Guntur : పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం.. టీడీపీకి సజ్జల మాస్ వార్నింగ్!-ysrcp leader sajjala ramakrishna reddy issues mass warning to tdp over illegal arrests ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur : పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం.. టీడీపీకి సజ్జల మాస్ వార్నింగ్!

Guntur : పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం.. టీడీపీకి సజ్జల మాస్ వార్నింగ్!

Basani Shiva Kumar HT Telugu
Dec 24, 2024 02:04 PM IST

Guntur : ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా.. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. పులి పంజా ఎట్టా ఉంటుందో.. భవిష్యత్తులో చూపిస్తామని వ్యాఖ్యానించారు. సజ్జల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సజ్జల రామకృష్ణా రెడ్డి
సజ్జల రామకృష్ణా రెడ్డి

నందిగం సురేష్‌పై అక్రమ కేసులు పెట్టారని.. వైసీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టారన్న సజ్జల.. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి వైసీపీ నేతలను జైల్లో ఉంచుతున్నారని వ్యాఖ్యానించారు. జైలులో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించలేదని.. వైసీపీని లేకుండా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం గుంటూరు జైలులో నందిగం సురేష్‌ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.

yearly horoscope entry point

కొట్టగలిగే శక్తి ఉంది..

'వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోంది. ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారు. ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్లం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది' అని సజ్జల వ్యాక్యానించారు.

సీఎం కొడుకు చెబుతున్నా..

'కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. కనీసం వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు‌. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి? అనేది చెబుతున్నారు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైసీపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు' అని సజ్జల ఫైర్ అయ్యారు.

గుంటనక్కల్లా కాదు..

'గతంలో ముప్పై ఏళ్ల కిందట నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు.. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి. కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తుంది. గుంట నక్కల్లా వ్యవహరించడం వైసీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది' అని రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.

పులి పంజా ఎట్టా ఉంటుందో..

'నాలుగేళ్లలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్లు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. ఇది అభిమానంతో ఆవిర్భవించిన పార్టీ. జగన్ అభిమానులే కార్యకర్తలు, నాయకులుగా ఉన్న పార్టీ. మీలాగ గుంటనక్కల్లా కాదు.. పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం' అని సజ్జల రామకృష్ణా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సజ్జల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Whats_app_banner