WhatsApp : అలర్ట్​! ఈ ఫోన్స్​లో ఇక వాట్సాప్​ పని చేయదు..!-using these android phones whatsapp wont work for you starting january 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp : అలర్ట్​! ఈ ఫోన్స్​లో ఇక వాట్సాప్​ పని చేయదు..!

WhatsApp : అలర్ట్​! ఈ ఫోన్స్​లో ఇక వాట్సాప్​ పని చేయదు..!

Sharath Chitturi HT Telugu
Dec 24, 2024 09:00 AM IST

2025 జనవరి 1 నుంచి పలు ఫోన్స్​లో ఆండ్రాయిడ్​ సేవలు నిలిచిపోనున్నాయి. వీటిల్లో పలు శాంసంగ్​ గెలాక్సీ మోడల్స్​ కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా? ఈ లిస్ట్​లో ఏ ఫోన్స్​ ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఫోన్స్​లో ఇక వాట్సాప్​ పని చేయదు..!
ఈ ఫోన్స్​లో ఇక వాట్సాప్​ పని చేయదు..! (Bloomberg)

కోట్లాది మంది ఉపయోగించే ఇన్​స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్! ఈ యాప్ లేకపోతే చాలా మంది తమ దైనందిన జీవితంలో, ముఖ్యంగా భారతదేశంలో కమ్యూనికేట్ చేయడం కష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇప్పుడు కొన్ని ఫోన్స్​లో వాట్సాప్​ పనిచేయడం ఆపేస్తుంది. 2025 జనవరి 1 నుంచి పలు గ్యాడ్జెట్స్​లో వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందుకు కారణాలు, ఆ ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

వాట్సాప్​ వినియోగదారులకు అలర్ట్​..

10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆండ్రాయిడ్ కిట్​క్యాట్​తో నడుస్తున్న ఫోన్స్​పై వాట్సాప్ సపోర్ట్​ని నిలిచిపోనుంది. హెచ్​డీబ్లాగ్ గుర్తించినట్లుగా.. ఇప్పటికీ ఆండ్రాయిడ్ కిట్​క్యాట్​తో నడుస్తున్న పరికరాలు 2025 జనవరి 1 నుంచి ఈ యాప్​ సేవలను యాక్సెస్ చేయలేవని మెటా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్​ సేవలు నిలిచిపోయే ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్​: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 3, శాంసంగ్ గెలాక్సీ నోట్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎ3, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 4 మినీ

ఎల్​జీ: ఎల్​జీ ఆప్టిమస్ జీ, ఎల్​జీ 2 మినీ, ఎల్​జీ ఎల్ 90

సోనీ: సోనీ ఎక్స్​పీరియా జెడ్, సోనీ ఎక్స్​పీరియా ఎస్ పీ, సోనీ ఎక్స్​పీరియా టీ, ఎక్స్​పీరియా వీ

హెచ్​టీసీ: హెచ్​టీసీ వన్ ఎక్స్, హెచ్​టీసీ వన్ ఎక్స్ ప్లస్, హెచ్​టీసీ డిజైర్ 500, హెచ్​టీసీ డిజైర్ 601

మోటరోలా: మోటో జీ (ఫస్ట్ జనరేషన్), మోటరోలా ఆర్​ఏజెడ్​ఆర్​ హెచ్​డీ, మోటో ఈ (2014).

ఈ ఫోన్స్​ యూజర్లు ఏం చేయాలి?

మీరు ఇంకా ఈ డివైజ్​లు లేదా ఆండ్రాయిడ్ కిట్​క్యాట్​తో నడిచే ఏదైనా డివైజ్​ను ఉపయోగిస్తుంటే.. వెంటనే మీ వాట్సప్ డేటాను బ్యాకప్ చేసుకోవాలి. అనంతరం సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ వర్షెన్​తో లేటెస్ట్ డివైజ్​కు మారాలి. మీ డేటా సురక్షితంగా ఉండేలా కొత్త ఫోన్​కు మైగ్రేట్ అయ్యేలా చూసుకోండి.

పాత ఆండ్రాయిడ్ డివైజ్​లు మాత్రమే వాట్సాప్​కు సపోర్ట్ కోల్పోవడం లేదు. ఇటీవల, మెటా అనేక ఐఫోన్లకు సపోర్ట్​ని తగ్గించేసింది.

న్యూఇయర్​ కోసం వాట్సాప్​లో కొత్త ఫీచర్​..

వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వీడియో కాల్స్ సమయంలో ఫిల్టర్లు- ఇంప్రెషన్స్​ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాట్​ఫామ్​ కొత్త యానిమేటెడ్ రియాక్షన్లను కూడా పరిచయం చేసింది. వినియోగదారులు ఎంపిక చేసిన పార్టీ ఎమోజీలతో ప్రతిస్పందించినప్పుడు, పంపిన వ్యక్తి, రిసీవర్ ఇద్దరికీ ఒక కన్ఫెట్ యానిమేషన్ కనిపిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం