Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణం’ సినిమాపై అనౌన్స్‌మెంట్ ఆరోజే!-ranbir kapoor sai pallavi yash nitesh tiwari ramayana movie announcement may come on sri ram navami ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor Sai Pallavi Yash Nitesh Tiwari Ramayana Movie Announcement May Come On Sri Ram Navami

Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణం’ సినిమాపై అనౌన్స్‌మెంట్ ఆరోజే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 02, 2024 06:33 PM IST

Ramayana: రామాయణం సినిమాపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, అనౌన్స్‌మెంట్ ఎప్పుడు రానుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణం’ సినిమాపై అనౌన్స్‌మెంట్ ఆరోజే!
Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణం’ సినిమాపై అనౌన్స్‌మెంట్ ఆరోజే!

Ramayana: అత్యంత భారీ బడ్జెట్‍తో బాలీవుడ్‍లో ‘రామాయణం’ రూపొందనుంది. స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో ఉండనున్నారు. ఈ సినిమాపై చాలా విషయాల్లో వార్తలు బయటికి వచ్చినా.. ఇంకా అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఓ ప్రత్యేకమైన రోజును మూవీ టీమ్ నిర్ణయించిందని తాజాగా సమాచారం వెల్లడైంది.

శ్రీరామనవమి రోజున..

రామాయణం సినిమాను శ్రీరామనవమి పండుగ రోజైన ఏప్రిల్ 17వ తేదీన అధికారికంగా ప్రకటించాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాను ఏప్రిల్ 17న అనౌన్స్ చేయనున్నట్టు ఈ మూవీని నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ వర్గాల నుంచి సమాచారం తెలిసిందని పింక్ విల్లా రిపోర్ట్ వెల్లడించింది.

రామాయణం సినిమా నటీనటులు, టెక్నిషియన్లు, రిలీజ్ ప్రణాళిక విషయాలను ప్రకటించేందుకు రామనవమి కంటే అత్యుత్తమమైన రోజు ఉండదని ఆయన చెప్పినట్టు వెల్లడించింది. 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.

రామాయణం సినిమాలో కీలకపాత్రలు చేయనున్న బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, కన్నడ స్టార్ యశ్‍కు ఇప్పటికే లుక్ టెస్టులు, ప్రీ-విజువలైజేషన్, టెక్ రిహార్సల్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనుంది.

రామాయణం మూవీ షూటింగ్ మార్చిలోనే మొదలుకానుందని తెలుస్తోంది. టెక్నికల్‍గా అత్యంత అడ్వాన్డ్స్ చిత్రంగా తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ తీవారీ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డులను గెలిచిన వీఎఫ్‍ఎక్స్ కంపెనీ డీఎన్‍ఈడీని ఆయన నియమించుకున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్లు.. ఈ చిత్రం కోసం ఇండియాకు వచ్చే పని చేయనున్నారని టాక్. నొయిడాలోని ఫిల్మ్ సిటీలో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

ఈ రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ నటించడం దాదాపు ఖరారైంది. కైకేయి పాత్రలో లారా దత్త, శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని టాక్. దశరథుడి పాత్ర కోసం దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్‍తో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్ రోజున ఈ విషయాలను అధికారికంగా టీమ్ వెల్లడించనుంది.

రామాయణం కోసమే బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ పూర్తి సమయం కేటాయించనున్నారు. యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్నారు. జూలైలో ఆయన రామయణం షూటింగ్‍లో పాల్గొంటారని తెలుస్తోంది. సాయిపల్లవి ప్రస్తుతం తండేల్‍తో పాటు బాలీవుడ్‍లో ఓ చిత్రం చేస్తున్నారు.

IPL_Entry_Point