Manu Bhaker: నా మెడల్స్ కచ్చితంగా చూపిస్తాను.. ఎందుకు చూపించకూడదు: ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై-manu bhaker counters trollers says she will show olympic medals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Manu Bhaker: నా మెడల్స్ కచ్చితంగా చూపిస్తాను.. ఎందుకు చూపించకూడదు: ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై

Manu Bhaker: నా మెడల్స్ కచ్చితంగా చూపిస్తాను.. ఎందుకు చూపించకూడదు: ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై

Hari Prasad S HT Telugu
Sep 25, 2024 02:43 PM IST

Manu Bhaker: తనను ట్రోల్ చేస్తున్న వారికి మను బాకర్ ఘాటు రిప్లై ఇచ్చింది. తాను ఎక్కడికి వెళ్లినా ఒలింపిక్స్ లో సాధించిన రెండు బ్రాంజ్ మెడల్స్ ను చూపించడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ను ఆమె తిప్పికొట్టింది.

నా మెడల్స్ కచ్చితంగా చూపిస్తాను.. ఎందుకు చూపించకూడదు: ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై
నా మెడల్స్ కచ్చితంగా చూపిస్తాను.. ఎందుకు చూపించకూడదు: ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై (RAJ K RAJ /HT PHOTO)

Manu Bhaker: మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. ఆమెకు ముందు వరకూ ఏ ఇతర ఇండియన్ అథ్లెట్ ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలవలేదు. దీంతో ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రతి ఈవెంట్ కు హాజరై ఆ మెడల్స్ ను చూపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ చేయగా.. ఆమె ఇప్పుడు ఘాటుగా రిప్లై ఇచ్చింది.

మను బాకర్ రిప్లై ఇదీ..

ఒలింపిక్స్ లో ఒక మెడల్ గెలవడమే చాలా ఎక్కువ. అలాంటిది మను బాకర్ ఒకేసారి రెండు మెడల్స్ గెలిచింది. దీంతో ఇండియాలో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నో ఈవెంట్లకు ఆమెను చీఫ్ గెస్టుగా పిలుస్తున్నారు. వాటికి తన మెడల్స్ తీసుకొని వెళ్లి ఆమె చూపిస్తోంది. దీనిపై జరుగుతున్న ట్రోలింగ్ పై తాజాగా మను స్పందించింది.

"నేను కచ్చితంగా చూపిస్తాను. ఎందుకు చూపించకూడదు. తాను సాధించిన మెడల్ అందరికీ చూపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకే నేను కూడా వాటిని వెంట తీసుకెళ్తున్నాను. మెడల్ వెంట తీసుకునే రండి అని వాళ్లు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. వాటితోనే ఈ ఈవెంట్లలో ఫొటోలు దిగాల్సి వస్తోంది" అని మను బాకర్ చెప్పింది.

మనుపై ట్రోలింగ్

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు మెడల్స్ గెలిచిన మను బాకర్ కు ఇప్పటికీ సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో ఆమె బ్రాంజ్ మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఏ అథ్లెట్ అయినా తాను గెలిచిన మెడల్స్ ను ప్రతి ఒక్కరికీ చూపించడం ఎప్పటి నుంచో వస్తున్నదే.

కానీ సోషల్ మీడియాలో కొందరు ట్రోలర్స్ మాత్రం మను బాకర్ ను లక్ష్యంగా చేసుకొని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మెడల్స్ ను ఆమె అసలు వదలలేకపోతోందని, షో ఆఫ్ చేస్తోందని కామెంట్స్ చేశారు. దీనిపై ఆమె ఇలా ఘాటుగా స్పందించింది. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా ఆరు మెడల్స్ గెలవగా.. అందులో రెండు మను బాకర్ సాధించినవే.

ఆమెనే ఈసారి మెడల్స్ ఖాతా తెరిచింది. 25 మీటర్ల పిస్టల్ కేటగిరీలోనూ మెడల్ గెలిచేలా అనిపించినా.. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మిస్సయింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ మూడు ఈవెంట్లలో పోటీ పడినా.. ఒక్క మెడల్ కూడా సాధించకుండా నిరాశ పరిచిన ఆమె.. ఈసారి రెండు మెడల్స్ తో ఆ కరువు తీర్చుకుంది.