Garividi Lakshmi: ఏపీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా.. నిర్మాత, నటీనటులు ఎవరో తెలుసా?-anandi garividi lakshmi movie launch the biopic of north andhrapradesh burra katha artist garividi lakshmi by pmf ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Garividi Lakshmi: ఏపీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా.. నిర్మాత, నటీనటులు ఎవరో తెలుసా?

Garividi Lakshmi: ఏపీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా.. నిర్మాత, నటీనటులు ఎవరో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Dec 24, 2024 02:32 PM IST

Garividi Lakshmi Movie Launch Pooja Ceremony: ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాపులర్ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిస్తున్న కొత్త తెలుగు మూవీ గరివిడి లక్ష్మి. ఆనంది, రాశి, వీకే నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ నటించనున్న ఈ గరివిడి లక్ష్మి పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఏపీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా.. నిర్మాతగా స్టార్ ప్రొడ్యూసర్ కూతురు
ఏపీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా.. నిర్మాతగా స్టార్ ప్రొడ్యూసర్ కూతురు

Garividi Lakshmi Movie Launch: తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ధమాకా, గూఢచారి, కార్తికేయ 2 వంటి ఎన్నో హిట్ మూవీస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు చిన్న సినిమాలను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే #PMF48 ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

yearly horoscope entry point

మరో ఇంపాక్ట్ రోల్

ఈ సినిమా పేరే గరివిడి లక్ష్మి. పవర్‌ఫుల్ పర్ఫామెన్స్‌తో తన పాత్రలకు డెప్త్‌ని తెచ్చే హీరోయిన్ ఆనంది చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ఇది. ఇంపాక్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ కొత్త, స్ఫూర్తిదాయకమైన చిత్రంలో మరొక ఇంపాక్ట్ ఫుల్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది ఆనంది.

ఏపీలోని ఆదోనిలో ఈవెంట్

'గరివిడి లక్ష్మి' టైటిల్‌తో రూపొందనున్న #PMF48 ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాను సెలబ్రేట్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్‌లలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసినట్లు చెప్పారు.

బుర్రకథ కళాకారిణి జీవిత కథ

ఈ సరికొత్త చొరవను వెటరన్ యాక్టర్ నరేష్, ఎమ్మెల్యే పార్ధసారథి ప్రశంసించారు. ఇది ప్రాజెక్ట్‌పై నిర్మాతల విశ్వాసాన్ని హైలైట్ చేస్తుందని అన్నారు. అయితే, ఈ సినిమా ఉత్తర ఆంధ్రాకు చెందిన ఐకానిక్ బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఆమె స్ఫూర్తిదాయకమైన కథను, మహిళల గుర్తింపు ఇతివృత్తాన్ని చూపించనున్నారు.

గరివిడి లక్ష్మి మూవీ పూజా కార్యక్రమం

ఎమ్మెల్యే పార్ధసారథి ఫస్ట్ క్లాప్‌ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ ‌కెమెరా స్విచాన్‌ చేయడంతో గరివిడి లక్ష్మి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్క్రిప్ట్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న అపారమైన విశ్వాసం ఈవెంట్ గొప్పతనంలో స్పష్టంగా కనిపించిందని అతిథులు తెలిపారు. ఇది సినిమా విజయంపై వారి నమ్మకాన్ని చూపిందని చెప్పారు.

నిర్మాతగా స్టార్ ప్రొడ్యూసర్ కూతురు ఎంట్రీ

జనవరి మూడో వారంలో ఆదోనిలో గరివిడి లక్ష్మి షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కుమార్తె టీజీ కృతి ప్రసాద్ గరివిడి లక్ష్మి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. జె.ఆదిత్య కెమెరామ్యాన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.

గరివిడి లక్ష్మీ నటీనటులు

గరివిడి లక్ష్మి సినిమాలో యాక్టర్ నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరిన్ని వివరాలను, అప్డేట్స్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Whats_app_banner