ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 25న నిర్వహించుకునే క్రిస్మస్ వేడుకలో సంప్రదాయ క్రిస్మస్ ట్రీకి ఎంతో ప్రత్యేకత ఉంది. క్రిస్మస్ ట్రీ అలంకరణ, ఇంట్లో డెకరేషన్ కు వాడే కొన్ని ప్రసిద్ధ వస్తువుల గురించి తెలుసుకుందాం.   

pexels

By Bandaru Satyaprasad
Dec 24, 2024

Hindustan Times
Telugu

క్రిస్మస్ చెట్టు - క్రిస్మస్ పండుగలో ప్రధాన ఆకర్షణ క్రిస్మస్ ట్రీ. వివిధ రకాల లైట్లు, ఆర్నమెంట్స్, స్టార్ టాపర్‌తో అలంకరించవచ్చు.  

pexels

 

ఫెయిరీ లైట్లు - స్ట్రింగ్ లేదా ఫెయిరీ లైట్లు తెలుపు లేదా మల్టీకలర్‌లో ఎంతో అద్భుతంగా ఉంటాయి. క్రిస్మస్ ట్రీ, కిటికీలు లేదా గోడలపై, ఇంటి లోపల, ఆరుబయట ఈ ఫెయిరీ లైట్లు ఏర్పాటుచేసుకోవచ్చు. ఇవి పండుగ వాతావరణాన్ని మరింత అందంగా చేస్తారు.  

pexels

దండలు - ఇవి ప్రధానంగా తలుపులకు వేలాడదీస్తారు. బంధువులను స్వాగతించే ద్వారం వద్ద పచ్చదనం, బెర్రీలు, రిబ్బన్‌లతో వీటిని తయారు చేసి ఏర్పాటు చేస్తారు.  

pexels

క్యాండిల్స్, లాంతర్లు - క్యాండిల్స్, లాంతర్లు ఇంట్లో వెచ్చదనం కలిగిస్తాయి. వీటి వెలుతురు హాయిగా ఉంటుంది. దాల్చిన చెక్క లేదా పైన్ సువాసనలతో కూడిన కొవ్వొత్తులు పండుగ అనుభూతిని పెంచుతాయి. 

pexels

కిటికీలు, మెట్లు లేదా టేబుల్‌టాప్‌లపై ఉపయోగించే దండలు, గార్లండ్స్, లైట్లు లేదా పూసల దండలు ఇంటిని మరింత ఆకర్షణగా మారుస్తాయి.   

pexels

క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ - క్రిస్మస్ ట్రీ అలంకరణలో సంప్రదాయకంగా బల్బులు, నక్షత్రాలు, బెల్స్, ఆభరణాలు ఉపయోగిస్తారు. శైలితో సంబంధం లేకుండా క్రిస్మస్ అలంకరణలు మీ పండుగ స్ఫూర్తిని పెంచుతాయి.   

pexels

 స్టాకింగ్స్ -క్రిస్మస్ అలంకరణలకు అవసరమైన వస్తువులలో స్టాకింగ్స్(మేజోళ్లు) ఒకటి. వీటిని గోడలకు అలంకరిస్తారు. వీటిని చిన్న బహుమతులు లేదా ట్రీట్‌లను ఉంచడానికి ఉపయోగిస్తారు.

pexels

ఈ 5 సంకేతాలు రక్తంలో అధిక చక్కెరను సూచిస్తాయి, జాగ్రత్త!