్యవధిలోనే కౌశిక్‌ ఆసుపత్రి బిల్లు మొత్తం చెల్లించారు. దీంతో మంగళవార సాయంత్రం కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.

Whats_app_banner

సంబంధిత కథనం