Unstoppable 4 OTT: బాలయ్య, వెంకీ సరదా, సందడి మామూలుగా లేదు.. ప్రోమో చూసేయండి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Unstoppable 4 OTT - Balakrishna, Venkatesh: అన్‍స్టాపబుల్ షోకు విక్టరీ వెంకటేశ్ గెస్టుగా హాజరయ్యారు. హోస్ట్ బాలకృష్ణ, వెంకీ సందడితో అదరగొట్టారు. ఈ ఎపిసోడ్ ప్రోమో నేడు వచ్చేసింది. ఈ ప్రోమో మంచి ఫన్‍తో ఉంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే 4’కు గెస్టుగా హాజరయ్యారు విక్టరీ వెంకటేశ్. వచ్చే నెల సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ (జనవరి 12)తో బాలయ్య, సంక్రాంతికి వస్తున్నాం (జనవరి 14)తో వెంకీ పోటీ పడనున్నారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు అన్‍స్టాపబుల్ షోలో ఫుల్ సందడి చేశారు. నేడు (డిసెంబర్ 24) వచ్చిన ప్రోమో చూస్తే అది అర్థమవుతోంది. ఈ ప్రోమో చాలా సరదాగా, సందడిగా ఉంది.
నా మనసులో మహారాజు నువ్వే
లెట్స్ వెల్‍కమ్.. మై డియర్ విక్టరీ వెంకటేశ్ అని బాలయ్య ఆహ్వానించడంతో ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు సీనియర్ హీరోలు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. “పోటీయా మనం ఒకరికి ఒకరం” అని అమాయకంగా బాలయ్య అడిగారు. ఎక్కడమ్మా పోటీ అని వెంకీ అన్నారు. బాలయ్యను డాకూ అని సరదాగా అన్నారు వెంకీ. “నా మనసులో మహారాజు నువ్వే” అని బాలకృష్ణ వెంకటేశ్‍ను అన్నారు. వెంకీ తొడ కూడా కొట్టారు. ఇద్దరూ కాలిపై కాలు వేసుకొని స్టైలిష్‍గా కూర్చున్నారు.
నాలుగు స్తంభాలు
గతంలో తాను, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ కలిసి దిగిన ఫొటోను స్క్రీన్‍లో బాలకృష్ణ చూపించారు. కెరీర్ ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయని, అప్పట్లో చెన్నైలో ఓ రేంజ్‍లో హవా చూపించామని బాలయ్య అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అని చెప్పారు. రాముడు మంచి బాలుడు అని బాలయ్య అంటే.. కొంప తీసి నువ్వు అనుకుంటున్నావా అని వెంకీ సరదాగా చెప్పారు. ఏంటి భయపెడుతున్నావా అని బాలకృష్ణ అన్నారు. ఆ తర్వాత నాగచైతన్యతో పాటు వెంకీ ఫ్యామిలీ ఫొటోలను బాలయ్య చూపించారు.
తమ్ముడి కోసం త్యాగం చేశావా
ప్రముఖ నిర్మాత, వెంకటేశ్ సోదరుడు సురేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. “ఇంత అందంగా ఉండి కూడా నిర్మాతగా ఎందుకయ్యావ్. తమ్ముడి కోసం కెరీర్ త్యాగం చేశావా” అని బాలకృష్ణ ప్రశ్నించారు. కాదు అంటూ చేయి ఊపారు. కమల్ హాసన్‍లా ఉన్నావని సురేశ్ బాబును అప్పట్లో అనేవారని వెంకటేశ్ తెలిపారు. వెంకటేశ్ స్కూల్ రోజుల గురించి సరదా కామెంట్లు చేశారు సురేశ్.
తండ్రిని తలచుకొని ఎమోషనల్
తన తండ్రి, మూవీ మొఘల్ రామానాయుడును తలచుకొని వెంకటేశ్, సురేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. చివరి రోజుల్లో చాలా బాధగా అనిపించిందని, ఏదో ఒకటి చేసి ఉంటే బాగుండేదని అనిపించిందని వెంకీ భావోద్వేగానికి గురయ్యారు. మంచి పని చేసి చేసినా తన తండ్రికి ఇబ్బందులు వచ్చాయని, నమ్ముకున్న వారు మోసం చేశారని బాధపడ్డారని సురేశ్ బాబు తెలిపారు.
ఒకరి డైలాగ్స్ ఒకరు
ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేశ్ ఒకరి మూవీ డైలాగ్స్ మరొకరు చెప్పారు. కంటి చూపుతో చంపేస్తా అని వెంకీ చెబితే.. సింగిల్ హ్యాండ్ గణేశ్ డైలాగ్ పలికారు బాలయ్య. తొడ కొట్టి నొప్పి వచ్చిందనేలా వెంకీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
జోష్‍తో డ్యాన్స్
ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. ఐకానిక్ అన్‍స్టాపబుల్ ఫ్రేమ్ కావాలని అడిగితే.. బాలయ్య, వెంకీ స్టైలిష్‍గా కూర్చున్నారు. ఆ తర్వాత ‘పెళ్లి కళ వచ్చేసింది బాలా’ పాటకు ఫుల్ జోష్‍తో స్టెప్స్ వేశారు బాలకృష్ణ, వెంకటేశ్, అనిల్ రావిపూడి. గతేడాతి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ చేసిన అనిల్.. ఇప్పుడు వెంకీతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తెరకెక్కించారు. ఈ ప్రోమో పుల్ ఫన్‍తో అదిరిపోయింది.
ఎపిసోడ్ డేట్, స్ట్రీమింగ్ వివరాలు
విక్టరీ వెంకటేశ్ వచ్చిన అన్‍స్టాపబుల్ 4వ సీజన్ 7వ ఎపిసోడ్ డిసెంబర్ 27న సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది.