తెలుగు న్యూస్ / ఫోటో /
Anil Kapoor: అనిల్ కపూర్ గురించి ఈ విషయాలు తెలుసా? హీరోగా తొలి మూవీ తెలుగులోనే..
- Anil Kapoor Birthday: బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నేడు (డిసెంబర్ 24) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు ఎక్కువ మందికి తెలియవు. అలాంటివి ఇక్కడ చూడండి.
- Anil Kapoor Birthday: బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నేడు (డిసెంబర్ 24) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు ఎక్కువ మందికి తెలియవు. అలాంటివి ఇక్కడ చూడండి.
(1 / 8)
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ 68వ ఏట అడుగుపెట్టారు. నేడు (డిసెంబర్ 24) ఆయన బర్త్ డే జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాలను అనిల్ కపూర్ చేశారు.
(2 / 8)
అనిల్ కపూర్ గురించి ఇప్పటికీ కొన్ని విషయాలు ఎక్కువ మందికి తెలియదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
(3 / 8)
అనిల్ కపూర్ హీరోగా తెలుగులోనే తొలి మూవీ చేశారు. 1980లో వంశ వృక్షం చిత్రంలో ఆయన హీరోగా చేశారు. అంతకు ముందు 1979లో హమేరా తుమారే చిత్రంలో చిన్నపాత్రలో ఆయన కనిపించారు. అయితే, హీరోగా మాత్రం అరంగేట్రం చేసింది తెలుగు మూవీ వంశ వృక్షంతోనే. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆ తర్వాత బాలీవుడ్‍కు వెళ్లారు.
(4 / 8)
అనిల్ కపూర్ నటనతో మెప్పించడమే కాకుండా పాటలు కూడా బాగా పాడగలరు. సెమీ క్లాసికల్‍లో శిక్షణ కూడా తీసుకున్నారు. పలు చిత్రాల్లో పాడారు. వో 7 దిన్' (1983), హమారా దిల్ ఆప్కే పాస్ హై (2000), చమేలీ కీ షాదీ (1986) చిత్రాల్లో పాడారు. 1986లో సల్మా ఆగాతో కలిసి 'వెల్‍కమ్' అనే పాప్ ఆల్బంను రిలీజ్ చేశారు. ఈ విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.
(5 / 8)
సినీ నిర్మాత అయిన సురీందర్ కపూర్, నిర్మల్ కపూర్ దంపతులకు 1956లో అనిల్ కపూర్ జన్మించారు. బోనీ కపూర్ ఈయన సోదరుడే. రణ్‍వీర్ సింగ్‍కు కూడా బంధువే.
(6 / 8)
నోయిడాలోని ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్, టెలివిజన్ ఫిల్మ్ సిటీకి డైరెక్టర్ పదవి బాధ్యతలు కూడా అనిల్ కపూర్ నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం కూడా తక్కువ మందికే తెలుసు.
(7 / 8)
కెరీర్ ఆరంభంలో సంజయ్ దత్ మూవీ ‘రాకీ’ కోసం ఆడిషన్లకు వెళ్లినా అనిల్ కపూర్‌కు నిరాశే ఎదురైంది. చాందినీ మూవీలో అవకాశం వచ్చి చేజారింది.
ఇతర గ్యాలరీలు