Yash on Ramayana: రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీకి కోప్రొడ్యూసర్‌గా యశ్.. ఎందుకో చెప్పిన కేజీఎఫ్ స్టార్-yash co producing ranbir kapoor ramayana here is what kgf star said about this project ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yash On Ramayana: రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీకి కోప్రొడ్యూసర్‌గా యశ్.. ఎందుకో చెప్పిన కేజీఎఫ్ స్టార్

Yash on Ramayana: రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీకి కోప్రొడ్యూసర్‌గా యశ్.. ఎందుకో చెప్పిన కేజీఎఫ్ స్టార్

Hari Prasad S HT Telugu
Apr 12, 2024 03:26 PM IST

Yash on Ramayana: ఇండియన్ సినిమాలో ఇది మరో అరుదైన కలయిక. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించబోతున్న రామాయణం సినిమాకు కేజీఎఫ్ స్టార్ యశ్ కో ప్రొడ్యూసర్ గా మారాడు. దీనికి కారణమేంటో అతడే వెల్లడించాడు.

రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీకి కోప్రొడ్యూసర్‌గా యశ్.. ఎందుకో చెప్పిన కేజీఎఫ్ స్టార్
రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీకి కోప్రొడ్యూసర్‌గా యశ్.. ఎందుకో చెప్పిన కేజీఎఫ్ స్టార్ (Instagram)

Yash on Ramayana: ఇండియన్ సినిమాలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రామాయణ. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు కేజీఎఫ్ స్టార్ యశ్ కోప్రొడ్యూసర్ గా మారడం విశేషం. అతనికి చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి.

ప్రపంచానికి రామాయణం గురించి చెప్పాలనే..

రామాయణం గురించి ప్రపంచానికి చెప్పాలన్నదే ఈ సినిమా ఉద్దేశమని యశ్ అన్నాడు. వెరైటీ మ్యాగజైన్ తో మాట్లాడిన అతడు.. ఈ ప్రాజెక్ట్ ఎంత ఘనంగా ఉండబోతోందో వెల్లడించాడు. రామాయణం గురించి ఎన్నిసార్లు చెప్పినా.. ప్రతిసారీ కొత్తగా చెప్పడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందని యశ్ అభిప్రాయపడ్డాడు.

"రామాయణం మనకు బాగా తెలుసు అని అనుకుంటాం. అయినా ప్రతిసారీ ఏదో ఓ కొత్త జ్ఞానాన్ని అందించడంతోపాటు ప్రత్యేకమైన దృక్పథాలను పరిచయం చేస్తుంది. ఈ కాలాతీతమైన ఇతిహాసాన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడమే మా లక్ష్యం. ఇదో గొప్ప అద్భుతంగా ఉండనుంది. అదే సమయంలో ఆ కథ, అందులోని భావోద్వేగాలు, విలువలను చెప్పడంలో మాత్రం అంతే నిజాయతీగా ఉంటాం. రామాయణాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సాగే ప్రయాణమిది" అని యశ్ అన్నాడు.

రామాయణంలో నాలో ప్రతిధ్వనిస్తుంది

భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో చూపించే మూవీస్ ను నిర్మించాలన్నది తనకు ఎప్పటి నుంచో ఉన్న లక్ష్యమని ఈ సందర్భంగా యశ్ చెప్పాడు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కు చెందిన నమిత్ ను కలిసేందుకు యశ్ లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. ఇప్పటికే అతడు రామాయణంపై పని చేస్తున్నాడు. రామాయణం ఎప్పుడూ తనలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అది కూడా కారణమని యశ్ చెప్పాడు.

"రామాయణం నాలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రామాయణాన్ని కోప్రొడ్యూస్ చేయడానికి మేము చేతులు కలిపి, ఇద్దరి విజన్, అనుభవాలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అభిరుచికి తగిన ఇండియన్ సినిమాను క్రియేట్ చేయాలని భావించాం" అని యశ్ చెప్పాడు.

నితీష్ తివారీ రామాయణ

నిజానికి ఈ రామాయణం మూవీ గురించి ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడని మాత్రమే కన్ఫమ్ అయింది. ఇందులో ఎవరు నటిస్తున్నారన్నది ఇంకా చెప్పలేదు. కానీ రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమాన్ గా సన్నీ డియోల్ నటించబోతున్నారని మాత్రం చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

యశ్ ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషించబోతున్నట్లుగా బజ్ ఉంది. దీనికోసం అతడు ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేస్తున్నాడనీ చెప్పారు. అయితే ఇప్పుడతే సినిమాకు కోప్రొడ్యూసర్ గా మారడం విశేషం. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ తోపాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కూడా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీపై శ్రీరామ నవమినాడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

IPL_Entry_Point