Google Android update: మరో ముఖ్యమైన ఆండ్రాయిడ్ అప్ డేట్ ను రిలీజ్ చేసిన గూగుల్
Google Android update: ఆండ్రాయిడ్ కు సంబంధించిన మరో కీలక అప్ డేట్ ను గూగుల్ విడుదల చేసింది. ఆండ్రాయిడ్16 డెవలపర్ ప్రివ్యూ ఇప్పటికే పిక్సెల్ పరికరాలకు అందుబాటులో ఉంది. ఇది గూగుల్ సాధారణ విడుదల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే పిక్సెల్ డివైజెస్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google Android update: ఆండ్రాయిడ్ 15 అప్ డేట్ గత నెలలోనే లాంచ్ అయింది. అయితే, ఒకవేళ మీ వద్ద గూగుల్ పిక్సెల్ డివైజ్ ఉంటే, మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్ 16 అప్ డేట్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూ
ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూ ఇప్పటికే పిక్సెల్ 9 సిరీస్ తో సహా పిక్సెల్ పరికరాలకు అందుబాటులో ఉంది. సాధారణంగా గూగుల్ విడుదల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే పిక్సెల్ యూజర్లకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది సాధారణంగా గూగుల్ ఐ / ఓ ఈవెంట్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ ముందస్తు విడుదల టెక్ ఔత్సాహికులు, డెవలపర్లు ఆండ్రాయిడ్ 16 ను ముందుగానే మార్చుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, స్పష్టంగా చెప్పాలంటే, ఈ వెర్షన్ సాధారణ ప్రజల కోసం ఉద్దేశించినది కాదు. ఇందులో పలు బగ్స్, ఇన్ కన్సిస్టెన్సీస్ ఉండే అవకాశం ఉంది. డెవలపర్లు తమ యాప్ లను ఆప్టిమైజ్ చేయడం, ఫీచర్లను ప్లాన్ చేయడం మరియు భవిష్యత్తు ఓఎస్ అప్ డేట్ లకు సిద్ధం కావడం దీని ఉద్దేశ్యం.
ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూలో కీలక ఫీచర్లు
ఆండ్రాయిడ్ 16 ఈ ప్రారంభ వెర్షన్ కొన్ని మార్పులను మాత్రమే ప్రవేశపెట్టినప్పటికీ, అవి గుర్తించదగిన అప్ డేట్స్. వీటిలో ఫోటో పికర్ ఎన్హాన్స్మెంట్ వినియోగదారులను వారి మొత్తం గ్యాలరీకి బదులుగా ఎంపిక చేసిన ఫోటోలు, వీడియోలకు ఇతర యాప్స్ కు యాక్సెస్ ను ఇవ్వడానికి అనుమతిస్తుంది. దీనివల్ల ఎక్కువ గోప్యత, నియంత్రణ సాధ్యమవుతుంది. వినియోగదారు సమ్మతితో, యాప్స్ ఇప్పుడు వైద్య రికార్డులను యాక్సెస్ చేయగలవు. యూజర్ డేటాను వివిధ యాప్స్ యాక్సెస్ చేయడం, భాగస్వామ్యం చేయడంపై కఠినమైన పరిమితులను కూడా ఏర్పరుస్తాయి, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండేలా చూసుకుంటుంది.
ఆండ్రాయిడ్ 16 ప్రతి ఒక్కరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది?
గూగుల్ తన డెవలపర్ వెబ్సైట్లో పేర్కొన్న దాని ఆధారంగా, ఆండ్రాయిడ్ (android) 16 మొదటి డెవలపర్ ప్రివ్యూ ఇప్పుడు నవంబర్లో విడుదల అయింది. తరువాత డిసెంబర్లో మరొక డెవలపర్ ప్రివ్యూ విడుదల కానుంది. గూగుల్ (google) తన సాధారణ బీటా విడుదలలను జనవరి 2025 లో ప్రారంభిస్తుంది. తరువాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో అదనపు విడుదలలను ప్రారంభిస్తుంది. 2025 ఏప్రిల్ తర్వాత గూగుల్ తుది బిల్డ్ ను విడుదల చేయనుంది.
ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూను సపోర్ట్ చేసే పిక్సెల్ పరికరాలు
ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూను సపోర్ట్ చేసే గూగుల్ పిక్సెల్ (google pixel) పరికరాల జాబితా ఇదే.
- పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో
- పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఎ
- పిక్సెల్ ఫోల్డ్
- పిక్సెల్ టాబ్లెట్
- పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో
- పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్