Movie: తెలుగులోకి వచ్చేస్తున్న మలయాళ మోస్ట్ వైలెంట్ మూవీ.. డబ్బింగ్ రైట్స్‌కు మంచి ధర!
Marco movie in Telugu: మార్కో మూవీ ప్రస్తుతం సెన్సేషన్‍గా మారింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. బాగా పాపులర్ అయింది. దీంతో తెలుగులోనూ ఈ మూవీ విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ అంటూ పాపులర్ అవుతోంది. రణ్‍బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా మూవీ ‘యానిమల్’, లక్ష్య హీరోగా చేసిన ‘కిల్’ కంటే మార్కో వైలెంట్‍గా ఉందంటూ ఇప్పటికే టాక్ వచ్చేసింది. దీంతో బాగా పాపులర్ అయిపోయింది. డిసెంబర్ 20న మలయాళం, హిందీలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే మంచి కలెక్షన్లు సాధించి ఇంకా దూసుకెళుతోంది. ఈ తరుణంలో తెలుగులోనూ ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
మార్కో డబ్బింగ్ రైట్స్ రేట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడు..
మార్కో సినిమా తెలుగు హక్కులు ఏకంగా రూ.3కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ మూవీ పాపులర్ అవడంతో ఇంత మొత్తం దక్కింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ మూవీ మలయాళం వెర్షన్ రిలీజ్ కాగా.. బాగానే పర్ఫార్మ్ చేస్తోంది. దీంతో తెలుగు డబ్బింగ్ హక్కులు మంచి ధర పలికాయి.
జనవరి 1వ తేదీన తెలుగులో మార్కోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 దుమ్మురేపుతోంది. జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ రానుంది. ఈ మధ్యలో జనవరి 1వ తేదీన వస్తే మార్కో వారమైనా మార్కోకు మంచి కలెక్షన్లు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
ఉన్ని.. తెలుగుకు సుపరిచితుడే
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడే. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి, కిలాడీ, యశోదా చిత్రాల్లో నటించారు. భాగమతిలో అనుష్కకు జోడీగా ప్రధాన పాత్ర పోషించారు. దీంతో మార్క్ మూవీ తెలుగులోనూ బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది.
మార్కో చిత్రానికి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. హింసాత్మకమైన సీన్లతో రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఆయన టేకింగ్‍కు కూడా ప్రశంసలు వస్తున్నాయి. అయితే, హింస మరీ ఎక్కువైందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‍తో పాటు కబీర్ దుహన్ సింగ్, జగదీశ్, సిద్ధిఖీ, అభిమన్యు షమ్మి, అన్సన్ పౌల్ కీరోల్స్ చేశారు.
మార్కో వసూళ్లు
మార్కో సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. పాజిటివ్ టాక్‍తో జోరుగా వసూళ్లు వస్తున్నాయి. నవంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే రూ.38కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. హిందీలో పెద్దగా పర్ఫార్మ్ చేయడం లేదు. మరి తెలుగులో రిలీజ్ అయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి కలెక్షన్లను దక్కంచుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి సుమారు రూ.30కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనా. ఈ సినిమాను క్యూబ్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ ప్రొడ్యూజ్ చేశారు.
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‍బస్టర్లకు పని చేసిన రవి బస్రూర్.. మార్కో మూవీకి సంగీతం అందించారు. ఈ చిత్రంలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు చంద్రుసెల్వ రాజ్ సినిమాటోగ్రఫీ చేశారు. షమ్మీర్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం