Obulapuram Mining Case: 17ఏళ్ల కిందటి కేసులో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?
Obulapuram Mining Case: 17ఏళ్ల కిందటి కేసులో టీడీపీ ప్రజా ప్రతినిధులు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై నమోదైన కేసులో ఉమ్మడి ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
Obulapuram Mining Case: 17ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో నమోదైన కేసులో నాటి ప్రజా ప్రతినిధులు కోర్టుకు విచారణకు హాజరయ్యారు. మంగళవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం కోర్టుకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజర్యారు.
2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన 21 నేతల మంది పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో ఉండగానే ముగ్గురు మరణించగా మిగిలిన వారిని తప్పనిసరిగా కోర్టుకు హాజరవాలంటూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించడంతో నేతలు కోర్టుకు హాజరయ్యారు.
కోర్టుకు హాజరైన వారిలో మంత్రి అచ్చం నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు బాబు రాజేంద్రప్రసాద్, కోళ్ల లలిత కుమారి, పొలం నాగరాజు, చిన్నబాబు రమేష్, గురుమూర్తి తదితరులు ఉన్నారు. విజయవాడ కోర్టు ఆవరణలో ఆంధ్ర తెలంగాణ నేతల కలయికతో సందడిగా మారింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతల్లో కొందరు పార్టీలు మారినా పాత మిత్రులతో ఆత్మీయ సంభాషణలు జరిపారు.
మంగళవారం కోర్టు ప్రాంగణంలో టీడీపీ నేతలు, అప్పటి టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి పరస్పరం కలుసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఓబుళాపురం గనుల పరిశీలనకు వెళ్లినప్పుడు నిక్షేదాజ్ఞలు ఉల్లంఘించినందుకు నమోదైన కేసు.. ఇప్పటికీ అలాగే ఉంది.
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసులో నాడు ఓఎంసీ అక్రమాలపై జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా విజయవాడలోని ప్రజా ప్రతినిధులకు కోర్టుకు వచ్చారు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్వకాలు సాగిస్తోందంటూ 2004-2009 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. OMCలో అక్రమాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. వాటికి వ్యతిరేకంగా నాటి కాంగ్రెస్ పార్టీ, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి కూాడా టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించే వారు. అప్పట్లో ఓబుళాపురం గనుల తవ్వకాలపై అసెంబ్లీ సభా సంఘాన్ని కూడా నియమించింది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నిజనిర్ధారణ కోసం వెళ్లారు. 17ఏళ్ల నాటి కేసు విచారణ కోసం ఏపీ, టీడీపీ నేతలు హాజరై కోర్టులోఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు.