New Year 2025: కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ 5 చూసినట్లయితే, లక్ష్మీదేవి మీ ఇంట సిరులు కురిపిస్తుంది.. ఏడాదంతా ఆనందమే
New Year 2025: లక్ష్మీదేవిని మనం ఆరాధించడంతో పాటుగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. కొత్త సంవత్సరం ఇలా జరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది అర్ధం. అయితే కొత్త సంవత్సరం ఎలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనేది తెలుసుకోవాలి?
ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరం మంచి జరగాలని అనుకుంటారు. కొత్త సంవత్సరాన్ని మంచి సానుకూల శక్తితో మొదలు పెట్టాలని, ఏడాది అంతా ఏ ఇబ్బందులు కలగకూడదని అనుకుంటారు. ఇంకో కొన్ని రోజులతో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం మంచి జరగాలన్నా, సంతోషంగా జీవించాలన్నా కొత్త సంవత్సరాన్ని ఇలా ప్రారంభించడం మంచిది. చాలా మంది వచ్చే సంవత్సరం రాశి ఫలాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే దాని గురించి కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు.
పైగా లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే లక్ష్మీదేవిని మనం ఆరాధించడంతో పాటుగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. కొత్త సంవత్సరం ఇలా జరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది అర్ధం. అయితే కొత్త సంవత్సరం ఎలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనేది తెలుసుకోవాలి? కొత్త సంవత్సరం ఎలాంటి సంకేతాలను మనం చూడచ్చో ఇప్పుడే తెలుసుకుందాం.
2025లో వీటిని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే
తెల్లని పూలు లేదా ఏనుగు
కొత్త సంవత్సరం ఉదయాన్నే మీరు తెల్లని పూలు లేదా ఏనుగుల్ని చూస్తే చాలా మంచిది. ఇవి ధనాన్ని కలిగిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వీటిని చూసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు. అదృష్టం కూడా మీ ఇంటి తలుపు తట్టినట్లు మీరు భావించాలి.
పక్షి గూడు
కొత్త సంవత్సరం మొదటి రోజు మీరు ఇంట్లో పక్షి గూడును చూస్తే కూడా అది సానుకూల శక్తిని తీసుకువస్తుందని అర్థం చేసుకోవాలి. పక్షి గూడుని ఈ సంవత్సరం మొదట్లో చూసినట్లయితే సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఇది భగవంతుడు పంపిన మంచి సానుకూల గుర్తు అని అనుకోవాలి. పక్షి గూడుని తొలగించడానికి బదులుగా మీరు దానిని ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి.
ఈ శబ్దాలను వినడం
జ్యోతీష్యులు చెప్పిన దాని ప్రకారం కొత్త సంవత్సరం మీరు శంఖం శబ్దం లేదా గంట శబ్దం వింటే కూడా మంచి జరుగుతుందట. ఇది చాలా మంచి ఎనర్జీకి సంకేతం. పక్షులు కిలకిలలు ఎంతో తియ్యగా ఉంటాయి. వీటి శబ్దం వింటే కూడా కొత్త సంవత్సరం మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటివి వినడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోందని అర్థం.
కలలో వీటిని చూడడం
కొత్త సంవత్సరానికి ముందు రోజూ బంగారం, వెండి, ధనం వంటివి మీకు కలలో కనపడితే కొత్త సంవత్సరం మీ ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. ధనానికి లోటు ఉండదని అర్థం చేసుకోవాలి. అలాగే ఒంటరిగా ఉంటున్న వాళ్ళు జీవిత భాగస్వామిని పొందుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.