Karthika Deepam December 24th Episode: కార్తీక్‍కు ఆకలి కష్టం, తల్లడిల్లిన దీప.. వెటకారం చేసి కండీషన్లు పెట్టిన శ్రీధర్-karthika deepam today episode december 24th karthik struggles to buy tiffin sreedhar satires star maa tv channel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam December 24th Episode: కార్తీక్‍కు ఆకలి కష్టం, తల్లడిల్లిన దీప.. వెటకారం చేసి కండీషన్లు పెట్టిన శ్రీధర్

Karthika Deepam December 24th Episode: కార్తీక్‍కు ఆకలి కష్టం, తల్లడిల్లిన దీప.. వెటకారం చేసి కండీషన్లు పెట్టిన శ్రీధర్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 24, 2024 07:37 AM IST

Karthika Deepam 2 December 24th Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. టిఫిన్ కొనేందుకు కూడా కార్తీక్‍కు డబ్బు కష్టాలు ఎదురవుతాయి. కార్తీక్, దీప కలిసి ఒకే ప్లేట్ టిఫిన్‍ను షేర్ చేసుకుంటారు. శ్రీధర్ వచ్చి వెటకారంగా మాట్లాడతాడు.

Karthika Deepam December 24th Episode: కార్తీక్‍కు ఆకలి కష్టం.. తల్లిడిల్లిన దీప.. వెటకారం చేసి రూల్స్ పెట్టిన శ్రీధర్
Karthika Deepam December 24th Episode: కార్తీక్‍కు ఆకలి కష్టం.. తల్లిడిల్లిన దీప.. వెటకారం చేసి రూల్స్ పెట్టిన శ్రీధర్

కార్తీక దీపం 2 నేటి(డిసెంబర్ 24) ఎపిసోడ్ ఏం జరిగిందంటే.. అద్దె ఇంటికి అడ్వాన్స్‌గా మొబైల్ పెడతానని ఓనర్‌ను ఒప్పిస్తాడు కార్తీక్. కష్టంలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనిషికి ఇంత కష్టం వచ్చిందేంటి అని దూరం నుంచి చూస్తూ దీప బాధపడుతుంది. డబ్బు విషయంలో తాను మంచోడిని కాదని, వీలైనంత త్వరగా డబ్బు ఇచ్చి ఫోన్ తీసుకోవాలని ఓనర్ అంటాడు. రెంట్ కూడా ప్రతీ నెలా ఐదో తేదీలోపే కట్టాలని, ఇబ్బంది నా దాకా వస్తే మీకు ఇబ్బంది అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో కార్తీక్ లోలోపల బాధపడతాడు. దీప కూడా బాధగా కార్తీక్ వైపు చూస్తుంది.

yearly horoscope entry point

దీపకు సర్దిచెప్పేందుకు కార్తీక్ ప్రయత్నం

కార్తీక్‍కు ఎంత కష్టం వచ్చిందని దీప అలాగే నిలబడి బాధగా చూస్తుంటుంది. దీపను సంతోషపరిచేందుకు కార్తీక్ ప్రయత్నిస్తాడు. పూల మొక్కలు బాగున్నాయని, గార్డెన్ బాగుందని చెబుతుంటాడు. ఇల్లు తనకు బాగా నచ్చిందని, లోపల ఎలా ఉందో చూద్దాం పదా అంటాడు. దీప మాత్రం అలాగే నిలబడి ఉంటుంది.

ఇల్లు నచ్చలేదని శౌర్య మారాం

తనకు ఈ ఇల్లు నచ్చలేదని, మన ఇంటికి వెళదామని శౌర్య మారాం చేస్తుంది. ఇది మన ఇల్లే అని, పూల మొక్కలు, ఆడుకునేందుకు స్థలం ఉన్నాయని కార్తీక్ అన్నా.. నచ్చలేదని తెగేసి చెబుతుంది. వెళిపోదాం అంటుంది. దీంతో అల్లరి చేయవద్దు అని దీప గట్టిగా అంటుంది. దీంతో శౌర్యను కార్తీక్ బుజ్జగిస్తాడు. ఇల్లు నచ్చలేదంటూ నాన్న బాధ పడతాడు కదా అని అంటాడు. దీంతో నాకు ఇల్లు నచ్చింది నాన్న.. నువ్వు బాధపడకు అంటుంది. ఇక్కడే ఉందామని చెబుతుంది.

ఆకలి కష్టాలు.. తల్లిడిల్లిన దీప

“అమ్మా ఆకలేస్తోంది.. ఏమైనా పెట్టమ్మా.. మార్నింగ్ కూడా టిఫిన్ తక్కువగానే తిన్నా” అని శౌర్య అంటుంది. దీంతో దీప మౌనంగానే తనలో తాను తల్లడిల్లుతుంది. కార్తీక్, కాంచన కూడా బాధపడతారు. హడావుడిగా తీసుకొచ్చేశారు.. బాగా ఆకలేస్తోంది.. ఏమైనా పెట్టమ్మా అని శౌర్య అడుగుతుంది. శౌర్య, దీపను బయటికి తీసుకెళ్లి టిఫిన్ చేయించాలని కాంచన అంటుంది.

జేబులో వందే..

కార్తీక్‍ను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానని అననూయ అంటుంది. నీకే అలా ఉంటే కన్న తల్లిని ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించక్కా అని కాంచన చెబుతుంది. టిఫిన్ చేసేందుకు రోడ్ సైడ్ చిన్న టిఫిన్ బండి దగ్గరికి శౌర్య, దీపను కార్తీక్ తీసుకెళతాడు.

మూడు ప్లేట్‍ల బజ్జీలను కార్తీక్ ఆర్డర్ ఇస్తాడు. జేబులో వంద రూపాయలే ఉండటంతో రెండున్నర ప్లేట్లు చాలంటాడు. అయితే, కార్తీక్ కష్టాన్ని గుర్తించి మూడు ప్లేట్లు ఇస్తాడు టిఫిన్ అమ్మే వ్యక్తి. దీంతో థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్.

ఒకే ప్లేట్ టిఫిన్ షేర్ చేసుకున్న కార్తీక్, దీప

తనకు ఇంకా ఆకలిగా ఉందని, ఇంకా టిఫిన్ కావాలని శౌర్య అంటుంది. దీంతో తనకు ఆకలిగా లేదని, తన ప్లేట్ కూడా తినాలని కార్తీక్ చెబుతాడు. నీటితో కడుపు నింపుకునేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో దీప కార్తీక్ దగ్గరికి వెళుతుంది. అబద్ధాలు కూడా చెప్పడం మొదలుపెట్టారా అని అంటుంది. డబ్బు లేదు కదా అని దీప అంటే ఉన్నాయని చెబుతున్నా కదా అని కార్తీక్ అంటాడు. దీంతో దీప కన్నీరు పెట్టుకుంటుంది.

రెస్టారెంట్ స్టాఫ్‍కు ఎన్ని విధాల సాయం చేస్తున్నది సాయి చెప్పిన విషయాన్ని దీప గుర్తు చేసుకుంటుంది. ఈ కష్టాలు నా వల్లే కార్తీక్ బాబు అని బాధపడుతుంది. ఇంకో ప్లేట్ టిఫిన్ తీసుకునేందుకు డబ్బు లేకనే కదా ఆకలి లేదని శౌర్యకు చెప్పారని అడుగుతుంది. శౌర్య ఆకలి తీర్చుకునేందుకు, నాన్నగా ఆకలి చంపుకోవడం తప్ప ఇప్పుడు ఏం చేయలేనంటాడు కార్తీక్. “ఇది ఇద్దరం తింటే కడుపు నిండుతుంతో లేదో తెలియదు కాని.. మనసు నిండుతుంది” అని దీప అంటుంది. ముందు తినండి అని దీప అంటే.. కలిసే తిందామంటాడు కార్తీక్. ఒకే ప్లేట్ టిఫిన్‍ను ఇద్దరూ పంచుకుంటారు.

శ్రీధర్ ఎంట్రీ.. వెటకారం

అద్దె ఇంట్లో కాంచన బూజు దులుపుతుంటే.. ఆమె భర్త శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. శ్రీమతిగారి చేతిలో బూజుల కర్ర అంటూ చప్పట్లు కొడుతూ వెటకారంగా మాట్లాడతాడు. ఇలాంటి దృశ్యాన్ని చూస్తానని జీవితంలో అనుకోలేదంటాడు. ఇంతలో శ్రీధర్ రెండో భార్య కావేరి ఎంట్రీ ఇస్తుంది. సవతిని చూసి కాంచన షాక్ అవుతుంది. మీరేందుకు వచ్చారని ప్రశ్నిస్తుంది. “కావేరికి నా కూతురు ఫోన్ చేసి జరిగింది చెప్పింది. వినగానే పెద్ద షాక్” అని శ్రీధర్ అంటాడు. కాంచన, కార్తీక్‍ను శివన్నారాయణ గెంటేశాడంటే ముందు కల అనుకున్నానని, గిల్లమని కావేరిని అన్నానని, అప్పుడే నిజమని నమ్మానని శ్రీధర వెంటకారంగా అంటాడు.

వాతలు పెట్టించుకోవాల్సింది.. కార్తీక్ ఫైర్

ఇంతలో కార్తీక్ వస్తాడు. తండ్రి శ్రీధర్‌పై కోపంతో కౌంటర్లు వేస్తాడు. అట్లకాడతో వాతలు వాతలు పెట్టించుకోవాల్సింది.. నమ్మకం ఇంకా బలంగా ఉండేదని అంటాడు. పరువు పోయినా పొగరు తగ్గలేదని శ్రీధర్ అంటే.. తమరు పరువు గురించి మాట్లాడితే అంటూ చెబితే బాగోదని కార్తీక్ అంటాడు. కార్తీక్, కాంచన పరిస్థితిని దెప్పిపొడుస్తూ మాటలు అంటూనే ఉంటాడు శ్రీధర్. మధ్యమధ్యలో చీపురు తీసుకురా అంటూ శ్రీధర్‌ను నిలువరిస్తాడు కార్తీక్. అత్మాభిమానంతో కార్తీక్ అన్నీ కాదనుకొని వచ్చారని దీప సపోర్ట్ చేస్తుంది. అడుక్కునేందుకా అని శ్రీధర్ అనడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. మాటలు పద్ధతిగా లేకపోతే వడ్డీలో కలిపి ఇవ్వడం తనకు సరదా అని కార్తీక్ అంటాడు.

సాయం చేసేందుకు రేవతి రెడీ.. కాంచన సీరియస్

కార్తీక్ హోటల్ పెట్టేందుకు సాయంగా రూ.10లక్షలను ఇచ్చేందుకు రేవతి రెడీ అవుతుంది. బ్యాగ్ ముందు పెడితే ఏంటిది అని కాంచన అడుగుతుంది. “సాయం అని నేను అనలేను. ఎలా అనుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు దీని అవసరం మీకే ఎక్కువగా ఉంది. అందుకే తీసుకొచ్చా” అని రేవతి అంటుంది. కార్తీక్ బిజినెస్ పెట్టేందుకు సాయం రూ.10లక్షలు దీంట్లో ఉన్నాయంటుంది. “దీన్ని తీసేయ్. నీకు మొగుడిని ఇచ్చాను కదా అని నాకు డబ్బులు విసురుతున్నావా” అని కాంచన సీరియస్ అవుతుంది. అది కాదక్కా అని రేవతి అంటుంది. జరిగింది తెలుసుకొని ఊరికే వచ్చి ఉండే సంతోషించే వారమని, డబ్బుతో రావడం నచ్చలేదని కాంచన అంటుంది.

రూల్స్ పెట్టిన శ్రీధర్

నెత్తి మీద దరిద్రదేవత చిందేస్తుంటే ఇవన్నీ ఎలా నచ్చుతాయని శ్రీధర్ మళ్లీ వెటకరిస్తాడు. దీంతో తమకు సాయం చేయాలని స్వప్న చెప్పిందా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. లేదని శ్రీధర్ అంటే.. ఎందుకొచ్చారని కార్తీక్ సీరియస్ అవుతాడు. కాంచన కూడా తనను ఆవేశంతో దూరం చేసుకుందని, పూర్తిగా కూడా వదిలేయలేదని శ్రీధర్ మాటలు అంటాడు. కానీ తాను అంత తేలిగ్గా వదులుకోలేనని చెబుతాడు. దీంతో మళ్లీ చీపురు కట్ట ఎక్కువగా ఉందని, దులుపుదామని కార్తీక్ అంటాడు. దీంతో ఇప్పుడు మీరు పేదవాళ్లు అంటూ వెటకారంగా అంటాడు శ్రీధర్.

గతంలోనూ, ఇప్పుడూ తనన అవమానిస్తున్నారని శ్రీధర్ అంటాడు. తన లాంటి ధైర్యం ఉన్న వాడు గుండె ధైర్యంగా నిలబడతాడని శ్రీధర్ అంటాడు. దీంతో కార్తీక్ మళ్లీ చిరాకు పడతాడు. అప్పుడు అసలు పాయింట్‍కు శ్రీధర్ వస్తాడు. కార్తీక్ రెస్టారెంట్ పెట్టేందుకు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశానని అంటూ షరతులు పెడతాడు. “గతంలో నా భార్య, నా కొడుకు నాకు చేసిన అవమానాలకు సారీ చెప్పాలి. నేను మీతో కలిసి ఉండేందుకు ఒప్పుకోవాలి. ఈ రెండు కండీషన్లకు ఓకే అంటూ కార్తీక్ రెస్టారెంట్ పెట్టేందుకు నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తాను” అని శ్రీధర్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 24) ఎపిసోడ్ ముగిసింది. మరి కార్తీక్ ఈ షరతులకు ఎలా స్పందిస్తాడో తరువాయి భాగంలో తెలుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం