Ranbir Kapoor Ramayana Budget: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే?-ranbir kapoor sai pallavi ramayan budget revealed movie to release in 2027 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranbir Kapoor Ramayana Budget: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే?

Ranbir Kapoor Ramayana Budget: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
May 14, 2024 12:40 PM IST

Ranbir Kapoor Ramayana Budget: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణం మూవీ బడ్జెట్, రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది.

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే?
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే?

Ranbir Kapoor Ramayana Budget: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. కానీ తాజాగా బాలీవుడ్ హంగామాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. మూవీ బడ్జెట్, రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేటైంది.

రామాయణం బడ్జెట్ భారీగానే..

బాలీవుడ్ హంగామాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఈ రామాయణం మూవీని రూ.835 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మూవీ సన్నిహిత వర్గాలు వెల్లడించారంటూ సదరు వెబ్ సైట్ తన రిపోర్టులో తెలిపింది. ఇక ట్రేడ్ అనలిస్టు సుమిత్ కాడెల్ ఈ మూవీ రిలీజ్ ఎప్పుడో వెల్లడించాడు. రామాయణం తొలి భాగాన్ని అక్టోబర్, 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు.

"రామాయణ కేవలం ఒక సినిమా కాదు. ఓ ఎమోషన్. అందుకే మేకర్స్ ఈ సినిమాను ఓ ప్రపంచవ్యాప్త అద్భుతంగా చిత్రీకరించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దీనికోసం కేవలం రామాయణం: పార్ట్ వన్ కే 10 కోట్ల డాలర్లు (రూ.835 కోట్లు) బడ్జెట్ కేటాయించారు. ఫ్రాంఛైజీ మరింత ముందుకు వెళ్లే కొద్దీ ఈ బడ్జెట్ ను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్ అందించాలన్నదే లక్ష్యం" అని మూవీ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు బాలీవుడ్ హంగామా రిపోర్టు తెలిపింది.

పోస్ట్ ప్రొడక్షన్‌కే 600 రోజులు?

రామాయణం మూవీ బడ్జెట్ విషయంలోనే కాదు.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలోనూ మరో లెవల్ కు వెళ్లేలా కనిపిస్తోంది. ఈ సినిమా తొలి భాగాన్ని రూ.835 కోట్లతో తెరకెక్కించడమే కాదు.. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే 600 రోజుల సమయం పడుతుందని ఆ రిపోర్టు తెలిపింది. ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లడమే మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇక రామాయణం మూవీని అక్టోబర్, 2027లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ వెల్లడించాడు. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కైకేయిగా లారా దత్తా, హనుమాన్ గా సన్నీ డియోల్, మంధరగా షీబా చద్దా నటిస్తున్నారు. అయితే అసలు మూవీ గురించే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

కానీ ఈలోపే రణ్‌బీర్, సాయి పల్లవికి సంబంధించిన సెట్స్ లోని ఫొటోలు లీకయ్యాయి. ఇందులో రణ్‌బీర్ ఆర్చరీ పాఠాలు నేర్చుకుంటున్నట్లు కూడా కనిపించింది. మొత్తం మూడు భాగాలుగా రామాయణం మూవీ రానుంది. ఇప్పటికే ఎన్నోసార్లు సిల్వర్ స్క్రీన్ పై వివిధ భాషల్లో రామాయణం గురించి చెప్పినా, చెబుతున్నా.. ఇప్పుడీ రామాయణ మాత్రం ఇంత భారీ బడ్జెట్ తో రాబోతుండటం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాకు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కూడా ఓ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అతడే మూవీలో రావణుడిగా కనిపించనున్నాడన్న వార్తలు వచ్చినా.. దీనిపై ఇంకా స్పష్టత లేదు.

Whats_app_banner