Kia Seltos Vs Kia Sonet : కియా సెల్టోస్ వర్సెస్ కియా సోనెట్.. ఫీచర్లు, మైలేజీ, ధరలో పోలిక.. మీకు ఏది ఇష్టం?
Kia Seltos Vs Kia Sonet Comparison : కియా సెల్టోస్, కియా సోనెట్ భారతీయ మార్కెట్లో ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్‌యూవీలు. వీటిని కియా మోటార్స్ విక్రయిస్తోంది. ఈ రెండింటిలో ఏది బాగుంటుంది?
కియా కారును కొనుగోలు చేయాలనుకునేవారికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కియా సెల్టోస్ తీసుకోవాలా? కియా సోనెట్ కొనాలా? అని అర్థం కాదు. అయితే ఈ రెండింటీని పోల్చితే మీకు ఓ క్లారిటీ వస్తుంది. రెండు కార్లు వాటి స్టైలిష్ డిజైన్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్, పవర్‌ఫుల్ ఇంజన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రెండింటీలో ఏది బెటర్ అని చూద్దాం..
కియా సెల్టోస్ వేరియంట్‌లు
కియా సెల్టోస్ పలు వేరియంట్‌లలో దొరుకుతుంది. HTE, HTK, HTK+, HTX, HTX+, GTX, GTX+ (S), GTX+, X-Line (S), X-లైన్ ఉన్నాయి. వాటి ధరలు రూ. 10.90 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమై రూ. 20.37 లక్షల వరకు ఉన్నాయి. కియా సెల్టోస్ హై-స్పెక్ HTX వేరియంట్ ఆధారంగా కొత్త గ్రావిటీ ఎడిషన్‌ను కూడా విక్రయిస్తుంది. దీని ధరలు రూ. 16.63 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 18.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
కియా సోనెట్ వేరియంట్‌లు
కియా సోనెట్ వేరియంట్‌ల కూడా చాలానే ఉన్నాయి. HTE, HTE (O), HTK, HTK (O), HTK+, HTX, HTX+, GTX, GTX+, X-లైన్‌లో దొరుకుతాయి. దీని ధర రూ.8 లక్షల(ఎక్స్ షోరూమ్) నుండి మొదలై రూ. 15.77 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. బహుళ ఇంజన్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉన్న కియా సోనెట్ HTK ప్లస్ ట్రిమ్ ఆధారంగా కంపెనీ కొత్త గ్రావిటీ ఎడిషన్‌ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ.10.50 లక్షల నుంచి మొదలై రూ.12 లక్షల వరకు ఉంటుంది.
రెండింటీలో ఫీచర్లు
ఈ రెండు ఎస్‌యూవీలు వేరియంట్‌ను బట్టి అనేక అధునాతన ఫీచర్‌లను పొందుతాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ గురించి చూస్తే.. రెండింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కియా సోనెట్ మైలేజీ
కియా సోనెట్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 1-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ పొందుతుంది. ఏఆర్ఏఐ ప్రకారం, కియా సోనెట్ మైలేజ్ లీటర్‌కు 18.2 నుండి 24.1 కిమీ వరకు ఉంటుంది.
కియా సెల్టోస్ మైలేజీ
కియా సెల్టోస్‌లో మొత్తం మూడు (రెండు పెట్రోల్, ఒక డీజిల్) ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. మైలేజీ చూస్తే.. ARAI ప్రకారం సెల్టోస్ మైలేజ్ లీటరుకు 17 నుండి 20.7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటి ఫీచర్లు, ధరల ఆధారంగా మీరు ఏది తీసుకుంటారో డిసైడ్ చేసుకోండి.