Condom Usage: సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే కండోమ్స్‌ తప్పక ట్రై చేయండి-know about different types of condoms for your better sex life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Condom Usage: సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే కండోమ్స్‌ తప్పక ట్రై చేయండి

Condom Usage: సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే కండోమ్స్‌ తప్పక ట్రై చేయండి

Ramya Sri Marka HT Telugu
Dec 24, 2024 07:39 PM IST

Condom Usage: కండోమ్‌లు అంటే కేవలం ప్రెగ్నెన్సీ రాకుండా ఆపగలిగే సాధనాలు మాత్రమే అనుకుంటున్నారా..? అయితే మీ అపోహను వీడాల్సిన సమయం వచ్చేసింది. ఇవి కేవలం ప్రేగ్నెన్సీ నుంచి, సుఖ వ్యాధుల నుంచి కాపాడటానికి మాత్రమే కాదు. మీ సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చుకోవడానికి సహాయపడతాయట.

సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే కండోమ్స్‌లను తప్పక ట్రై చేయండి
సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే కండోమ్స్‌లను తప్పక ట్రై చేయండి

సెక్స్ ని లైఫ్‌లో కేవలం ఓ పనిలా, డల్‌గా, ఫార్మాలిటీగా ఫినిష్ చేసే వారు కాకపోయుంటే ఇది కచ్చితంగా మీ కోసమే. కండోమ్ అనేది కేవలం అవాంఛిత గర్భం నుంచి, లైంగిక సంబంధాల వల్ల కలిగే రకరకాల వ్యాధుల నుంచి కాపాడే రక్షక కవచం మాత్రమే కాదు. ఇది మీ సెక్స్ లైఫ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చుకునేందుకు మీ భాగస్వామితో ఎక్కువ సుఖాన్ని పొందేందుకు ఉపయోగపడే సాధనమని మీరు తెలుసుకోవాలి. మీరు ఎంచుకునే కండోమ్ మీ శృంగార జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తాయట.

yearly horoscope entry point

కండోమ్‌ ఏ కదా.. ఏదో ఒకటిలే వాడి పారేస్తే అయిపోతుంది అని ఎప్పుడూ అనుకోకూడదట. కండోమ్‌లలోనూ పలు రకాలు ఉంటాయి. ఒక్కో రకమైన కండోమ్ తో ఒక్కో రకమైన అనుభూతి, ప్రయోజనం పొందవచ్చు. సైన్స్ భాషలో చెప్పాలంటే.. "యోనిలోకి ప్రవేశించిన వీర్యకణాలను అండంతో కలవకుండా అడ్డుకునే రక్షక కవచమే కండోమ్". అంతేకాకుండా సుఖ వ్యాధులు, హెచ్ఐవీ, క్లామైడియా, గోనోరియా వంటివి రాకుండా అడ్డుకోగలదని వైద్యులు చెబుతున్నారు. జికా, ఎబోలా వంటి లైంగికంగా సంక్రమించే వైరస్‌ల నుంచి కూడా కాపాడగలుగుతాయట కండోమ్‌లు.ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే..

మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా ప్రత్యేకమైన కండోమ్‌లు ఉంటాయి. అవి ఇంకా సమర్థవంతంగా పని చేస్తాయి. ఎలాంటి కండోమ్ లు ఎంచుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకోవచ్చు.

కండోమ్స్‌లో రకాలు వాటి ప్రయోజనాలు..

లేటెక్స్ (Latex) కండోమ్:

ఈ కండోమ్‌లను సహజమైన రబ్బర్‌తో తయారుచేస్తారు. ఎక్కువ మంది వీటినే వినియోగిస్తుంటారు. 2004ల కాంట్రాసెప్షన్ జర్నల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం, సెక్స్ సమయంలో ఇవి జారిపోవడం, చినిగిపోవడం వంటివి చాలా అరుదుగా మాత్రమే జరిగాయట. రీసెర్చర్లు కనుగొన్న దాని ప్రకారం, ఈ కండోమ్లు అధిక సమర్థవంతంగా ఉండటమే కాకుండా రెగ్యూలర్‌గా వినియోగించినప్పటికీ లీకేజీ సమస్య చాలా తక్కువగా కనిపిస్తుంది.

పాలీయురేతేన్ (Polyurethane) కండోమ్:

స్ట్రాంగ్ ప్లాస్టిక్ మెటేరియల్ తో తయారుచేసిన పలచనైన కండోమ్ ఇది. లేటెక్స్ కండోమ్ వాడిన సమయంలో అలర్జిటిక్ గా భావించిన వాళ్లు ఈ పాలీయురేతేన్ వాడటం బెటర్. ఇది వాటర్, గ్రీజ్ వంటి వాటికి రెసిస్టెంట్ గా పనిచేసినప్పటికీ చక్కటి ప్రభావవంతమైన రక్షణను కల్పిస్తుంది. అవాంచిత గర్భం, సుఖ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

పొలీసోప్రెన్ ( Polyisoprene) కండోమ్:

ఈ కండోమ్ లను సింథటిక్ రబ్బర్ తో తయారు చేస్తారు. లేటెక్స్ కండోమ్ వద్దనుకునే వారికి ఇది మరొక ఆప్షన్. లేటెక్స్ కండోమ్ మాదిరిగా అలర్జీ ఉండే ప్రొటీన్లు ఇందులో ఉండవు. కానీ, రెండింటిలోనూ ఒకే కంఫర్ట్, ప్రొటెక్షన్ దొరుకుతాయి. లేటెక్స్ కండోమ్ అంటే అలర్జీ ఉన్నవాళ్లు, సెక్స్ లైఫ్ సాఫీగా జరగాలని కోరుకునే వాళ్లు పొలీసోప్రెన్ కండోమ్స్ కు వెళ్లిపోవచ్చు.

ఫిమేల్ (Female) కండోమ్స్:

కండోమ్స్ లలోనే ఫిమేల్ కండోమ్స్ బెస్ట్ అని 2020లో ప్రచురితమైన బీఎంసీ పబ్లిక్ హెల్త్ కథనం చెప్తుంది. యోనిలోపలికి చొచ్చుకుపోయే ఈ ఫిమేల్ కండోమ్స్, పురుషాంగానికి వాడే కండోమ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తుందంట.అవాంచిత గర్భం, సుఖ వ్యాధులు రాకుండా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని స్టడీలు వెల్లడించాయి.

స్పెర్మిసైడ్-కోటెడ్ (Spermicide-Coated) కండోమ్స్:

లేటెక్స్ లేదా పొలీయురేతేనె కండోమ్స్ కు స్పెర్మిసైడ్ కోటింగ్ వేసిన కండోమ్స్ ఇవి. సాధారణంగా జెల్లీ రూపంలో ఉంటాయి. అవాంచిత గర్భాన్ని అడ్డుకోవడంలో మిగతా వాటికంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయట. వీర్యకణాలు అండాశయానికి చేరుకునే లోపే చంపేస్తాయట. కానీ, కొందరిలో వీటిని వాడటం వల్ల ఒక రకమైన ఇరిటేషన్ కలుగుతుందని నిపుణుల అభిప్రాయం.

Whats_app_banner

సంబంధిత కథనం