Murauri Recipe: ముల్లంగితో చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!-mururi recipe made with radish is very tasty once you make it you will love it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Murauri Recipe: ముల్లంగితో చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!

Murauri Recipe: ముల్లంగితో చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!

Ramya Sri Marka HT Telugu
Dec 24, 2024 06:30 AM IST

Murauri Recipe: ముల్లంగితో తయారు చేసే ఈ ప్రత్యేక పదార్థాన్ని బీహార్, యూపీ ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రుచికరమైన వంటకాన్ని మీరూ ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ముల్లంగి అంటే నచ్చని వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

ముల్లంగితో చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!
ముల్లంగితో చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!

మీరు రోజువారీ ఆహారంతో విసుగు చెంది, కొత్తగా ఏదైనా తినాలనుకుంటే ముల్లంగితో ఓ వంటకాన్ని తయారుచేసుకోవచ్చు. ముల్లంగి, బియ్యంపిండితో తయారు చేసే ఈ పదార్థాలన్నిుయుపీ, బీహార్ ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. అక్కడి ప్రసిద్ధ వంటకమైన ఈ పదార్థం పేరు మురౌరీ. కొత్త టేస్టుతో బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్ తినాలని మీరు కానీ మీ ఇంట్లో వాళ్లు కానీ కోరుకుంటే మీకు మురౌరీ బెస్ట్ ఛాయిస్. ఈ వంటకం కచ్చితంగా మీకు నచ్చుతుంది. ముల్లంగి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ చాలా మందికి ముల్లంగి తినడం నచ్చదు. అలాంటి వారికి ముల్లంగి, బియ్యంపిండి కలిపి ఈ రెసిపీ చేశారంటే ముల్లంగి నచ్చని వారు కూడా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ఉదయం టిఫిన్ లా, సాయంత్రం స్నాక్స్ లా కెచప్ లేదా కప్పు ఛాయ్ తో దీన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా..

yearly horoscope entry point

ముల్లంగితో మురౌరీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

కావాలసిన పదార్థాలు:

  • తురిమిన ముల్లంగి - రెండు కప్పు
  • నీరు- అరకప్పు
  • ఉప్పు- రుచికి తగినంత
  • బియ్యం పిండి - మూడు కప్పులు
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • కలోంజి గింజలు- ఒక టీ స్పూన్
  • అల్లం - ఒక టీ స్పూన్
  • పసుపు- అరటీస్పూన్
  • ధనియాల పొడి- అర టీస్పూన్
  • ఎండుమిర్చి పొడి- అర టీస్పూన్
  • పచ్చిమిర్చి మూడు
  • నూనె- తగినంత
  • కొత్తిమీర - పిడికెడు

మురౌరి తయారీ విధానం:

  • ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని పొయి మీద పెట్టాలి.
  • దాంట్లో నీరు పోసి ఉప్పు వేయాలి.
  • ప్యాన్లో నీరు మరగుతున్నప్పుడు ముందే శుభ్రంగా తొక్కతీసి తురిమి పెట్టుకున్న ముల్లంగి తురుమును దాంట్లో వేయాలి.
  • ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్రేములో ముల్లంగిని ఉడకనివ్వాలి.
  • ఐదు నుంచి ఆరు నిమిషాల వరకూ ముల్లంగి ఉడికిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు,తురిమిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, తురిమిన కొత్తిమీర ఆకులను వేయాలి. ఇవన్నీ కలిసిపోయేలా పిండిని బాగా కలపాలి.
  • తరువాత దీంట్లో బియ్యం పిండిని వేస్తే కలుపుతూ ఉండాలి. కలపకపోతే పిండి వుండలు, వుండలుగా మిగిలిపోతుంది.పిండి అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేవరకూ పక్కక్కు పెట్టాలి.
  • పిండి చల్లారిన తర్వాత వేరే ఏదైనా గిన్నోలోకి తీసుకుని చక్కగా పిసకండి.
  • పిండి చేతికి అంటుకోకూండా ఉండేందుకు కాస్త పొడిపిండిని తీసుకుని దీంట్లో కలపాలి.
  • తరువాత చేతులకు కాస్త నూనె అంటించుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి టిక్కీలుగా తయారుచేయాలి.
  • ఈ టిక్కీలను మీడియం ఫ్రేములో డీప్ ఫ్రే చేయాలి.
  • బంగారు రంగు వచ్చేంతవరకూ వీటిని ఫ్రై చేసి బయటకు తీసి టిష్యూలో వెయ్యాలి. అంతే టేస్టీ అండ్ క్రిస్పీ మురౌరీ తయారయినట్లే.
  • వీటిని ఏదైనా చట్నీతో లేదా సాస్ తో కలిపి తినచ్చు. ఛాయ్ కి తోడుగా తినేయచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం