Gunde Ninda Gudi Gantalu Today Episode: బెడిసికొట్టిన బాలు ప్రయత్నం- సంజుకే చెల్లెలి సపోర్ట్- నీలకంఠం ఇంట్లో రచ్చ రచ్చ-gunde ninda gudi gantalu serial december 25th episode balu uncertain on mounika sanju marriage sathyam slaps son starmaa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: బెడిసికొట్టిన బాలు ప్రయత్నం- సంజుకే చెల్లెలి సపోర్ట్- నీలకంఠం ఇంట్లో రచ్చ రచ్చ

Gunde Ninda Gudi Gantalu Today Episode: బెడిసికొట్టిన బాలు ప్రయత్నం- సంజుకే చెల్లెలి సపోర్ట్- నీలకంఠం ఇంట్లో రచ్చ రచ్చ

Sanjiv Kumar HT Telugu
Dec 25, 2024 10:30 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial December 25 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 25 ఎపిసోడ్‌లో నీలకంఠం దగ్గర పనిచేసిన రమేష్‌ బాలుకు సంజు గురించి నిజం చెబుతాడు. అదే ఇంటికి వచ్చి చెప్పమని బాలు అంటాడు. పెళ్లి సంబంధం అని తెలిసి రమేష్ తప్పుగా చెబుతాడు. దాంతో బాలును అంతా అవమానిస్తారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 25 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 25 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఎవర్రా ఆ కస్టమర్ ఊరంతా తిప్పాడు అని రాజేష్ అంటాడు. పెళ్లి చూపులు ఎలా జరిగాయని అడుగుతాడు.

yearly horoscope entry point

వాడు కరెక్ట్ కాదని

ఏంటీ జరిగేది అందరి తన్నితరిమేశాను. నేను అనుకుందే జరిగింది. పెళ్లి కొడుకు నీకు కూడా తెలుసు. బార్‌లో నీతో గొడవ పడ్డాడు చూడు. వాడు అని బాలు జరిగింది చెబుతాడు. వాడా. అయినా అది మనసులో పెట్టుకుని పగ తీర్చుకునేంత పెద్ద గొడవ కాదుగా అని రాజేష్ అంటాడు. ఏమో ఎవరికి తెలుసు. వాడి కన్నింగ్ మొహం చూస్తే అలాగే అనిపించింది. అయినా, నా చెల్లికి వాడు కరెక్ట్ కాదని బాలు అంటాడు. నచ్చాల్సింది నీకు కాదు. నీ చెల్లికి అని రాజేష్ అంటాడు.

ఏం చెప్పాడో కానీ, నచ్చాడు అని బాలు అంటే, ఇంట్లో వాళ్లకు అని రాజేష్ అడుగుతాడు. అందరికీ నచ్చినట్లే ఉందని బాలు అంటాడు. ఒక్క కారణంతో సంబంధం క్యాన్సిల్ చేయడం మంచిది కాదు. ముందు వాడి గురించి పూర్తిగా తెలుసుకుందాం అని రాజేష్ అంటాడు. నాకు అదే అనిపించింది. కానీ, ఇప్పటికిప్పుడు వాడి గురించి ఎలా తెలుస్తుంది. వాడి నాన్న పేరు ఏదో నీలకంఠమో, మణికంఠనో అన్నాడు. పెద్ద పొలిటిషియన్ అంట అని బాలు అంటాడు.

అదంతా విన్న పక్కనతను అతని పేరు నీలకంఠే. మన రమేష్ అన్న అతని దగ్గర పనిచేశాడు. అన్నను అడిగితే క్లియర్‌గా చెబుతాడు అని అతని కాల్ చేస్తారు. కట్ చేస్తే రమేష్‌ను బాలు, రాజేష్ కలుస్తారు. నీలకంఠంతో పని ఉంది. తెలుసుకుందామని వచ్చాం అని రాజేష్ అంటాడు. కొత్తగా చెప్పేదేముంది అన్న పెద్ద రౌడీ షీటర్ కదా. పెద్ద పెద్ద దందాలు సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. రాజకీయాల్లో కూడా పలుకుబడి బాగానే ఉంది అని రమేష్ చెబుతాడు.

గండం నుంచి గట్టెక్కుతుంది

మరి అతని కొడుకు ఎలాంటివాడు అని రాజేష్ అడుగుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీలకంఠ వెధవ అయితే.. వాడి కొడుకు వెధవన్నర వెధవ అని రమేష్ అంటాడు. అంటే ఆ ఫ్యామిలీనే మంచిది కాదన్నమాట అని బాలు అడిగితే.. అంతే కదా మరి అని రమేష్ అంటాడు. రేపు ఒకసారి మా ఇంటికి వస్తావా. చిన్న పని ఉంది. మర్చిపోకు అని బాలు అంటాడు. వీడు కరెక్ట్‌గా చెబితే చాలు. నా వాదన నిజం అవుతుంది. నా చెల్లి ఒక గండం నుంచి గట్టెక్కుతుంది అని బాలు మనసులో అనుకుంటాడు.

రాత్రి అందరూ భోజనం చేస్తుంటారు. మంచి సంబంధం. అనవసరంగా బాలు చెడగొట్టాడు అని రోహిణి అంటుంది. ఆ మాట ఆయన ఉన్నప్పుడే అనాలి. లేనప్పుడు నా ముందు కాదు అని మీనా అంటుంది. వాడికి ఆ రౌడీ బుద్ధులు ఎక్కడికిపోతాయి అని ప్రభావతి అంటుంది. ఆయనేం మౌనికకి శత్రువ. కాస్తా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంతే. మంచి ఫ్యామిలీ అయితే ఆయనెందుకు వద్దంటారు అని మీనా అంటుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మంచిది కాదా. పూలమ్ముకునే కుటుంబం కంటే తీసిపోయిందా అని మనోజ్ అంటాడు.

పుట్టింటిని అంటే అందరూ నాలా పడరు. మౌనికకు అలాంటి కర్మ ఎందుకు అని మీనా అంటుంది. ఇప్పుడు మీనా పుట్టింటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్. బుద్ధుందా అని సత్యం అంటాడు. అప్పుడే బాలు వస్తాడు. అదే అతనితో చెప్పమను అని మీనా అంటుంది. దాంతో ఏం లేదని మనోజ్ అంటాడు. ఏరా లక్షలు మింగినోడా.. నేను రాగానే మాటలు మింగేసావేంటీ అని బాలు అంటాడు. సొంత చెల్లి పెళ్లి చెడగొడితే అనరా అని రోహిణి అంటుంది.

ఎంత పోరంబోకో తెలుసుకున్నా

సొంత చెల్లి పెళ్లి ఏ ఎధవ అయినా చెడగొడతారా అని బాలు అంటాడు. తినకుండా ఈ దరిద్రుడు వచ్చాడు. అని అన్నం తినకుండా వెళ్లిపోతుంది ప్రభావతి. అన్నం తీసి ఉంచు. అర్థరాత్రి వచ్చి తింటుంది అని బాలు అంటాడు. తినేముందు వాదనలు ఎందుకని సత్యం అంటాడు. వాడు ఎలాంటివాడో, ఎంత పోరంబోకో తెలుసుకునే వచ్చాను. డబ్బు మాత్రం ఉంటే చాలా. ఫ్యామిలీ ఎలాంటిదో చూడరా. నా మాటలు నమ్మట్లేదు కదా. వాళ్ల చరిత్ర తెలిసినవాన్ని రేపు రమ్మన్నాను. చెబుతాడు అని బాలు అంటాడు.

ఒక్కరోజులో చరిత్ర తిరగరాస్తాడా. లేదా నువ్ రాయించావా అని మనోజ్ అంటాడు. గిన్నెతో కొడితే పుర్ర పక్కకు పడుద్ది. నేనెందుకు చెప్పిస్తారా అని బాలు అంటాడు. మీరు ఎందుకు అంత పట్టుబట్టారు. మీరు కావాలనే సంబంధం చెడగొట్టారని అన్న వదినా అంటున్నారు అని మీనా అంటుంది. నాన్న నన్ను నమ్ము. ఇది మౌనిక జీవితం. పెళ్లి అయితే ఒక్కరోజు కూడా కన్నీళ్లు పెట్టకూడదు. మౌనికకు మీనాలా గుండె నిబ్బరం లేదు. నేను చెప్పిన మనిషి రేపు పొద్దున వస్తాడు. అప్పుడు మీరే తెలుసుకుంటారు అని బాలు వెళ్లిపోతాడు.

ఆయనంతా గట్టిగా చెబుతున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒక్కపూట ఓపిక పడదాం మావయ్య అని మీనా చెబితే సరేనని సత్యం అంటాడు. మరుసటి రోజు ఉదయం నా నిజాయితీ నిరూపించుకోడానికి ఒకడు వస్తాడు అని బాలు అంటాడు. ఇంతలో నీలకంఠం దగ్గర పని చేసిన రమేష్ వస్తాడు. నిజాన్ని నిర్భయంగా చెప్పు. నిన్న నాతో చెప్పింది ఇవాళ వీళ్లకు చెప్పు అని బాలు అంటాడు. ఇతను రమేష్ నీలకంఠం దగ్గర పని చేసి మానేశాడు అని బాలు అంటాడు.

మా పిల్లలను చదివిస్తాడు

ఏంటీ నువ్వు పెళ్లి సంబంధం గురించా అడిగేది అని రమేష్ అంటే.. బాలు అవును అంటాడు. అమ్మో చెడగొట్టింది నేనే అని తెలిస్తే. తండ్రీకొడుకుల నన్ను చంపేస్తారే అని రమేష్ అనుకుంటాడు. కోపిష్టోడు. కానీ, మాకు ఆయనే వంటి చేయించి పెట్టిస్తాడు. మా పిల్లలను చదివిస్తాడు. ఇక ఆయన కొడుకు మాకు ఏ అవసరం వచ్చిన మాకు సహాయం చేస్తాడు అని రమేష్ అంటాడు. మరి అంత మంచివాళ్ల దగ్గర మీరెందుకు మానేశారు అని మీనా అడుగుతుంది.

నేనేందుకు మానేశాను. చిన్న యాక్సిడెంట్ అయితే డబ్బుచ్చి నెల లీవ్ ఇచ్చారు అని రమేష్ అంటాడు. దాంతో బాలు కాలర్ పట్టుకుని నిన్న దుర్మార్గుడు అని ఇవాళ దేవుడు అంటున్నావ్ అని అంటాడు. పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకునేంత చెడ్డొళ్లు కాదు అని రమేష్ అంటాడు. సత్యం కాలర్ వదులమని అతన్ని వెళ్లమంటాడు. హమ్మయ్య నేను నా కుటుంబం బతికిపోయాం అని రమేష్ వెళ్లిపోతాడు. నా మాట నమ్మకపోతే మీరు ఇంకో నలుగురిని ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి రమేష్ వెళ్లిపోతాడు.

ఇప్పుడేమంటాడు మీ నిజాయితీపరుడు. నిజాలను అబద్ధాలుగా చేసిన సాక్ష్యాలు పనికిరాకుండా పోయాయి అని ప్రభావతి నానా మాటలు అంటుంది. వాడు మాట మార్చాడు అని బాలు అంటాడు. మాటలు మార్చింది నువ్వు. ఇలా పనికిమాలిన సాక్ష్యం పట్టుకొచ్చావ్. వాళ్లు మంచోళ్లు కాబట్టి మొహం మీదే చెప్పి వెళ్లారు. ఇప్పుడు ఎవరు చెప్పిన వినను. అదే సంబంధం ఖాయం చేస్తాను. ఎవడు చెడగొడతాడో నేను చూస్తాను అని ప్రభావతి అంటుంది.

నిజాయితీగా చెప్పాడు

అమ్మ ఎప్పుడు అందరి మంచికోసమే చేస్తుంది. అది నీకెప్పుడు నచ్చదు. నీ ఫ్రెండ్‌ను కొట్టాడన్న కోపంతో నీ చెల్లెలి పెళ్లిని క్యాన్సిల్ చేస్తావా అని మనోజ్ అంటాడు. సత్యం ఆపుతాడు. పెళ్లి అనేది కుటుంబం అంతా ఒప్పుకుంటేనే ఆ సంబంధంలో ఎలాంటి లోపాలు లేవన్నట్లు. అ తప్పే రవి చేశాడు. అది మళ్లీ జరగదు. ఎవరికి సంబంధం నచ్చిందో చెప్పండి. ఓటింగ్ పెడుతున్నను అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతి, మనోజ్, రోహిణి చేతులెత్తుతారు.

అందరూ మీనావైపు చూస్తే.. మౌనికకు నచ్చడం ముఖ్యం అని చెబుతుంది. అతడు నిజాయితీగా బాలు అన్నయ్య గొడవ గురించి చెప్పాడు. చెడ్డవాడు అయితే దాచిపెట్టేవాడు కదా నాన్న అని మౌనిక అంటుంది. దాంతో అవమానంగా బాలు వెళ్లిపోతాడు. ప్రభావతి నవ్వుతుంది. బార్‌లో కూర్చుని బాలు ఫ్రెండ్స్‌తో మందు తాగుతుంటాడు. రమేష్ చేసింది చెబుతాడు. వాడు దొరికితే మాములుగా ఉండదు అని బాలు అంటుండంగా అక్కడికి వస్తాడు.

దాంతో రమేష్ దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకుని గొడవ పడతాడు. కొట్టబోతుంటే.. వాళ్లంత చెత్త నాయలు అని నా జీవితంలో చూడలేదు. మీ ఇంట్లో అబద్దం చెప్పాను. నిజం చెప్పే ధైర్యం లేక. నేను మీ ఇంటికి వచ్చేదాకా పెళ్లి సంబంధం అని తెలియదు. ఇప్పుడు వాళ్లు దుర్మార్గులు అని చెప్పింది నీలకంఠంకు తెలిస్తే నన్ను నా కుటుంబాన్ని ముక్కలుగా ముక్కలుగా నరికుతారు. ఆ భయంతోనే అలా చెప్పాను అని రమేష్ అంటాడు.

ఎలా కాపాడుకోవాలో

ఇప్పుడు నా మాట వాళ్లు వినరు. ఎలా నా చెల్లిని కాపాడుకోవాలో తెలియట్లేదు అని బాలు అంటాడు. సారీ బాలు. ఎలాగైనా చేసి సంబంధం ఆపించు. నీ చెల్లెలు అంటే నా చెల్లెలే. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజుగాడు చెల్లెలిని పెళ్లి చేసుకోకూడదు. ఈ మాట నేను చెప్పానని చెప్పకు అని రమేష్ వెళ్లిపోతాడు. కొట్టింది నేను అని తెలిసి కూడా వచ్చారు. ఎంత అవమానించినా భయటపడలేదు. ఎందకు బయటపడలేదో అర్థం కావట్లేదు అని బాలు అంటాడు.

తర్వాత నీలకంఠం ఇంటికి వెళ్లి తాంబూళాలు మార్చుకుంటారు సత్యం, ప్రభావతి. కారులో వచ్చిన బాలు తాగొచ్చి ఇంటి బయట గొడవ చేస్తాడు. నీలకంఠం మనుషులు పట్టుకుంటారు. సంజు వచ్చి మాట్లాడుతాడు. దాంతో సంజు కాలర్ పట్టుకుంటాడు. దాంతో బాలును సత్యం కొడతాడు. బాలు ఆగిపోతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner