Gay Couple : దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలపై గే జంట లైంగిక దాడి.. 100 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు!
Gay Couple : దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలపై ఓ గే జంట దారుణానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించింది. దీంతో వారికి కోర్టు 100 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
స్వలింగ సంపర్కుల జంటకు అమెరికాలో వందేళ్ల జైలు శిక్ష పడింది. తాము దత్తత తీసుకున్న పిల్లలపై ఈ జంట లైంగికదాడికి పాల్పడింది. పేరోల్ కూడా తీసుకునే అవకాశం లేదని తేల్చిచెప్పింది. వాల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఈ శిక్ష విధించారు.
జార్జియాకు చెందిన స్వలింగ సంపర్కుల జంట ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇద్దరు నిందితులు విలియం, జాచరీ జులాక్‌లకు పెరోల్ అవకాశం లేకుండా ఒక్కొక్కరికి 100 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. వాల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఈ మేరకు శిక్ష అమలు చేసింది.
విలియమ్‌కు 34 ఏళ్లు, జాకరీకి 36 ఏళ్లు. వారు ఇంతకుముందు 12, 10 ఏళ్లు నిండిన ఇద్దరు సోదరులను దత్తత తీసుకున్నారు. అట్లాంటా శివారులో భయటకు సంతోషకరమైన కుటుంబాన్ని నడుపుతున్నట్టుగా కనిపించేవారు. హ్యాపీ హోమ్ అంటూ జనాల ముందు కలరింగ్ ఇచ్చేవారు. స్వలింగ సంపర్కులుగా పిల్లలను పెంచారు. కానీ లోపల మాత్రం పిల్లలకు నరకం చూపించినట్టుగా విచారణలో తేలింది.
'నిజంగా భయానక గృహాన్ని సృష్టించారు. వారి కోరికలను తీర్చుకునేందుకు పిల్లలను వాడుకున్నారు. ఈ కేసులో న్యాయం కోసం, బాధితుల కోసం పోరాడిన వారి సంకల్పం గొప్పది.' అని డిస్ట్రిక్ట్ అటార్నీ రాండీ మెక్‌గిన్లీ విలియం అన్నారు.
జకరీ బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవాడు. విలియం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు. వారి జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. కానీ ఇద్దరు సోదరులను రోజూ వారితో శృంగారం చేయమని బలవంతం చేసేవారు. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోలు తీసేవారు. అవి ఇతరులకు కూడా పంపేవారు.
పిల్లలను లైంగికంగా వేధిస్తున్న ఫొటోలను స్నాప్‌చాట్‌లో స్నేహితుడికి పంపినట్టుగా కూడా విచారణలో తెలిసింది. సోషల్ మీడియాలో పిల్లల గురించి తప్పుగా ప్రచారం చేశారు. చైల్డ్ పోర్న్‌ను డౌన్‌లోడ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా వీరి బాగోతం బయటకు వచ్చింది. కోర్టులో ఇద్దరు నిందితులు కూడా పిల్లలపై తీవ్రమైన వేధింపులతో పాటు లైంగిక దోపిడీకి పాల్పడ్డారని నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు వారికి 100 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పేరోల్ అవకాశం కూడా లేదని చెప్పింది.