Brahmamudi December 24th Episode: అత్తింట్లో కావ్య పరిపాలన, తిండిపై ఆంక్షలు- ప్రకాశం రిటైర్‌మెంట్- రుద్రాణి కొత్త స్కెచ్
Brahmamudi Serial December 24th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో అత్తింట్లో అందరికి కావ్య తన రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలని, డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంది కావ్య. డౌట్లు లేవు ఆటే మొదలు అని ప్రకాశం అంటాడు. దాంతో ఇంట్లో కావ్య పరిపాలన మొదలైందని, పట్టు కోల్పోతున్నామని రుద్రాణి అంటుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇక నుంచి ఇంట్లో నేను చెప్పిందే అమలు జరగాలి. అర్థమైందా. ఎనీ డౌట్స్ అని కావ్య అంటే.. అబ్బే నో డౌట్స్. ఆల్ రైట్స్ అని ప్రకాశం అంటాడు. విన్నారా అత్తయ్య. ఏంటిదంతా. నీ మనవరాలు రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఇంటిపెద్దగా మీరు మాట్లాడరా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
కావ్యను అడుగు
నా పెద్దరికాన్ని నువ్వెప్పుడు నిలబెట్టావ్. నీ వల్ల నా భర్త హాస్పిటల్ పాలు అయితే ఆస్థికోసం గొడవ పెట్టావ్. నన్ను ఓదార్చావా. నోటి దాకా వెళ్లిన అన్నం ముద్దను కూడా తినకుండా చేశావ్. సరే మీ తప్పులన్నీ నాకెందుకు కానీ. మా ఆయన ఆస్తి మొత్తం కావ్య మీద రాశారు. నా మీద కూడా రాయలేదు. మీరంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారని ఆయన ముందే ఆలోచించారు. ఇక నుంచి ఏం కావాలన్న కావ్యను అడుగు. నేను కూడా అడుగుతాను అని ఇందిరాదేవి అంటుంది.
నీ కోడలు ఇలా మాట్లాడటం సమంజసమా అని ధాన్యలక్ష్మీ అంటుంది. కాదు. బొట్టు బిల్లలు అవి అవసరం అయితే డబ్బు ఇవ్వు. అవి కూడా బిల్ తీసుకొచ్చి ఇస్తేనే అని అపర్ణ అంటుంది. ఏంటీది జాతరకు పిల్లలకు కొనిచ్చినట్లు బిల్లులు ఇచ్చి తీసుకోవాలా అని రుద్రాణి అంటుంది. ఏం చేస్తాం. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉంది. నా కొడుకు ఏం కావాలన్న కావ్య మీదే ఆధారపడాలి. ఏం రాజ్ అని అపర్ణ అంటే.. అవును మమ్మీ. ఇందాక నా ఫోన్ బిల్ కూడా కావ్యనే పే చేసిందని రాజ్ అంటాడు.
ఏయ్ రాజ్ ఆఖరికి నువ్వు కూడా అని రుద్రాణి అంటే.. నానమ్మే ఏం అనలేకపోయింది. నేను మాత్రం ఏమంటాను అత్త. కళావతి చేతిలో తాళాల గుత్తి ఉంది. తను ఎలా చెబితే అలా నడుచుకుందాం అని రాజ్ అంటాడు. థ్యాంక్స్ అండి మీకు అర్థమైంది. వీళ్లకే డైజెస్ట్ కావడానికి టైమ్ పడుతుంది అని కావ్య అంటుంది. ఇప్పుడు నా పాకెట్ మనీకి కావ్యను అడుక్కోవాల అని రాహుల్ అంటే.. ఛీ పో.. అవ్వకు లేక అడుక్కుంటే తాతయ్య వచ్చి కొత్త సినిమాకు టికెట్స్ కావాలన్నాడట అని రుద్రాణి చిరాకుపడుతుంది.
మిమ్మల్ని చూసే నేర్చుకున్నా
కాస్తా డైజెస్ట్ అయినట్లుంది. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా అని కావ్య అంటే.. డౌటే లేదు. ఆటే మొదలైనట్టుందని ప్రకాశం అంటాడు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. గదిలో కళావతి ఒకటి అడగనా. జాలి, దయ అని ఇంకొకరు హర్ట్ కాకుండా మాట్లాడేదానివి. ఇప్పుడు రూల్స్ అంటూ స్ట్రిక్ట్‌గా మాట్లాడుతున్నావ్. ఎవరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అందరి నోళ్లు మూయిస్తున్నావ్. అసలు నువ్వేనా అని రాజ్ అంటాడు. నాలో ఉన్న మీరు. మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. మీరు ఒక బాస్‌గా అందరితో ఎలా ఉంటారో. అదే ఇంట్లో ఇంప్లిమెంట్ చేశాను అని కావ్య అంటుంది.
అలా చేస్తే అందరు నిన్ను తిట్టుకుంటారు అని రాజ్ అంటే.. నాకు కావాల్సింది ఇంటి గౌరవం, తాతయ్య గారి మాట. దానికోసం ఇంట్లోవాళ్లకు శత్రువుగా మారిన పర్వాలేదు. వారికి డౌట్ రాకుండా నేను చూసుకుంటాను. ఇన్నాళ్లు వీళ్లకోసమే తాతయ్య కష్టపడింది. ఇప్పుడు దాంట్లో పాలు పంచుకోలేరా. ఇలా లెక్కపత్రాలు లేకుండా డబ్బు ఖర్చు చేయడానికి నేను ఒప్పుకోను. డబ్బు విలువ తెలుసు కాబట్టి ఇలా చేస్తున్నాను అని కావ్య అంటుంది.
ఆఫీస్, ఇంట్లో సపోర్ట్‌కు థ్యాంక్స్ అని రాజ్ చెబుతాడు. మీకు కూడా థ్యాంక్స్. పెళ్లాం చేసిన పనికి థ్యాంక్స్ చెప్పిన మొగుడు దొరికినందుకు అని కావ్య అంటుంది. మరుసటి రోజు ఉదయం ఇప్పుడు మనకు డబ్బు రాదంటావా. ఇది నాకు మింగుడు పడట్లేదే . ఇంత అవమానం తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని ధాన్యలక్ష్మీతో రుద్రాణి చెప్పుకుంటుంది. నేను ఎవరికి చెప్పుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో పనిమనిషి శాంత వస్తుంది.
ఇంట్లో చేయడం కుదరదు
నేను దీన్ని వద్దన్నా కదా. ఇదేందుకు వస్తుందనుకున్న రుద్రాణి శాంతను ఆపుతుంది. ఇక్కడ కాకుంటే ఇంకెక్కడైన పని చేసుకుంటున్నావ్. ఎక్కడ దొరక్కా ఇలా వచ్చావా అని రుద్రాణి అంటే.. మర్యాదగా మాట్లాడండి. నేను పరాయిపంచనచేరి బతకట్లేదు. నా కాళ్ల మీద నిలబడి బతుకుతున్నాను. మేడమ్ ఫోన్ చేస్తేనే నేను వచ్చాను అని శాంత అంటుంది. నేను తీసుకొచ్చాను అని కావ్య చెబుతుంది. నేను ఆఫీస్‌కు వెళ్తున్నాను. ఇంట్లోనే ఉండి చేయడం కుదరదు. అందుకే శాంతను రమ్మన్నాను అని కావ్య గట్టిగా చెబుతుంది.
వేరేవాళ్లు ఎలా చేస్తారో స్టెల్లాను చూశారుగా. అమ్మమ్మగారికి శాంత వంట అలవాటు కాబట్టి తింటారు అని కావ్య చెబుతుంది. అంటే ఇంట్లో నా మాటకు విలువలేదా అని రుద్రాణి అంటుంది. అంటే అమ్మమ్మ గారి గురించి మీకు పట్టింపే లేదా అని కావ్య అంటుంది. మాటకు మాట సమాధానం చెప్పకు అని రుద్రాణి అంటే.. నేనింతేనండి. మా స్వప్నక్క కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివాను. కానీ పెద్దవాళ్లను గౌరవించడం తెలుసు అని కావ్య అంటుంది.
శాంతను బయటకు వెళ్లమంటే.. లోపలికి వెళ్లమని కావ్య చెబుతుంది. మీకు ఇంకా అర్థం కావట్లేదా. నౌకరులను ఉంచాలన్న, తీయాలన్న నేను చేయాలి. డబ్బులిచ్చేది నేను. అలాగే, నేను చెప్పినట్లు చేయు అని కావ్య ఆర్డర్ గట్టిగా వేస్తుంది. ఏంటీ వదినా నీ కోడలు అంత పొగరుగా మాట్లాడుతుంటే ఏమనవా అని రుద్రాణి అంటుంది. నేను చెప్పింది నువ్వు. ధాన్యలక్ష్మీ ఎప్పుడు విన్నారు. వినని వారు నన్నెలా సపోర్ట్ చేయమంటున్నారు. మీరు ఆ హక్కును ఎప్పుడో పోగొట్టుకున్నారు. నౌకరుల దగ్గర హుందాగా నడుచుకోపోతే ఇలాగే జరుగుతుంది అని అపర్ణ అంటుంది.
ఇప్పుడే ఏం చెప్పలేం
తర్వాత ఈ ఇంట్లో కావ్య పరిపాలన మొదలైపోయింది. పాత కోపాలు, కక్షలు తీర్చుకుంటుంది. ఈ ఇంట్లో మన పట్టు కోల్పోతున్నాం. అది నువ్వు గ్రహించు అని ధాన్యలక్ష్మీతో రుద్రాణి అంటుంది. మరోవైపు సీతారామయ్యను చెక్ చేస్తారు డాక్టర్స్. ఎప్పుడు కోలుకుంటారు అని ఇందిరాదేవి అడుగుతుంది. ఎంతమందికి, ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడే మేము ఏం చెప్పలేం అని డాక్టర్ అంటే.. ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. కల్యాణ్ సర్దిచెప్పుతాడు.
మీ బాధ అర్థం చేసుకోగలం. కానీ టైమ్ పడుతుంది అని డాక్టర్ అంటాడు. నీ మనవళ్లు, డాక్టర్స్ ఏం చేయలేకపోతున్నారు. తొందరగా లేచి రా బావా అని ఇందిరాదేవి అంటే.. ఆ గుండె నీకోసమే కొట్టుకుంటుంది. పైకి లేవలేకపోయినా నిన్ను ఓదార్చాలనుకుంటున్నారు అని కల్యాణ్ అంటాడు. మరోవైపు చాలా ఆకలిగా ఉంది ఇవాళ అని రుద్రాణి అంటుంది. చాలా టిఫిన్స్ ఉన్నట్టున్నాయి తిను అని ధాన్యలక్ష్మీ అంటుంది. కానీ చూస్తే ఒక్క ఇడ్లీనే ఉంటుంది.
మొత్తం ఇడ్లీ అయ్యేసరికి రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ చిరాకుపడతారు. కావ్య మేడమే ఇడ్లీ చేయమన్నారు. రోజుకు ఒక టిఫినే చేయమన్నారు. అందరూ ఇదే తినాలన్నారు. మేడమ్ వస్తున్నారు ఆవిడనే అడగండి అని శాంత అంటుంది. నా ముందు మేడమ్ అనకు అని రుద్రాణి అంటుంది. జీతం ఇచ్చే ఆవిడను మేడమ్ అని పిలిస్తే మీకేంటీ అని శాంత అంటుంది. ఆ మాటలన్నీ అపర్ణ వింటుంది. ఇంతలో కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది.
లక్షల లక్షలు వేస్ట్ చేశారు
రోజు నాలుగైదు రకాలు ఉండేవి. ఇవాళ ఏంటీ అని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అడుగుతారు. మీరు అడిగినవన్నీరోజుకు ఒకటి వస్తుంది అని కావ్య అంటుంది. నాలుగైదు రకాలు చేయాలి. నచ్చింది తింటాం అని రుద్రాణి అంటుంది. అదే ఒకటి తిని మిగతావి పక్కన పెట్టేస్తున్నారు. అన్నీ చెత్తబుట్ట పాలవుతున్నాయి. అందుకే అన్ని రకాలు చేయడం, పాడు చేయడం కుదరదు. ఇన్నాళ్లు లక్షలు లక్షలు వేస్ట్ చేశారు. డబ్బు, ఆహార పదార్థాలను దుబారా చేయడం నాకు నచ్చుదు. నేను అలా చేయనివ్వను అని కావ్య అంటుంది.
ఇప్పుడు నువ్ చెప్పినట్లు ఇడ్లీలు మాత్రమే తని కడుపునింపుకోవాలా. మాకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుని తింటాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాన్ని అయితే నువ్ ఆపలేవు కదా అని రుద్రాణి అంటుంది. దాంతో వాళ్లు వెళ్లిపోతారు. ప్రకాశం దగ్గరికి వెళ్లి అరుస్తుంది. కోట్లు సంపాదిస్తున్నట్లు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు. ఇంట్లో జరిగే చిల్లర గొడవల గురించి అస్సలు పట్టించుకోరు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఒకప్పుడు కోట్ల బిజినెసే చేశాను కదే. ఇప్పుడంటే రాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు కాబట్టి రిటైర్‌మెంట్ ఎంజాయ్ చేస్తున్నా. ఖాళీగా ఉండటం దేనికని షేర్ ట్రేడింగ్ చేస్తున్నా. అందులో తప్పేముంది. ఇంట్లో గొడవలు అంటావా. నువ్వే అన్నావుగా చిల్లర గొడవలు అని. ఇక పట్టించుకోవడం ఎందుకు అని ప్రకాశం అంటాడు. అది ఇష్టం వచ్చినట్లు చేస్తుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.
కొత్త ప్లాన్
తర్వాత కావ్య, రాజ్ వస్తే.. వచ్చావా నీకోసమే ఎదురుచూస్తున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. మా కార్డ్స్‌ను ఎందుకు బ్లాక్ చేశావ్ అని రుద్రాణి అడుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదని బ్లాక్ చేశాను అని కావ్య అంటుంది. మరి అత్తింటివాళ్ల కార్డ్స్ బ్లాక్ చేసి మీ అక్కకు గోల్డ్ నెక్లెస్ కొనియొచ్చా. అది అనవసరమైన ఖర్చు కాదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో దీనికి డబ్బు ఎక్కడిది అని స్వప్నను నిలదీస్తుంది కావ్య. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అని స్వప్న అనడంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్