తెలుగు న్యూస్ / ఫోటో /
OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు- తృప్తి డిమ్రి 400 కోట్ల హారర్ మూవీ నుంచి సూపర్ హిట్ సిరీస్ సీక్వెల్ వరకు!
New OTT Release Movies To Watch This Week: ఓటీటీలోకి డిసెంబర్ చివరి వారంలో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి కొన్ని సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఫ్యామిలీతో కలిసి చూసే ది బెస్ట్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు జోనర్స్ ఏంటో కూడా ఇక్కడ తెలుసుకుందాం.
(1 / 7)
డిసెంబర్ నాలుగో వారం ఓటీటీ ప్రేమికులకు పండగే అని చెప్పొచ్చు. ఈ వారం మోస్ట్ అవైటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఫ్యామిలీతో చూడాల్సిన ది బెస్ట్ 5 సినిమాలను ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 7)
ఖోజ్: బియాండ్ ది షాడోస్: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన నటుడు షరీబ్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖోజ్ బియాండ్ ది షాడోస్. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 27న జీ5లో ఓటీటీ రిలీజ్ కానుంది.
(3 / 7)
డాక్టర్స్: శరద్ కేల్కర్ నటించిన డ్రామా వెబ్ సిరీస్ 'డాక్టర్స్' డిసెంబర్ 27 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
(4 / 7)
సోర్గవాసల్: తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ సోర్గవాసల్. ఆర్జే బాలాజీ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఓ చిన్న రెస్టారెంట్ యజమాని పార్థివ్ చుట్టూ తిరుగుతుంది.
(5 / 7)
లక్ష్మీ నివాస్: ఓటీటీ సినిమాలు మాత్రమే కాకుండా ఈ వారం జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది మరాఠీ సీరియల్ లక్ష్మీ నివాస్. డిసెంబర్ 23 నుంచే ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్‌ను జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
(6 / 7)
భూల్ భులయ్యా 3: యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రి నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా. నవంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నటించిన భూల్ భులయ్యా 3 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ఇతర గ్యాలరీలు