Manchu Manoj Weds Mounika: మనోజ్ వెడ్స్ మౌనిక.. ఫొటో షేర్ చేసిన మంచువారి అబ్బాయి
Manchu Manoj Weds Mounika: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నేడు పెళ్లిపీటలెక్కబోతున్నారు. భూమా మౌనికరెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడు. భార్య మౌనికారెడ్డిని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు మనోజ్.
Manchu Manoj Weds Mounika: మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. భూమా మౌనికరెడ్డితో శుక్రవారం (నేడు) హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఏడడుగులు వేయబోతున్నాడు. తన పెళ్లిపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డిని(Bhuma Mounika) పరిచయం చేశారు. ఆమె ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పెళ్లికూతురు అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
మనోజ్ వెడ్స్ మౌనిక్ అంటూ హాష్‌ట్యాగ్‌జోడించారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో నేడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరు కుటుంబసభ్యులతో పాటు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు తెలిసింది.
మనోజ్‌తో పాటు మౌనికకు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లాడాడు మనోజ్. మనస్పర్థలతో 2019లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు మంచు మనోజ్. చివరగా ఆపరేషన్ 2019 సినిమాలో గెస్ట్ పాత్రలో నటించాడు. ఇటీవలే తాను రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. వాట్ ది ఫిష్ పేరుతో ఓసినిమా చేయబోతున్నాడు.