తెలుగు న్యూస్ / ఫోటో /
AP Rains Update: బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, ఆంధ్రాను వీడని వానలు, రెండు మూడు రోజుల్లో మరో అల్పపీడనం
- AP Rains Update:బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడు తుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Rains Update:బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడు తుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 10)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో గురువారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. (unsplash.com)
(2 / 10)
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వ తీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశా ఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబే డ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదా వరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురు స్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరిం చింది.
(3 / 10)
బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.
(4 / 10)
మంగళవారం నెల్లూరు, ప్రకాశం, తిరు పతి, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణు డొకరు తెలిపారు. మరోవైపు ఈనెల 26వ తేదీ తర్వాత ఆగ్నేయ బంగాళా ఖాతం, దానికి ఆనుకుని భూమధ్యరేఖ పరిసరాల్లోని హిందూ మహాస ముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు.
(5 / 10)
అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కళింగపట్నం, విశాఖ పట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడు లోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో కోస్తా జిల్లా లకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
(6 / 10)
బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బలపడుతుందా, బలహీనపడుతుందా అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. ప్రస్తుతం మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్త్రి న్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
(7 / 10)
అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 25న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, 26న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీవర్గాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45, అప్పుడప్పుడు 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నం దున బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.(@APSDMA)
(8 / 10)
సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకో స్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తా యని వివరించింది.
(9 / 10)
మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యా హ్నానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పంటలు చేతికి అందే సమయం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది
(10 / 10)
సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కి. మీ. వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం సూచించింది. డిసెంబర్ నెలలోబంగాళాఖా తంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటవెంటనే వస్తు న్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు అల్పపీడనాలు/వాయుగుండాలు రాగా మూడోది ఐదు రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరిగి ఇటు తిరిగి చెన్నై, శ్రీహరికోటలకు సమాంతరంగా సముద్రంలో కొనసాగు తోంది.
ఇతర గ్యాలరీలు