OTT Movies: ఓటీటీలోకి మొత్తంగా 24 సినిమాలు- ఇవాళ 6, ఇంట్రెస్టింగ్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- ఇక్కడిక్కడ చూసేయండి!-ott movies telugu this week bhool bhulaiyaa 3 squid game season 2 sorgavasal digital streaming on netflix amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలోకి మొత్తంగా 24 సినిమాలు- ఇవాళ 6, ఇంట్రెస్టింగ్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- ఇక్కడిక్కడ చూసేయండి!

OTT Movies: ఓటీటీలోకి మొత్తంగా 24 సినిమాలు- ఇవాళ 6, ఇంట్రెస్టింగ్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- ఇక్కడిక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Dec 24, 2024 10:53 AM IST

OTT Movies Releasing This Week Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఆరు సినిమాలు స్ట్రీమింగ్ కానుండగా.. వారంలో మొత్తంగా 24 రిలీజ్ అవనున్నాయి. వీటన్నింటిలో ఆరు చాలా స్పెషల్‌గా ఉంటే.. అందులో నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్నీ హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ జోనర్స్‌లో ఉన్నాయి.

ఓటీటీలోకి మొత్తంగా 24 సినిమాలు- ఇవాళ 6, ఇంట్రెస్టింగ్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- ఇక్కడిక్కడ చూసేయండి!
ఓటీటీలోకి మొత్తంగా 24 సినిమాలు- ఇవాళ 6, ఇంట్రెస్టింగ్‌గా 6- తెలుగులో 4 స్ట్రీమింగ్- ఇక్కడిక్కడ చూసేయండి!

OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే డిసెంబర్ 23 నుంచి 29 వరకు 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో హారర్, ఫాంటసీ, డిటెక్టివ్ యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ కామెడీ వంటి అన్ని రకాల జోనర్స్‌ ఉన్నాయి. మరి అవన్నీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

యువర్ ఫ్రెండ్, నేట్ బార్గేట్జ్ (ఇంగ్లీష్ టీవీ ప్రోగ్రామ్)- డిసెంబర్ 24

ఆరిజిన్ (ఇంగ్లీష్ మిస్టరీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 25

ఆస్టరాయిడ్ సిటీ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ)- డిసెంబర్ 25

స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 26

భూల్ భులయ్యా 3 (హిందీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 27

సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 27

మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

డాక్టర్ హూ జాయ్ టు ది వరల్డ్ (ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 25

బఘీరా (హిందీ డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 25

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం)- డిసెంబర్ 24

ది రౌండప్ పనిష్‌మెంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ డిటెక్టివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 24

స్పైడర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 24

పార్టీ టిల్ ఐ డై (హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 24 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ)

గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- డిసెంబర్ 25

జంప్ స్టార్ట్ మై హార్ట్ (స్పానిష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 25

థానారా (మలయాళ చిత్రం)- డిసెంబర్ 27

యువర్ ఫాల్ట్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27

జియో సినిమా ఓటీటీ

డాక్టర్స్ (హిందీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 27

సురక్ష (భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 27

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

పంచాయత్ జెట్టీ (మలయాళ చిత్రం)- డిసెంబర్ 24

ఐ యామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- డిసెంబర్ 25

ఖోజ్ పర్చాయియోన్ కే ఉస్ పార్ (హిందీ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 27

మదర్స్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- డిసెంబర్ 27

హ్యారీ పోటర్ విజార్డ్స్ ఆఫ్ బేకింగ్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- డిస్కవరీ ప్లస్- డిసెంబర్ 27

ఆరు స్పెషల్

ఇలా ఈ వారం ఓటీటీలోకి 24 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఇవాళే 6 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటన్నింటిలో మొత్తంగా తెలుగు డబ్బింగ్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2, హిందీ బ్లాక్ బస్టర్ కామెడీ హారర్ చిత్రం భూల్ భులయ్యా 3 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తెలుగులో నాలుగు

వీటితోపాటు తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం సొర్గవాసల్, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ గ్లాడియేటర్ 2, ది రౌండప్ పనిష్‌మెంట్, స్పైడర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అయితే, వీటిన్నింటిలో మొత్తంగా ఆరు స్పెషల్‌గా ఉంటే వాటిలో ఏకంగా నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

Whats_app_banner