Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 499 పాయింట్లు పెరిగి 78,540 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 166 పాయింట్లు పెరిగి 23,753 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 558 పాయింట్లు వృద్ధిచెంది 51,318 వద్దకు చేరింది.
“23870 పైన ఏ స్థాయి అయినా నిఫ్టీ50 సూచీలో పుల్ బ్యాక్‌ను తదుపరి రెసిస్టెన్స్ 24065 దగ్గరికి తీసుకెళుతుంది. 23,500 సమీపకాలంలో బలమైన సపోర్ట్‌గా ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డిప్యూటీ హెడ్ రిటైల్ రీసెర్చ్ దేవర్ష్ వకీల్ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 168.71 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2227.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 4289.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 18774.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.16శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.73శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.98శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కోరమండల్ ఇంటర్నేషనల్- బై రూ. 1868, స్టాప్ లాస్ రూ. 1800, టార్గెట్ రూ. 1989
జెన్ టెక్నాలజీస్- బై రూ. 2566.8, స్టాప్ లాస్ రూ. 2465, టార్గెట్ రూ. 2727
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 1802, స్టాప్ లాస్ రూ. 1785, టార్గెట్ రూ. 1840
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 404, స్టాప్ లాస్ రూ. 396, టార్గెట్ రూ. 425
ఎంసీఎక్స్- బై రూ. 6370, స్టాప్ లాస్ రూ. 6280, టార్గెట్ రూ. 6550
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం