Ramayana: సీతగా సాయిపల్లవి ఖరారు.. మూడు భాగాలుగా ‘రామాయణం’.. షూటింగ్ స్టార్ అయ్యేది అప్పుడే!-ranbir kapoor sai pallavi finalised as lead actors in nitesh tiwari ramayana yash may play role of ravana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramayana: సీతగా సాయిపల్లవి ఖరారు.. మూడు భాగాలుగా ‘రామాయణం’.. షూటింగ్ స్టార్ అయ్యేది అప్పుడే!

Ramayana: సీతగా సాయిపల్లవి ఖరారు.. మూడు భాగాలుగా ‘రామాయణం’.. షూటింగ్ స్టార్ అయ్యేది అప్పుడే!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 04, 2023 10:41 PM IST

Ramayana: రామాయణం ఆధారంగా బాలీవుడ్‍లో రూపొందనున్న సినిమాకు ప్రధాన నటీనటుల ఎంపిక ఖరారైందని సమాచారం బయటికి వచ్చింది. సీత పాత్రను సాయి పల్లవి చేయడం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఆ వివరాలివే..

Ramayana: సీతగా సాయిపల్లవి ఖరారు.. మూడు భాగాలుగా ‘రామాయణం’.. షూటింగ్ స్టార్ అయ్యేది అప్పుడే!
Ramayana: సీతగా సాయిపల్లవి ఖరారు.. మూడు భాగాలుగా ‘రామాయణం’.. షూటింగ్ స్టార్ అయ్యేది అప్పుడే!

Ramayana: మహా ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్‍లో భారీ బడ్జెట్‍తో సినిమా రూపొందనుంది. సుమారు మూడేళ్లుగా ఇందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి. దంగల్ ఫేమ్ డైరెక్టర్ నితేశ్ తివారీ.. రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఇందుకోసం ఆయన చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు. పలువురు నటులను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, తాను రూపొందించే ‘రామామణం’లో రాముడు, సీత, రావణుడి పాత్రలకు నటులను తాజాగా ఆయన ఫైనలైజ్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది.

నితేశ్ తివారీ ‘రామాయణం’లో రాముడి పాత్రను రణ్‍బీర్ కపూర్ చేయనుండడం గతంలోనే ఖరారైంది. సీత పాత్ర విషయమే పెండింగ్‍లో ఉండేది. అయితే, సీత పాత్ర కోసం మోస్ట్ టాలెండెడ్ నటి సాయి పల్లవిని నితేశ్ ఖరారు చేశారని తాజాగా సమాచారం వెల్లడైంది. సాయి పల్లవి సరిగ్గా సరిపోతారని ఆయన భావించారని సమాచారం. రామాయణంలో చేసేందుకు సాయిపల్లవి కూడా అంగీకరించారట. కేజీఎఫ్ ఫేమ్, కన్నడ హీరో యశ్.. ఈ రామాయణంలో రావణుడి పాత్రను పోషిస్తారని సమాచారం.

రామాయణంలో ముందుగా అలియాభట్‍ను సీత పాత్ర కోసం నితేశ్ అనుకున్నారు. లుక్‍ టెస్టు కూడా జరిగింది. అయితే, ఎందుకో ఆ తర్వాత ఆలియా ప్రస్తావన ఈ ప్రాజెక్టు విషయంలో వినిపించలేదు. ఇప్పుడు, సీత పాత్రకు సాయి పల్లవి పేరు ఖరారైందని వెల్లడైంది.

షూటింగ్ ఎప్పటి నుంచి?

రామాయణం షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం బయటికి వచ్చింది. మొదటి షెడ్యూల్‍లోనే రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి చిత్రీకరణలో పాల్గొననున్నరని తెలుస్తోంది. భారీ స్థాయిలో వీఎఫ్‍ఎక్స్‌తో రామాయణాన్ని చూపించాలని నితేశ్ తివారీ భావిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ డీఎల్ఈజీ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనుందట.

మూడు భాగాలుగా..?

రామాయణాన్ని మూడు భాగాలుగా (ట్రయాలజీ) రూపొందించాలని దర్శకుడు నితేశ్ తివారీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్-1 షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు జరుగుతుందని సమాచారం. జూలై తర్వాతే యశ్ షూటింగ్‍కు రానున్నారట.

రామాయణాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్టు 2020లోనే నిర్మాత మధు మంతెన వెల్లడించారు. నితేశ్ తివారీ దీనికి దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.