Villain: విలన్ పాత్రకు రూ.200కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియాలో అత్యధికం ఇదే.. ప్రభాస్, షారూఖ్ కంటే ఎక్కువగా..
Highest Remuneration Villain: ఓ చిత్రంలో విలన్ పాత్ర పోషించేందుకు ఓ యాక్టర్ ఏకంగా రూ.200కోట్లు తీసుకుంటున్నారు. దీంతో ఇండియా విలన్ పాత్రకు అత్యధిక మొత్తం అందుకున్న యాక్టర్‌గా చరిత్ర సృష్టించారు.
సినిమాల్లో హీరో స్టార్‌డమ్‍ను బట్టి రెమ్యూనరేషన్లు ఉంటాయి. ఇటీవల స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు భారీగా పెరిగిపోయాయి. ఒక్కో సినిమాకు రూ.100కోట్లకు మించి తీసుకుంటున్న టాప్ హీరోలు కూడా ఉంటున్నారు. చాలా సినిమాల బడ్జెట్‍లో హీరో రెమ్యూనరేషనే ఎక్కువ శాతం ఉంటుంది. సపోర్టింగ్ పాత్రల్లో ప్రముఖ నటీనటులను తీసుకుంటే వారికి కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఇటీవలి కాలంలో విలన్ పాత్రలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. బిగ్ బడ్జెట్ సినిమాల్లో కొందరు హీరోలే విలన్లుగా నటిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో విలన్ పాత్రకు కూడా నిర్మాతలు భారీగా ఖర్చు చేయాల్సిందే. తాజాగా ఓ సినిమాలో విలన్ పాత్రకు ఓ యాక్టర్ ఏకంగా రూ.200కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. దీంతో భారత్‍లో ఓ చిత్రానికి అత్యధిక మొత్తం తీసుకున్న విలన్‍గా చరిత్ర సృష్టించారు.
అత్యధిక మొత్తం తీసుకున్న విలన్ ఎవరంటే..
కన్నడ స్టార్ హీరో యశ్.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ తెచ్చుకున్నారు. భారత సినీ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న విలన్‍గా యశ్ రికార్డు సృష్టించారు. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో విలన్ పాత్ర కోసం యశ్ రూ.200కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ మూవీలో రావణుడిగా యశ్ నటిస్తున్నారు.
మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‍బీర్ కపూర్ నటిస్తున్నారు. ఆయన కంటే రావణుడి పాత్ర వేస్తున్న యశ్ అత్యధిత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ విలన్‍గా నిలిచారు. కల్కి 2898 ఏడీ చిత్రానికి గాను కమల్ హాసన్ రూ.40కోట్లు తీసుకొన్ని.. అత్యధిక మొత్తం తీసుకున్న విలన్‍గా నిలిచారు. అయితే, ఈ రికార్డును నాలుగు రెట్ల కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటూ తిరగరాశారు యశ్. రామాయణ చిత్రానికి సహ నిర్మాతగానూ యశ్ ఉన్నారు. నిర్మాణంలో భాగమైనట్టు ఆయనే ఇటీవల చెప్పారు.
ప్రభాస్, షారూఖ్, సల్మాన్ కంటే ఎక్కువగా..
స్టార్ హీరోలను మించి విలన్ పాత్ర కోసం ఏకంగా రూ.200కోట్లను తీసుకుంటున్నారు యశ్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. కొన్నేళ్లుగా ఒక్కో చిత్రానికి సుమారు రూ.150కోట్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ.120కోట్ల నుంచి రూ.150కోట్ల వరకు అందుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా సుమారు రూ.120కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రామాయణ రెమ్యూనరేషన్‍తో యశ్ వీళ్లందరినీ దాటేశారు. అదీ విలన్ పాత్రతో. ఇండియాలో ఒక్క చిత్రానికి రూ.200 కోట్ల కంటే ఎక్కువగా అల్లు అర్జున్ (పుష్ప 2), విజయ్ (ది గోట్), రజినీకాంత్ (జైలర్) మాత్రమే తీసుకున్నారు. యశ్ కూడా ఇప్పడు ఈ మార్క్ టచ్ చేసేశారు.
రామాయణ చిత్రంలో రాముడిగా రణ్‍బీర్ నటిస్తుండగా.. సీతాదేవి పాత్రను సాయి పల్లవి పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోంది. నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రాతో పాటు యశ్ కూడా ఈ మూవీకి నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది.