Aay Box Office: 300 శాతం పెరిగిన ఆయ్ కలెక్షన్స్- బ్రేక్ ఈవెన్ పూర్తి- జూనియర్ ఎన్టీఆర్ బావమరిది సినిమాకు లాభాలు!
Aay 4 Days Worldwide Collection: జూనియర్ ఎన్టీఆర్‌కు వరసకు బావమరిది అయ్యే నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమా ఆయ్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఆయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. 300 శాతం కలెక్షన్స్ పెరిగిన ఆయ్ సినిమాకు 4 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Aay Movie Box Office Collection: మ్యాడ్ మూవీతో మంచి హిట్ కొట్టిన నార్నే నితిన్ నటించిన రెండో సినిమా ఆయ్. జూనియర్ ఎన్టీఆర్‌కు వరసకు బావమరిది అయ్యే నార్నే నితిన్ ఆయ్ మూవీకి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ఆయ్ మూవీకి ఇండియావైడ్‌గా 4 రోజుల్లో రూ. 1.8 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే, మూడో రోజున రూ. 1.2 కోట్ల నెట్ కలెక్షన్స్ ఉండగా.. నాలుగో రోజుకి 50 శాతం వసూళ్లు పెరిగాయి. ఇక నాలుగు రోజుల్లో భారతదేశంలో ఆయ్ సినిమాకు 4.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే ఆయ్ సినిమాకు ఓవర్సీస్‌లో ఇప్పటికీ కోటి రూపాయల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇలా ఆయ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ. 3.90 కోట్ల షెర్ కలెక్షన్స్, రూ. 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లలో రూ. 3.62 కోట్ల షేర్, రూ. 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి సాధించినవి.
ఇక ఆయ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 3.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇప్పటికీ ఈ చిత్రం 3.90 కోట్ల షేర్ రాబట్టింది. అంటే నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయడమే కాకుండా లాభాలు కూడా సాధించుకుంది. ఆయ్ చిత్రం రూ. 40 లక్షలు ప్రాఫిట్ సాధించి హిట్ మూవీగా నిలిచింది.
అయితే, మొదటి రోజు లక్షల్లో కలెక్షన్స్ సాధించిన ఆయ్ సినిమా రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. ఇలా ఇప్పుడు ఏకంగా లాభాలవైపు పయనిస్తోంది. అంతేకాకుండా ఆయ్ నాలుగు రోజుల కలెక్షన్స్ జర్నీ చూస్తే ఏకంగా 300 శాతం వసూళ్లు పెరిగినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మొదటి రోజున రూ. 62 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఆయ్ సినిమా నాలుగో రోజు వచ్చేసరికి (4వ రోజున) 2.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే 300 శాతం వసూళ్లు పెరిగాయి అని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌పై రాసుకొచ్చారు. ఇక ఐదో రోజున అంటే సోమవారం (ఆగస్ట్ 19) రూ. 21 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇది ప్రస్తుతం బుకింగ్ అయిన ఆన్‌లైన్ టికెట్స్ ప్రకారం వేసిన అంచనా. నైట్ షోల వరకు ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ వంటి పెద్ద హీరోల సినిమాలపై చిన్న మూవీగా విడుదలై వాటికంటే పెద్ద హిట్‌గా నిలిచింది ఆయ్ మూవీ.