Lemon Peel Benefits: నిమ్మతొక్క సహాయంతో ఊబకాయాన్ని వేగంగా తగ్గించుకోగల చిట్కా మీకు తెలుసా, ఏ విధంగా తీసుకుంటే ఉత్తమం
నిమ్మరసంతో బరువు తగ్గవచ్చనేది చాలాకాలంగా వింటూనే ఉన్నాం. కానీ, నిమ్మ తొక్క ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని మీకు తెలుసా. ఏ విధంగా తీసుకుంటే, ఎంత వేగవంతమైన ఫలితాలుంటాయో తెలుసుకుందాం రండి.
ప్రస్తుత సమాజంలో ప్రతి వంద మందిలో సగానికి పైగా ఊబకాయంతో ఇబ్బందిపడుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. సమయాబావం వల్లనో, నిర్లక్ష్య పెట్టడం వల్లనో ఈ పరిస్థితికి దారి తీస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు వేగవంతమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. వాటిల్లో ఒకటే ఈ నిమ్మకాయ వినియోగం. నిమ్మకాయ వాడి బరువు తగ్గడం వరకూ చాలా మందికి తెలుసు. కానీ, నిమ్మకాయ తొక్క వాడి ఊబకాయం సమస్య నుంచి వేగవంతంగా కోలుకోవచ్చట. అదెలాగో తెలుసుకుందామా..
నిమ్మకాయ వాడకం కొవ్వు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే వేడినీటిలో నిమ్మకాయ కలుపుకుని తాగడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. అయితే, నిమ్మకాయను ఉపయోగించిన తర్వాత, మనం సాధారణంగా దాని తొక్కలను విసిరేసి పారేస్తాం. బరువు తగ్గడానికి కూడా ఈ తొక్కలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
నిమ్మతొక్కలో ఉండే పోషకాలు:
రుచికి చేదుగా అనిపించే నిమ్మతొక్క బరువు తగ్గించడంలో ఎందుకు ఉపయోగపడుతుందనేదే మీ సందేహమా.. రండి. నిమ్మ తొక్కలో పెక్టిన్ అనే ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది కాకుండా, పాలీఫెనాల్స్ అనే పదార్థాలు కూడా నిమ్మతొక్కలో కనిపిస్తాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఇవి కొవ్వును కరిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మ తొక్కలలో ఫైబర్ , విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పనిచేస్తాయి.
నిమ్మతొక్కలతో టీ
బరువు తగ్గేందుకు నిమ్మతొక్కలను అనేక విధాలుగా తీసుకోవచ్చు. అందులో మొదటిది ఏమిటంటే, మీరు నిమ్మ తొక్కలతో రుచికరమైన టీని తయారుచేసుకుని తాగవచ్చు. దీని కోసం కొన్ని నిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించాలి. సగం నీరు మిగిలిపోయిన తర్వాత అందులో తేనె కలిపి తాగాలి. ఈ టీని మీరు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా తాగవచ్చు. ఇది శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
తేనె కలిపిన టీ
రెండో మార్గంగా నిమ్మ తొక్కలతో మరో రకమైన టీ. దీని కోసం నిమ్మతొక్కలను ఎండలో ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత వాటిని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో ఒక టీస్పూన్ పొడిని వేసి ఆ ద్రావణాన్ని కాసేపటి వరకూ బాగా మరిగించాలి. ఈ విధంగా కొవ్వును కరిగించే టీ రెడీ అవుతుంది. దీనికి ఒక చెంచా తేనె కూడా కలుపుకోవచ్చు. ఇది రుచితో పాటు దాని ప్రయోజనాలను కూడా రెట్టింపు చేస్తుంది.
సలాడ్‌లపై పొడిగా కూడా
కొవ్వు తగ్గించే పానీయాలతో పాటు, మీరు నిమ్మ తొక్కలను తురిమి కూరగాయలు, సలాడ్లు లేదా సూప్లతో పాటుగా తీసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ తొక్కలతో చేసిన పొడికి నల్ల మిరియాల పొడి, ఉప్పు కలపడం ద్వారా రుచికరమైన పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు, దీనిని ఏదైనా సలాడ్ లేదా పండుపై చల్లుకుని కూడా తీసుకోవచ్చు. ఇది ఆహారపు రుచిని పెంచుతుంది. అంతేకాకుండా కొవ్వు కరిగిపోయేందుకు కూడా సహాయపడుతుంది.
సంబంధిత కథనం