Sai Pallavi: సాయిప‌ల్ల‌వి బ‌ర్త్‌డే - స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసిన తండేల్ టీమ్ - సెట్స్‌లో బుజ్జిత‌ల్లి అల్ల‌రి చూశారా?-sai pallavi birthday thandel movie team released special video naga chitnaya chandu mondeti ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: సాయిప‌ల్ల‌వి బ‌ర్త్‌డే - స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసిన తండేల్ టీమ్ - సెట్స్‌లో బుజ్జిత‌ల్లి అల్ల‌రి చూశారా?

Sai Pallavi: సాయిప‌ల్ల‌వి బ‌ర్త్‌డే - స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసిన తండేల్ టీమ్ - సెట్స్‌లో బుజ్జిత‌ల్లి అల్ల‌రి చూశారా?

Nelki Naresh Kumar HT Telugu
May 09, 2024 09:18 AM IST

Sai Pallavi Birthday: సాయిప‌ల్ల‌వి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తండేల్ మూవీ టీమ్ ఆమె కొత్త పోస్ట‌ర్‌తో పాటు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌తో పాటు వీడియోలో నాచుర‌ల్ లుక్‌లో సాయిప‌ల్ల‌వి క‌నిపిస్తోంది.

సాయిప‌ల్ల‌వి
సాయిప‌ల్ల‌వి

Sai Pallavi Birthday: సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా తండేల్ మూవీ టీమ్ అభిమానుల‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. సాయిప‌ల్ల‌వి కొత్త పోస్ట‌ర్‌తో పాటు బ‌ర్త్‌డే వీడియోను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. పోస్ట‌ర్‌లో సాయిప‌ల్ల‌వి ఫోన్ మాట్లాడుతూ చిరున‌వ్వులు చిందిస్తోంది. నాచుర‌ల్ లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

ల‌వ్‌స్టోరీ త‌ర్వాత‌...

తండేల్ మూవీలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తోన్నాడు. ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. ఈ సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా తండేల్‌ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో నాగ‌చైత‌న్య ఓ జాల‌రి పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌గా, ప‌ల్లెటూరి అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది.

య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో

చేప‌ల వేట‌కు వెళ్లి అనుకోకుండా దేశ స‌రిహ‌ద్దులు దాటిన ఓ యువ‌కుడు పాకిస్థాన్ సైన్యానికి ఎలా బందీగా చిక్కాడు? పాకిస్థాన్ జైలు నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? శ‌త్రు దేశానికి చిక్కిన త‌న ప్రియుడిని కాపాడుకోవ‌డానికి ఓ యువ‌తి ఎలాంటి సాహ‌సానికి సిద్ధ‌ప‌డింద‌నే అంశాల‌తో తండేల్‌ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తండేల్ మూవీ క‌థ‌ను చందూ మొండేటి రాసుకున్న‌ట్లు తెలిసింది. జీఏ2 ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు తండేల్ మూవీని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబ‌ర్ 20న రిలీజ్‌...

తండేల్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. నాగ‌చైత‌న్య కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా తండేల్ తెర‌కెక్కుతోంది. 2024 డిసెంబ‌ర్ 20న తండేల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తోన్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లో...

కాగా తండేల్ మూవీపై ఉన్న క్రేజ్ కార‌ణంగా షూటింగ్ పూర్తికాక‌ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కులు రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. న‌ల‌భై కోట్ల‌కు తండేల్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. కాగా కార్తికేయ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. కార్తికేయ 2 వ‌ర‌ల్డ్ వైడ్‌గా 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కార్తికేయ 2 స‌క్సెస్ కూడా తండేల్‌పై బ‌జ్ పెర‌గ‌డానికి ఓ కార‌ణ‌మైంది. గ‌తంలో చందూ మొండేటితో స‌వ్య‌సాచి అనే సినిమా చేశాడు నాగ‌చైత‌న్య‌.

బాలీవుడ్ ఎంట్రీ...

ప్ర‌స్తుతం తండేల్‌తో పాటు త‌మిళంలో అమ‌ర‌న్ సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీని విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ ప్రొడ్యూస్ చేస్తోన్నారు. రామాయ‌ణం మూవీతో బాలీవుడ్‌లోకి సాయిప‌ల్ల‌వి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఈ సినిమాలో రాముడిగా ర‌ణ్‌భీర్‌క‌పూర్ న‌టిస్తోండ‌గా..సీత‌గా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతున్న‌ది. య‌శ్ రావ‌ణుడిగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రామాయ‌ణం మూవీ తెర‌కెక్కుతోంది.

IPL_Entry_Point

టాపిక్