Utensils in Sink: గిన్నెలను సింకులోనే తోమకుండా వదిలేస్తున్నారా? లక్ష్మ దేవికి కోపం వస్తుందట
Utensils in Sink: రాత్రి భోజనం తర్వాత పాత్రలు కడగకుండా సింక్ లో వదిలేస్తే కలిగే అనర్థాల గురించి అందరూ తెలుసుకోవాలి. ఇది ఆ ఇంట్లో ఉండే వారికి ఎంతో హానికలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పూర్వకాలంలో రాత్రి భోజనాలు చేశాక ఆ గిన్నెలను శుభ్రపరిచాకే నిద్రపోయేవారు. వాటిని ఉదయం వరకు ఉంచేవారు కాదు. ఇలా రాత్రిపూట గిన్నెలు తోమకుండా వదిలేయడం మంచి పద్దతి కాదని అప్పట్లో నమ్మేవారు. ఇప్పుడు కాలం మారింది. వీలైనప్పుడే పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గిన్నెలను రాత్రి శుభ్రపరిచేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. భోజనం తిన్నాక హాయిగా ముసుగు తన్ని నిద్రపోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
రాత్రిపూట మురికి పాత్రలు వదిలేసి నిద్రపోవడం అనేది ఇంటికి లక్ష్మి దేవిని రాకుండా అడ్డుకుంటుందని పూర్వం నుంచి నమ్మేవారు. అలా రాత్రిపూట గిన్నెలు తోమకుండా వదిలేసిన వారి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక సంక్షోభం ఉంటుంది తప్ప ఉపశమనం ఉండదని అంటారు. ఇదే విషయం జ్యోతిషశాస్త్రంలోను, అనేక ఇతర పురాణ గ్రంథాలలో కూడా చెబుతారు. అందుకే పూర్వం మహిళలంతా గిన్నెలను శుభ్రపరచుకున్నాకే నిద్రపోయే వారు. దీని వెనుక మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇవి రాత్రిపూట సింకులో మురికి పాత్రలను వదిలేయడం ఎందుకు మంచిది కాదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
గిన్నెలు అలా వదిలేయకండి
రాత్రి భోజనం తర్వాత మురికి పాత్రలను సింక్ లో వదిలేస్తే, అది మీ ఆరోగ్యానికి, మీ మొత్తం కుటుంబం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వాస్తవానికి, ఎక్కువసేపు పాత్రలను అలా వదిలేయడం వల్ల, వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువ. ఈ గిన్నెల్లో E.కోలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగడానికి సరైన వాతావరణం ఏర్పడుతుంది. చాలాసార్లు ఈ హానికరమైన బ్యాక్టీరియా మురికి పాత్రల నుండి వంటగదిలోని మిగిలిన భాగాలకు వ్యాపించి వాటిని కలుషితం చేస్తుంది.
మురికిలో వృద్ధి చెందే ఈ బ్యాక్టీరియా మీ ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తుంది. అవి రోగనిరోధక శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని బలహీనంగా మారుస్తుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రోగాల ముప్పు పెరుగుతుంది. ఇది కాకుండా, ఈ బ్యాక్టీరియా వల్ల కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు, పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో టైఫాయిడ్, కామెర్లు, మూత్రపిండాల వ్యాధులు కూడా వస్తాయి.
పాత్రలను ఎంతసేపటిలో కడగాలి?
తిన్న వెంటనే పాత్రలను మంచి పని. అయితే ప్రతిసారీ ఇలా చేయడం కాస్త కష్టమే. ఈ సందర్భంలో, మీరు రెండు నుండి మూడు గంటల తర్వాత కూడా పాత్రలను కడగవచ్చు. అయితే, ఇలా చేయాల్సి వస్తే గిన్నెల్లో ఎలాంటి ఆహార అవశేషాలు లేకుండా పూర్తిగా తొలగించాకే వాటిని సింకులో వదిలేయాలి. ఒకసారి నీటితో కడిగాకే వాటిని సింక్ లో నిల్వ చేయాలి. ఇలా అయితే బ్యాక్టిరియా త్వరగా వ్యాపించే అవకాశం ఉండదు.