Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజు కన్నింగ్ ప్లాన్- మౌనికకు తెలిసిన నిజం- తండ్రి చెప్పిన వినిపించుకోని బాలు-gunde ninda gudi gantalu serial december 24th episode sanju deceives mounika and reveals truth about balu fight star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజు కన్నింగ్ ప్లాన్- మౌనికకు తెలిసిన నిజం- తండ్రి చెప్పిన వినిపించుకోని బాలు

Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజు కన్నింగ్ ప్లాన్- మౌనికకు తెలిసిన నిజం- తండ్రి చెప్పిన వినిపించుకోని బాలు

Sanjiv Kumar HT Telugu
Dec 24, 2024 10:06 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial December 24 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో మౌనికతో ప్రైవేట్‌గా మాట్లాడిన సంజు తన అన్నయ్య బాలుతో జరిగిన గొడవ గురించి నిజం చెబుతాడు. బాలు వచ్చి గొడవ చేసినా మౌనిక మ్యానేజ్ చేసేలా సంజు మాస్టర్ స్కెచ్ వేస్తాడు. కానీ, బాలు వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు.


గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 24 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 24 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనికతో పర్సనల్‌గా మాట్లాడిన సంజు తన మొదట పెళ్లి ఫిక్స్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం, మౌనికను ఫాలో అవ్వడం, తననే నిజంగా ప్రేమించినట్లు అనిపించడం అని చెబుతాడు. దాంతో మౌనిక సిగ్గుపడుతుంది.

yearly horoscope entry point

జీవితంలో మందు తాగను అని

అది చూసి బాగా వర్కౌట్ అవుతుందని మనసులో అనుకున్న సంజు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. విని తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. అమ్మాయి మోసం చేసిందని డిప్రెషన్‌లోకి వెళ్లిన నేను ఫ్రెండ్స్‌తో తాగడానికి బార్‌కు వెళ్లాను. అక్కడ మీ బాలు అన్నయ్యతోనే గొడవ జరిగింది. తప్పు మా ఇద్దరిది కాదు. తాగిన మందుది. ఆ తర్వాత నేను జీవితంలో మందు తాగను అని మానాన్నతో చెప్పాను. మీ బాలు అన్నయ్య ఉంటే సారీ కూడా చెప్పాలని అనుకున్నాను అని సంజు అంటాడు.

ఈ రెండు విషయాలు ఎవరిద్వారానో తెలుస్తే నేను దాచిపెట్టినట్లు అవుతుంది. ఇదే కాదు ఏ విషయం కూడా నీ దగ్గర దాచిపెట్టను అని నీకు ప్రామిస్ చేస్తున్నాను అని మౌనిక చేయి తీసి ప్రామిస్ చేస్తాడు సంజు. ఇద్దరూ రొమాంటిక్‌గా చూసుకుంటారు. తర్వాత ఇద్దరు వెళ్తారు. మౌనిక మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు అని మీనా అంటుంది. దాంతో అవును అన్నట్లుగా తల ఊపుతుంది మౌనిక. దాంతో అంతా సంతోషపడితే.. సంజు తల్లి సువర్ణ మాత్రం బాధపడుతుంది.

వెంటనే ముహుర్తాలు పెట్టేసుకుందాం. వారం తర్వాత ముహుర్తాలు లేవట. ఎప్పుడైనా చేసేదే కదా అని నీలకంఠం అంటాడు. దాంతో సత్యం ఆలోచిస్తాడు. ఇచ్చిపుచ్చుకోవడం గురించి అనుకోవాలి కదా అని రంగా అంటాడు. మాకే బోలేడు ఆస్తి ఉంది. కట్నకానుకలు మాకెందుకు అని నీలకంఠం అంటాడు. అది కాదు బాలు ఇంకా రాలేదని సత్యం అంటాడు. దాంతో నీలకంఠం పంతులుకు సైగ చేస్తాడు. వర్జ్యం పోయి మంచి గడియలు వచ్చాయి. ఇప్పుడు తాంబూళాలు ఇస్తే మంచిది కదా అని పంతులు అంటాడు.

భయపడిన సంజు

అవునండీ. మనం ఉన్నాం కదా అని ప్రభావతి అంటుంది. దాంతో సరే అని సత్యం అంటాడు. ఇంతలో బైక్‌పై బాలు వస్తాడు. సత్యం, నీలకంఠం తాంబూళాలు ఇచ్చిపుచ్చుకోడానికి లేస్తారు. మావయ్య ఆయన వచ్చేశారు అని మీనా చెబుతుంది. లోపలికి బాలు వస్తుంటాడు. మనం వేసిన ప్లాన్ కొంపదీసి వీడికి తెలిసిపోయి వచ్చేశాడా. ఇప్పుడు ఏం చేయాలి అని సంజు భయపడతాడు. లోపలికి వచ్చిన బాలుకు రంగా పరిచయం చేస్తాడు.

అబ్బాయ్ సంజయ్ అని రంగా చెప్పడంతో బాలు చూసి.. వీడా.. వీడా పెళ్లి కొడుకు అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అనుకున్నా మా అమ్మ తెచ్చిన సంబంధం అన్నప్పుడే ఇలాంటి దరిద్రపు గొట్టు సంబంధం అయి ఉంటుందని. ఏరా నీకు నా చెల్లెలిని ఇవ్వడం జన్మలో జరగదు. మీ వాళ్లను తీసుకని బయటకు నడు అని బాలు వార్నింగ్ ఇస్తాడు. ఏంట్రా ఇలా వాగుతున్నావ్ అని ప్రభావతి అంటుంది. ఏమైందిరా అని సత్యం అంటాడు.

వీడు పచ్చితాగుబోతు నాన్నా. తాగి ఎవడిమీద పడితే వాడి మీదకు వెళ్తాడు నాన్నా అని జరిగిన గొడవ గురించి చెబుతాడు బాలు. నీలాంటి వాడికి నా చెల్లెలిని ఇచ్చేదే లేదు అని తాంబూళాలు ఎత్తేస్తాడు బాలు. సరిగ్గా సమయానికి శనిలా దాపరించావు కదరా దరిద్రుడా. వాళ్లను ఇలా అవమానిస్తావా. తాగాడని, గొడవ పడ్డాడని అంటున్నావ్. నువ్ పడట్లేదా అని ప్రభావతి అంటుంది. నేను కారణం లేకుండా గొడవ పడను. వీడు రాక్షసుడు. వీడికి నాకు పోలిక ఏంటని బాలు అంటాడు.

తాగడమే మానేశాను

ఏదో జరిగింది. వచ్చినవాళ్లతో ఇలా ప్రవర్తించాలా అని రంగా అంటాడు. వీడు సుద్ధపోసినట్లు అయినట్లు చేస్తున్నాడు మనోజ్ అంటాడు. అరేయ్ కట్నం వద్దంటున్నార్రా. మంచివాళ్లురా అని కామాక్షి అంటుంది. కట్నం అడిగితే తల తాకట్టు పెట్టయినా ఇచ్చేవాళ్లం. కానీ, వీడు మనిషి కాదు అని బాలు అంటాడు. ఆరోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. అప్పటి నుంచి నేను తాగడమే మానేశాను. నన్ను నమ్ము బాలు అని సంజు అంటాడు.

ఏంట్రా నమ్మేది. ఆరోజే నీలో నేను శాడిస్ట్‌ను చూశాను. నీలాంటి శాడిస్ట్‌కు నా చెల్లెలిని ఇవ్వనని బాలు అంటాడు. ఆరోజు గొడవ జరిగిందని తెలిసి నేను మందలిచ్చి ఇంకోసారి తాగొద్దని ఒట్టు వేయించుకున్నాను. అలాంటి గొడవల్లోకి వెళ్లడు. తొందరపడి ఆపకు అని నీలకంఠం అంటాడు. నీవల్ల ఎన్ని అనర్థాలు జరిగిన ఇంట్లో ఉండనిస్తే.. చెల్లెలి పెళ్లి ఆగిపోయేలా చేస్తావా. మనిషివా పశువ్వా. నీలా డ్రైవర్‌కి ఇచ్చి పెళ్లి చేస్తావా అని ప్రభావతి అంటుంది.

మంచి మనసు ఉంటే చాలు అని బాలు అంటాడు. మంచి చెడు చూసుకునేందుకు అత్తయ్య మావయ్య ఉన్నారు కదా. మీరెందుకు ఆవేశపడుతున్నారు అని మీనా అంటుంది. నీకు తెలీదు మీనా. నువ్ మధ్యలోకి రాకు అని బాలు అంటాడు. ఒకవేళ నచ్చకపోతే తర్వాత చెబుతామని చెప్పాలి కానీ, ఇలా అవమానిస్తావా అని రంగా అంటాడు. ఎవరు ఎన్నిచెప్పిన నా నిర్ణయం మారదు. వాడు ఎంత రాక్షసుడో చెప్పిన వీడికే ఇచ్చి చేయాలని అంటున్నారు. వీడి గురించి తెలిసే గబా గబా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అని బాలు అంటాడు.

బాలును కొట్టిన ప్రభావతి

రేయ్ పోరా బయటకు అని సంజు కాలర్ పట్టుకుంటాడు బాలు. ఆగు బాబు.. ఎక్కడో ఏదో జరిగిందని. మావాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్. నిజాలు నిలకడగా తెలుస్తాయి. వదులు బాబు. మేమే వెళ్తాం అని నీలకంఠం అంటాడు. ఇంత జరిగినా మావాడు ఇష్టపడిన అమ్మాయినే కోడలిగా తెచ్చుకోవాలని ఉంది. ఆలోచించుకోండి. రారా అని నీలకంఠం కుటుంబం వెళ్తుంది. దాంతో బాలు చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి. ఈ ఇంట్లో ఒక దరిద్రంలా పుట్టావ్ కదరా. నువ్వు బాగుపడవు. మమ్మల్ని బాగుపడనివ్వు అని తిడుతుంది.

వీడు ఉండగా నా కూతురు పెళ్లి జరగదు అని వెళ్లిపోతుంది ప్రభావతి. బాలు కంట్లో నీళ్లు తిరుగుతాయి. తర్వాత ప్రభావతి అన్న మాటలు తల్చుకుని బాధపడతాడు బాలు. మీనా వచ్చి పలకరిస్తుంది. వాడు తాగాక రాక్షసుడిలా మారాడు. అది నేను కళ్లారా చూశాను అని బాలు అనడం మౌనిక విని లోపలికి వెళ్తుంది. నేనేం తాగి రాలేదు మౌనిక. అమ్మ తెచ్చిన సంబంధం అని మనసొప్పకే ట్రిప్ వేరేవాళ్లకు ఇచ్చి వచ్చాను అని బాలు అంటాడు.

నీ మనసు నాకు తెలుసు అన్నయ్య. నీకు ఇష్టం లేదంటే నేను అతన్ని పెళ్లి చేసుకోను అన్నయ్య. కానీ, అతను చెప్పంది ఒకటి నీకు చెప్పాలి. నీతో గొడవ జరిగిన విషయం నాకు చెప్పాడు. ఒకవేళ అతను నిజంగా చెడ్డవాడు అయితే నాకు ఎందుకు చెబుతాడు. నీకు సారీ చెప్పాలని కూడా అనుకుంటున్నాడు అని మౌనిక అంటుంది. గొడవ పడిన ఇంటికే వచ్చి అడుగుతున్నాడంటేనే నాకు ఎక్కడో కొడుతుందని బాలు అంటాడు.

మాటమాట పెరుగుతుంది

మీకు ప్రతిదీ అనుమానించడం అలవాటు అయిపోయిందని మీనా అంటుంది. కాదు మా అమ్మకు ప్రతీది తేలీగ్గా తీసుకోవడం అలవాటైందని బాలు అంటాడు. అప్పటివరకు మాటలు విన్న సత్యం లోపలికి వచ్చి అవసరం అయినా దానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నావని అనిపిస్తుందిరా. తాగినప్పుడు మాటమాట పెరుగుతుంది. అప్పుడు గొడవలు ఎంతదూరమైనా పోతాయి అని సత్యం అంటాడు. అవన్ని వేరు నాన్న. వాడు రాజేష్‌గాడిని రాక్షసుడిలా కొట్టాడు అని బాలు అంటాడు.

నువ్ పోలీస్ స్టేషన్‌లో రవిని కొట్టావ్. అది ఒక అన్న తమ్ముడిని మందలించడానికి కొట్టినట్లు లేదు. అప్పుడు నువ్ నాకు రాక్షసుడిలానే కనిపించావురా. పోలీసులు ఆపకుంటే వాడు ఏమైపోయేవాడురా. నిన్ను కూడా వాళ్లు రౌడీలానే అనుకుంటారు కదా. అయినా వాళ్లు మనమే కావాలని అనుకుంటున్నారు. ఆ కోణంలో ఆలోచించురా అని సత్యం అంటాడు. ఎవరెన్ని చెప్పిన నా మనసు ఒప్పుకోవట్లేదు నాన్నా అని బాలు వెళ్లిపోతాడు.

తర్వాత నీలకంఠం కుటుంబం గురించి ఆరా తీస్తాడు బాలు, తన ఫ్రెండ్స్. నీలకంఠం దగ్గర పనిచేసే వ్యక్తిని అడిగితే.. వాడు రౌడీ షీటర్ అని, సంజు వెధవన్నర వెధవ అని చెబుతాడు. అదే విషయం మా ఇంట్లో వచ్చి చెబుతావా అని బాలు అడిగితే.. సరే అంటాడు. నా నిజాయితీ నిరూపించుకోడానికి ఒకడు వస్తున్నాడని బాలు ఇంట్లో చెబుతాడు. అప్పుడే అతను వస్తాడు. నాకు చెప్పిందే చెప్పమని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner