Biggest Flop: 17 వందల కోట్ల బడ్జెట్- 2024 సీక్వెల్స్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్- దెబ్బకు ఫ్రాంచైజీ ఆపేసిన నిర్మాతలు!-biggest flop sequel movie in 2024 joker folie deux get 206 million dollars worldwide for 400 million dollars budget ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop: 17 వందల కోట్ల బడ్జెట్- 2024 సీక్వెల్స్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్- దెబ్బకు ఫ్రాంచైజీ ఆపేసిన నిర్మాతలు!

Biggest Flop: 17 వందల కోట్ల బడ్జెట్- 2024 సీక్వెల్స్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్- దెబ్బకు ఫ్రాంచైజీ ఆపేసిన నిర్మాతలు!

Sanjiv Kumar HT Telugu
Dec 24, 2024 01:48 PM IST

Biggest Flop Sequel Movie In 2024 Joker Folie A Deux: 2024 సంవత్సరంలో అతిపెద్ద ఫ్లాప్ సీక్వెల్ మూవీగా నిలిచింది జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్. 2019లో సంచలన విజయం సాధించిన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన జోకర్ 2 బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

17 వందల కోట్ల బడ్జెట్- 2024 సీక్వెల్స్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్- దెబ్బకు ఫ్రాంచైజీ ఆపేసిన నిర్మాతలు!
17 వందల కోట్ల బడ్జెట్- 2024 సీక్వెల్స్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్- దెబ్బకు ఫ్రాంచైజీ ఆపేసిన నిర్మాతలు!

Biggest Flop Sequel Movie Of 2024: హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ లేదా ప్రీక్వెల్స్, రీమేక్స్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. లేదా కథ నచ్చితే రీమేక్స్ కూడా చేస్తారు. ఇక హాలీవుడ్‌లో వచ్చే సీక్వెల్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే వాటి బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి.

yearly horoscope entry point

బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా

కానీ, 2024 సంవత్సరంలో మాత్రం అతి భారీ అంచనాలతో వచ్చి ఆ స్థాయికి దరిదాపుల్లో కూడా కలెక్షన్స్ అందుకోకుండా ఈ ఏడాదిలోని సీక్వెల్స్ మూవీస్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన సినిమా జోకర్ 2. 2019లో వరల్డ్ వైడ్‌గా విడుదలైం బాక్సాఫీస్ వద్ద రూ. 8500 కోట్లు కొల్లగొట్టి సంచలన విజయం సాధించింది జోకర్ మూవీ.

దాంతో ఈ మూవీ సీక్వెల్‌కు తెగ క్రేజ్ ఏర్పడింది. జోకర్ చిత్రానికి ఐదేళ్లకు జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్ టైటిల్‌తో సీక్వెల్ మూవీ వచ్చింది. గార్డియన్ వెబ్ సైట్ ప్రకారం జోకర్ 2 మూవీని సుమారుగా 190 నుంచి 200 మిలియన్ డాలర్లతో నిర్మించారు. అంటే, సుమారుగా రూ. 17 వందల కోట్లు. అంతేకాకుండా మార్కెటింగ్, ప్రీ రిలీజ్ బిజినెస్ వంటి ఇతర అంశాలకు మరో వంద మిలియన్ డాలర్ల వరకు ఖర్చు అయిందట.

మొత్తం ఖర్చు 34 వేల కోట్లు

దాంతో జోకర్ 2 మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 400 మిలియన్ల డాలర్లుగా ఫిక్స్ అయింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 3,400 కోట్లు. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి అయితేనే సినిమా హిట్ అయినట్లు. అంటే జోకర్ 2 సినిమాకు 3,400 కోట్లు వస్తేనే హిట్‌గా నిలిచి, ఆ తర్వాత వచ్చే కలెక్షన్స్ నిర్మాతలకు లాభాలుగా మారుతాయి.

కానీ, జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా వచ్చింది మాత్రం 206 మిలియన్ డాలర్సే. అంటే, వెరైటీ కథనం ప్రకారం జోకర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 150 నుంచి 200 మిలియన్ డాలర్ల రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొంది. అంటే, అయినా ఖర్చుకు సగం మాత్రమే వచ్చిందని తెలుస్తోంది.

టాప్ 5 నుంచి అవుట్

అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జోకర్ 2 మూవీకి రెండో వారంలోనే వసూళ్లు 81 శాతం పడిపోయాయి. 2 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఇండీ హారర్ సీక్వెల్ ఫిల్మ్ టెర్రీఫైయర్ 3 సినిమా కలెక్షన్స్‌ను కూడా దాటలేకపోయింది జోకర్ 2. ఇక మూడో వారం వచ్చేసరికి టాప్ 5 గ్రాసర్ సినిమాల జాబితాలో నుంచి నిష్క్రమించింది ఈ డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్.

జోకర్ 2 బాక్సాఫీస్ ఎఫెక్ట్‌కు ఈ ఫ్రాంచైజీలో మరో సినిమాను తీయాలన్న ఆలోచనను పక్కన పడేశారట దర్శకనిర్మాతలు. ఇక జోకర్ ఫ్రాంచైజీని ఆపేద్దామని నిర్ణయం తీసుకున్నారట. మరి అంతలా షాక్ ఇచ్చిన జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్ ఫ్లాప్‌కు చాలా కారణాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు చెప్పారు.

మ్యూజికల్ థ్రిల్లర్‌గా

జోకర్ 2 మూవీలో జోకర్ సినిమాలో నటనతో ఆస్కార్ అవార్డ్ అందుకున్న జోక్విన్ ఫినీక్స్, పాప్ స్టార్ లేడి గాగా వంటి దిగ్గజాలు నటించిన కథ లోపించినట్లు తెలుస్తోంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా జోకర్ వస్తే మ్యూజికల్ థ్రిల్లర్‌గా జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్ రావడమే పెద్ద పొరపాటు అని చెబుతున్నారు.

జోకర్ 2 మూవీలోని ఓ సన్నివేశం
జోకర్ 2 మూవీలోని ఓ సన్నివేశం
Whats_app_banner