Thati bellam: అప్పుడప్పుడు తాటి బెల్లం తింటే మంచిదే, కీళ్ల నొప్పుల నుంచి నెలసరి బాధల వరకు అన్నీ తగ్గుతాయి-eating palm jaggery once in a while is good it can reduce everything from joint pain to menstrual pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thati Bellam: అప్పుడప్పుడు తాటి బెల్లం తింటే మంచిదే, కీళ్ల నొప్పుల నుంచి నెలసరి బాధల వరకు అన్నీ తగ్గుతాయి

Thati bellam: అప్పుడప్పుడు తాటి బెల్లం తింటే మంచిదే, కీళ్ల నొప్పుల నుంచి నెలసరి బాధల వరకు అన్నీ తగ్గుతాయి

Haritha Chappa HT Telugu
Dec 24, 2024 04:30 PM IST

Thati bellam: చెరుకుతో చేసే బెల్లమే కాదు తాటి బెల్లం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడప్పుడు తాటి బెల్లాన్ని చిన్న ముక్క తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే మహిళల్లో నెలసరి బాధలు కూడా అదుపులో ఉంటాయి.

తాటిబెల్లం ఎందుకు తినాలి?
తాటిబెల్లం ఎందుకు తినాలి? (organicmandya)

తాటి బెల్లంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మీ శరీరాన్ని వెచ్చగా ఇది ఎంతో సహాయపడుతుంది. చెరుకుతో చేసిన బెల్లాన్ని ఎక్కువ ఇళ్లల్లో ఉపయోగిస్తారు. కానీ అప్పుడప్పుడు తాటిబెల్లాన్ని కూడా తినాల్సిన అవసరం ఉంది. జలుబు, దగ్గు చికిత్సకు ఇది సహాయపడుతుంది. తాటి చెట్ల నుండి లభించే రసం నుండి తాటి బెల్లం తయారుచేస్తారు. ఇందులో పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది డయాబెటిస్, ఊబకాయం ఉన్నవారికి వారి చక్కెర స్థాయిలు పెరగకుండా వారికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది స్వీట్ల రుచిని పెంచడమే కాదు. కృత్రిమ పదార్థాల వాడకాన్ని నివారిస్తుంది.

yearly horoscope entry point

కాలేయాన్ని శుద్ధి చేస్తుంది

తాటి బెల్లం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇది మీ ఆహారం రుచిని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

జీర్ణ ఆరోగ్యానికి

తాటి బెల్లం మీ పొట్టను శుభ్రపరుస్తుంది. పేగులు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. అవాంఛిత విషాన్ని విసర్జిస్తుంది. శరీరం ఆహారాన్ని బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. గట్ లోని మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు సహాయపడుతుంది. ఇది మలబద్దకం, జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పికి

తలనొప్పితో బాధపడుతున్నవారు, మైగ్రేన్ తో ఇబ్బందిపడుతున్నవారు రోజూ చిన్న తాటి బెల్లం ముక్కను తింటే ఆ సమస్యలు తగ్గుతాయి.

పీరియడ్ నొప్పులకు

ఎంతోమంది మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. వారికి పొత్తి కడుపు నొప్పి, తిమ్మిర్లు, వంటివి రాకుండా ఇది రక్షిస్తుంది. ఇది మీ శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. మూడ్ స్వింగ్స్ రాకుండా కూడా ఇది బయటపడేస్తుంది.

బరువు తగ్గడం

మీ శరీరంలో నిల్వ అయిన అధిక నీటిని ఇది బయటకు పంపుతుంది. నీటితో పాటూ వ్యర్థాలను విషాలను కూడా బయటకు పంపుతుంది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గర్భం ధరించాక ప్రతిరోజూ చిన్న ముక్క తాటి బెల్లం తింటే ఎంతో మంచిది. ప్రెగ్నెన్సీ బ్రిడ్జ్ మీ శరీరానికి ఇనుము, ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. దీన్ని మితంగా తీసుకుంటే పిండానికి, తల్లికి మంచిది.

తాటి బెల్లంలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను నయం చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటు పెరగకుండా కూడా నియంత్రిస్తుంది.

కీళ్ల నొప్పులకు

చలికాలంలో కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారు ప్రతిరోజూ చిన్న తాటి బెల్లం ముక్క తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు బలోపేతం అయి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

బాలింతలు కూడా తాటిబెల్లం తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాలు తాగే పిల్లలకు కూడా దీన్ని ప్రయోజనాలు అందుతాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం