Success mantra: సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరూ 30 ఏళ్లలోపే చేయాల్సిన పనులు ఇవే
Succes manthra: మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే, తప్పకుండా చేయాల్సిన పనులు ఉన్నాయి. విజయవంత మవ్వాలని కోరుకునే వ్యక్తి కచ్చితంగా పాటించాల్సిన సూత్రాలను ఇక్కడ ఇచ్చాము.
జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనులు, పాటించాల్సిన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. విజయవంతమైన వ్యక్తి డబ్బుతో మాత్రమే కాకుండా కుటుంబం, అనుబంధాలు, ఆరోగ్యంలో కూడా ధనవంతుడై ఉండాలి. కాబట్టి మీరు జీవితంలో విజయం సాధించాలంటే, మీరు 30 సంవత్సరాల లోపు వయస్సులోనే కొన్ని పనులు చేయాలి. ఇలా 30 ఏళ్లలోపే మీరు కొన్ని పనులు చేయడం వల్ల మీ జీవితం ఎంతో కొంత విజయం సాధించే అవకాశం ఉంది. ముప్పయ్యేళ్ల వయసులోపు ఈ పనులు చేశారంటే మీరు సక్సెస్ అయినట్టే.
ఒక ఆస్తి
మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీ నగరంలో ఒక ఆస్తిని కొనుగోలు చేయండి. అది భూమి లేదా ఫ్లాట్…ఈ రెండింటిలో ఏదైనా ఫర్వాలేదు. ఇది మీకు ఒక గుర్తింపును,శాశ్వత నివాసాన్ని ఇస్తుంది. 30 ఏళ్లు దాటాక ఆస్తి కొనడం భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు పెద్దవాళ్లవుతారు. వారి చదువుల కోసం ఎక్కువ ఖర్చుపెట్టాల్సి రావచ్చు.
పెళ్లి
చాలా మంది కెరీర్ కోసం 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. ముప్పయ్యేళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మీరు విజయవంతం కావాలంటే, అటువంటి ప్రేమపూర్వక, గౌరవప్రదమైన కుటుంబం మీకుండాలి. అందుకోసం మీరు ముప్పయ్యేళ్ల వయసులోపే పెళ్లి చేసుకోవాలి. మీరు మీ తల్లిదండ్రులతో పాటు మీ జీవిత భాగస్వామి, పిల్లలతో హాయిగా ఎక్కువ కాలం జీవించడానికి 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం చాలా అవసరం.
పెట్టుబడి
మీరు చిన్న వయస్సులో సంపాదించడం ప్రారంభిస్తే, ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి. తద్వారా మీ భవిష్యత్తుకు సరిపడా డబ్బు ఉంటుంది. చిన్న వయసులోనే ఇన్వెస్ట్ చేస్తేనే అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల నుంచి మంచి రాబడిని ఇస్తాయి. కాబట్టి పెట్టుబడి చిన్నదా, పెద్దదా అనేది ఆలోచించకండి. మీ స్థాయిలో ఎంతో కొంత పెట్టుబడుల్లో పెట్టేందుకు ప్రయత్నించండి.
నైపుణ్యాలు
విజయం సాధించాలంటే ఏకకాలంలో అనేక విషయాల్లో ప్రావీణ్యం ఉండాలి. సామాజిక నైపుణ్యాలతో పాటు, కెరీర్ సంబంధిత నైపుణ్యాలు కూడా ఉండాలి. తద్వారా కెరీర్, కుటుంబం ముందుకు సాగుతుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించండి.
ఆరోగ్యం
ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉంటే ఆ ఫలాలను ఆస్వాదించగలరు. కాబట్టి విజయం సాధించడంలో ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మానసిక, శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటేనే, మీరు మీ కెరీర్ పై దృష్టి పెట్టగలుగుతారు.
పైన చెప్పిన అంశాలను ముప్పయ్యేళ్ల లోపు సాధించి చూడండి. ఆ తరువాత జీవితం ఎంతో అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. కెరీర్ ను ముప్పయ్యేళ్ల లోపే సెట్ చేసుకోవాలి, ఆర్ధికంగానూ బలపడాలి. దానికి మీరు మీ ఇరవైల్లోనే ఎంతో కష్టపడాలి.