OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్
OTT Mythological Thriller Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన ఈ మూవీకి ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది.
OTT Mythological Thriller Movie: సైన్స్ ఫిక్షన్ కు మన పురాణాలను జోడించి వస్తున్న సినిమాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ క్రమంలో తెలుగులో వచ్చిన సినిమాయే రహస్యం ఇదం జగత్. నవంబర్ 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం ప్రేక్షకులు 9.2 రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
రహస్యం ఇదం జగత్ ఓటీటీ రిలీజ్ డేట్
రహస్యం ఇదం జగత్ ఓ తెలుగు సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా గురువారం (డిసెంబర్ 26) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (డిసెంబర్ 23) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "రహస్యం ఇదం జగత్ మిస్టరీని తెలుసుకోండి. ఈటీవీ విన్ లో డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ థ్రిల్లింగ్ జర్నీని అస్సలు మిస్ కావద్దు" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. 50 రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మధ్య కాలంలో వరుసగా చిన్న సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటున్న ఈటీవీ విన్ ఓటీటీ.. ఇప్పుడీ రహస్యం ఇదం జగత్ మూవీని తీసుకొస్తోంది.
రహస్యం ఇదం జగత్ మూవీ స్టోరీ ఏంటంటే?
ప్రేమ, హత్య, ప్రతీకారం అనే స్టోరీకి వార్మ్ హోల్ ద్వారా టైమ్ ట్రావెల్ అనే సైన్స్ ఫిక్షన్ ను జోడించి దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ మూవీని తీశాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చినా ఆ కథను ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం కాస్త తడబడినట్లు సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం అమెరికాలోనే తీశారు. ఆరెగాన్ లోని పోర్ట్‌లాండ్ అడవుల్లో మూవీని చిత్రీకరించారు. అభి (రాకేష్), అకీరా (స్రవంతి ప్రత్తిపాటి) అనే జంట చుట్టూ తిరిగే కథ ఇది.
తన తల్లి కోసం అంటూ ఇండియాకు తిరిగి రావాలని అకీరా భావిస్తుంది. అయితే అంతకంటే ముందు ఫ్రెండ్స్ తో కలిసి ఓ చిన్న వెకేషన్ ప్లాన్ చేస్తారు. అదే మూవీ కథను మొత్తం మలుపు తిప్పుతుంది. క్వాంటం ఫిజిక్స్ కు మన పురాణాలను జోడించి ఓ రొమాన్స్, మర్డర్, రివేంజ్ స్టోరీని ఇంట్రెస్టింగా చెప్పే ప్రయత్నం మేకర్స్ చేసినా.. అది వర్కౌట్ కాలేదు. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో ఎంతమేర వర్కౌట్ అవుతుందో చూడాలి.