Dates With Milk: చలికాలంలో వేడి పాలతో రెండు ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి అమేజింగ్ బెనిఫిట్స్
చలికాలంలో గోరువెచ్చని పాలతో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. రుచికి మాత్రమే కాకుండా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అందించగల ఈ ఆహారం గురించి మరింత తెలుసుకుందామా..
వాతావరణాన్ని బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉంటాం. సాధారణంగా చలికాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. అసలే చలి, మూత్రానికి ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుందని లిక్విడ్ ఫుడ్ ను చాలా తక్కువగా తీసుకుంటాం. అలా తీసుకునే వాటిలో పాలను కచ్చితంగా చేర్చుకోవాలి. లిక్విడ్ గా అందడంతో పాటు పోషకాలను కూడా శరీరానికి అందిస్తుంది కాబట్టి ఇది బెస్ట్ డైట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడివేడి పాలు తాగడం వల్ల చలికాలంలో మన శరీరానికి వెచ్చటి ఫీలింగ్ కలిగి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పోషక విలువలు:
ఇదిలా ఉంటే, అవే పాలతో ఖర్జూరం కలిపి తీసుకుంటే ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయట. కొందరైతే, శీతాకాలంలో గోరువెచ్చని పాలతో ఖర్జూరాలను తీసుకోవడం అమృతంతో సమానం అని చెబుతున్నారు. వాస్తవానికి పాలతో పాటు ఖర్జూరంలో కూడా పోషక విలువలు చాలా ఉంటాయి. ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు అవి మన ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా మారతాయి.
కండరాలకు, ఎముకలకు రెట్టింపు లాభం
ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అదే సమయంలో, పాలలో కాల్షియం, ప్రోటీన్ వంటి పదార్థాలు మెండుగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఖర్జూరాలు, పాలు కలిపినప్పుడు అందులో ఉండే పోషక విలువలు రెట్టింపు అవుతాయి. చలికాలంలో ఖర్జూరాలను పాలలో కలిపి తాగడం వల్ల ఎముకలు, కండరాలు బలపడి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారికి, ఖర్జూరం పాలు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణ వ్యవస్థకు ప్రయోజనం:
ఖర్జూరం, పాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. నిజానికి ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అటువంటి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి కడుపుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా పాలను తేలికగా జీర్ణించుకోలేని వారు పాలలో ఖర్జూరం కలిపి తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యను తొలగించడానికి, తేలికపాటి గోరువెచ్చని పాలలో ఖర్జూరం కలిపి తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత
ఈ రెండింటి కలయిక మెదడు అభివృద్ధికి ప్రయోజనకరంగా భావిస్తారు. ఖర్జూరాలు, పాలలో విటమిన్ బి, పొటాషియం అలాగే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సహా కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, లిగ్నన్లు, ఫినోలిక్ ఆమ్లాలు, పాలీఫెనాల్స్ వంటి అనేక ఖనిజ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు ఏకాగ్రత శక్తిని పెంపొందిస్తాయి. ఇది కాకుండా, అల్జీమర్స్ వంటి న్యూరో డిజనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే పెద్ద పిల్లలకు ఖర్జూరంతో పాటు పాలు ఇవ్వాలి.
రోగనిరోధక శక్తి బలోపేతం
శీతాకాలంలో సీజనల్ వ్యాధుల ముప్పు చాలా పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఈ సీజన్ చాలా వ్యాధులను తెచ్చిపెడుతుంది. ఆ వాతావరణంలో ఖర్జూరం, పాలు తాగడం అనేవి ప్రతి ఒక్కరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరానికి వేడి కలిగి, శక్తి పెరుగుతుంది. శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. ఇది వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.
నిద్ర లేమి సమస్యకు దూరం:
నిద్రలేమి సమస్య, నిద్ర అంత సులువుగా రాదనే ఫిర్యాదు చేసేవారికి ఖర్జూరం పాలు తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, అమైనో ఆమ్లం, ట్రిప్టోఫాన్ పాలలో లభిస్తాయి. అలాగే ట్రిప్టోఫాన్ ఖర్జూరాలలో కూడా దొరుకుతుంది. ఇది మనస్సును రిలాక్స్ చేసి నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఖర్జూరాలను క్రమం తప్పకుండా పాలలో కలిపి తాగడం వల్ల నిద్రకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్