Thandel Release: దేవరతో పోటీ నుంచి తండేల్ ఔట్.. నితిన్‍తో ఢీ.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే..!-naga chaitanya thandel not competing with devara reportedly locked new release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Release: దేవరతో పోటీ నుంచి తండేల్ ఔట్.. నితిన్‍తో ఢీ.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే..!

Thandel Release: దేవరతో పోటీ నుంచి తండేల్ ఔట్.. నితిన్‍తో ఢీ.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే..!

Thandel Movie Release: తండేల్ సినిమా రిలీజ్ ప్లాన్స్ మారినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం కానుందని టాక్. ఈ చిత్రం ఎప్పుడు రానుందో కూడా ఓ తేదీ బయటికి వచ్చింది.

Thandel Release: దేవరతో పోటీ నుంచి తండేల్ ఔట్.. నితిన్‍తో ఢీ.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే..!

Thandel Movie: యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండడం, రాజు అనే శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను నాగచైతన్య పోషిస్తుండటంతో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ కొట్టిన చందూ మొండేటి.. తండేల్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ముందుకు అనుకున్న దాని కంటే ఈ మూవీ రిలీజ్ ఆలస్యం కానుందని సమాచారం బయటికి వచ్చింది. ఏ తేదీన రిలీజ్ అవుతుందో టాక్ వెల్లడైంది.

రిలీజ్ అప్పుడే..

తండేల్ సినిమాను ముందుగా దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే, షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ప్లాన్‍ను మార్చుకున్నారని తెలుస్తోంది. క్రిస్మస్‍ వీక్‍లో ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్. ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన తండేల్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు డిసైడ్ అయ్యారని ఇండస్ట్రీ సర్కిల్‍ నుంచి టాక్ బయటికి వచ్చింది. ఈ తేదీపై త్వరలోనే మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

దేవరతో పోటీ నుంచి ఔట్

తండేల్ మూవీని దసరాకు రిలీజ్ చేస్తామని గతంలో దర్శకుడు చందూ మొండేటి హింట్స్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ దేవర కూడా ఆ పండుగ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద దేవర, తండేల్ పోటీలో పడతాయనే టాక్ నడిచింది. అయితే, ఇప్పుడు తండేల్ మేకర్స్ ప్లాన్ మార్చేసుకున్నారని దాదాపు ఖరారైంది. డిసెంబర్‌లో మూవీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

రాబిన్‍హుడ్‍తో ఢీ!

యంగ్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానుంది. శ్రీరామనవమి సందర్భంగా నేడు (ఏప్రిల్ 17) మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తండేల్ కూడా డిసెంబర్ 20న వచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ తరుణంలో బాక్సాఫీస్ వద్ద నాగ చైతన్య, నితిన్ పోటీ తప్పేలా లేదు.

తండేల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా రేంజ్‍లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. భారీ బడ్జెట్‍తో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు హింసను ఎదుర్కొని భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల ఘటనల ఆధారంగా తండేల్ మూవీని దర్శకుడు చందూ మొండేటీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్, దేశభక్తి, లవ్ స్టోరీ ప్రధానంగా ఉంటాయి. ఈ మూవీలో నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. గతంలో వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.