(1 / 7)
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి నేడు ముగిసిన విచారణ వరకు జరిగిన విషయాలపై ఓ లుక్కేద్దాం.
(PTI)(2 / 7)
'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో (డిసెంబర్ 4) నాడు సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దాదాపుగా మూడున్నర గంటలపాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. అలాగే, బన్నీకి తన రిమాండ్ పేపర్స్ చూపించినట్లు, అందులో 18 నిందితులను చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
(PTI)(3 / 7)
తొక్కిసలాట ఘటన దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు బయలుదేరే ముందు అల్లు అర్జున్ ఇలా కనిపించారు. అభిమానులకు అభివాదం చేస్తున్న బన్నీని బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఇక్కడ చూడొచ్చు. అయితే, ఏ12 నుంచి ఏ15 మధ్య ఉన్న వ్యక్తులే తొక్కిసలాటకు కారణం అని పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు.
(PTI)(4 / 7)
'పుష్ప-2' సినిమా బెన్‌ఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా నటుడు అల్లు అర్జున్ విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చే సమయంలో పీఎస్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే, డిసెంబర్ 4న అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించడం వల్లే సంధ్యా థియేటర్‌కు భారీ సంఖ్యలో జనం వచ్చారని ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే.
(PTI)(5 / 7)
డిసెంబర్ 22న హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద పలువురు దాడికి పాల్పడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులుగా చెప్పుకుంటున్న ఆ వ్యక్తులు ఆదివారం పుష్ప 2 హీరో ఇంటి వద్ద ఉన్న పూల కుండీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
(PTI)(6 / 7)
డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన మహిళ మరణం కేసులో డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటో ఇది.
(ANI)(7 / 7)
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ పొంది చంచల్‌గూడా జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూడొచ్చు.
(PTI)ఇతర గ్యాలరీలు