AP Fibernet : ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు షాక్- 410 మందిని తొలగించనున్నట్లు జీవీరెడ్డి ప్రకటన
AP Fibernet : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామని ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. మరో 200 మందికి నోటీసులు జారీచేశామన్నారు.
AP Fibernet : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలను పరిశీలిస్తున్నామని ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరాల కోరతామన్నారు. జీవీరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా రూ.1.15 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ నగదు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశామని, చెల్లించకపోతే ఆర్జీవీపై కేసు పెడతామని చెప్పారు.
వంట మనుషులు, డ్రైవర్లకు ఉద్యోగాలు
అపాయింట్మెంట్ లెటర్లు లేని 410 ఉద్యోగులను తొలగించనున్నామని ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం సమయంలో వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేసిన ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ఇవ్వాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ప్రారంభించినట్టు తెలిపారు. 2019లో 10 లక్షలు ఫైబర్ నెట్ కనెక్షన్లు 2024 నాటికి 5 లక్షలకు పడిపోయాయన్నారు.
ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం అర్హతలేని వారిని ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులుగా నియమించిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో నియమించిన 410 మందిని తొలగిస్తామన్నారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని ఉద్యోగులగా నియమించారన్నారు. ఏపీ ఫైబర్ నెట్‌లో 2016-19 మధ్య 108 ఉద్యోగులతో నడిపామన్నారు. అప్పట్లో 10 లక్షల కనెక్షన్లు అప్పట్లో ఉండేవని తెలిపారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులను 1360కి పెంచారన్నారు. అయితే ఫైబర్ నెట్ సంస్థ బిజినెస్ మాత్రం పెరగలేదని, నష్టాలు వచ్చాయన్నారు.
వైసీపీ టైమ్ లో నిమమించిన ఉద్యోగులoదరూ ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురి నేతల సిఫార్సుతో వచ్చారని జీవీరెడ్డి తెలిపారు. అవసరం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని విమర్శించారు. ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ ఆర్డర్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. ఎగ్జిట్ ఫార్మాట్ ప్రొసీజర్ తో మాత్రమే ఉద్యోగులను తొలగిస్తామన్నారు. 410 మంది ఉద్యోగులను నిబంధనల మేరకు మాత్రమే తొలగిస్తున్నామని జీవీరెడ్డి వెల్లడించారు. ఉద్యోగాలు ఇక్కడ, ఉద్యోగులు ఎక్కడో ఉంటున్నారన్నారు. ఎవరిపై వ్యక్తిగత కక్షతో ఉద్యోగాలు తొలగించటం లేదన్నారు. ఫైబర్ నెట్ రూ.2 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనకు విరుద్ధంగా నియమితులైన వారు అతి ప్రవర్తిస్తే జీతాల రికవరీతో పాటు క్రిమినల్ కేసులు పెడతామన్నారు. జీతాలు మాజీ ఎండీ నుంచి రికవరీ చేయటానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
సంబంధిత కథనం