AP Heavy Rain Alert: చలిగాలులు, ముసురు వానలు, ఏపీలో అల్పపీడనం ఎఫెక్ట్‌, మరో మూడు రోజులు ఇంతే…-cold winds torrential rains low pressure effect in ap three more days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Heavy Rain Alert: చలిగాలులు, ముసురు వానలు, ఏపీలో అల్పపీడనం ఎఫెక్ట్‌, మరో మూడు రోజులు ఇంతే…

AP Heavy Rain Alert: చలిగాలులు, ముసురు వానలు, ఏపీలో అల్పపీడనం ఎఫెక్ట్‌, మరో మూడు రోజులు ఇంతే…

Dec 25, 2024, 09:57 AM IST Bolleddu Sarath Chandra
Dec 25, 2024, 09:57 AM , IST

  • AP Heavy Rain Alert: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి.. అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోందని ఐఎండి అంచనా వేస్తోంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బుధవారం క్రమంగా బలహీనపడుతుందని  అంచనా వేస్తున్నారు.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రానికి  అనుబంధంగా 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. 

(1 / 10)

అల్పపీడనం నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు,  పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 

(2 / 10)

అల్పపీడన ప్రభావంతో ఈ వారం వరుసగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.  శనివారం తర్వాత రాష్ట్రంలో వర్గాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.

(3 / 10)

ఈ నెల 27 నాటికి అల్పపీడనం కాస్త… వాయుగుండంగా బలపడతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీలో రెండు మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

(4 / 10)

(unsplash.com)

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో  రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.  ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. 

(5 / 10)

ఖరీఫ్‌ పంట కోతల సమయం కావడంతో  అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో ధాన్యం చేతికి అందకుండానే తడిచిపోయింది.  

(6 / 10)

డిసెంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 

(7 / 10)

గత నెలలో వచ్చిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు తీవ్రంగా ప్రభావితం అయ్యారు. 

(8 / 10)

 రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం. నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి. 

(9 / 10)

  •  రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం. నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి. 

దక్షిణకొస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ మొత్తం సముద్రంలోనే జరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు