Gold and Silver prices today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు..
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 77,440గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,74,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,744గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర సైతం స్థిరంగా రూ. 70,990 వద్ద ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7,09,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 7,099గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,140గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,590గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,990 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 77,440గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,440గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 70,990గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,440గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,990గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,440గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
ఫెడ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి రేటు ఇలా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,130గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,300గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 91,400గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 98,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 91,300.. బెంగళూరులో రూ. 91,300గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం