Rajamouli Yash: యశ్, రాజమౌళి ఒకే చోట.. ఆలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న పాన్ ఇండియా డైరెక్టర్, యాక్టర్-rajamouli yash attend temple pran pratishta in bellary cinema news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli Yash: యశ్, రాజమౌళి ఒకే చోట.. ఆలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న పాన్ ఇండియా డైరెక్టర్, యాక్టర్

Rajamouli Yash: యశ్, రాజమౌళి ఒకే చోట.. ఆలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న పాన్ ఇండియా డైరెక్టర్, యాక్టర్

Hari Prasad S HT Telugu

Rajamouli Yash: కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్, దర్శకధీరుడు రాజమౌళి ఒకే చోట కలిశారు. ఈ ఇద్దరూ కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ ఆలయ ప్రాణప్రతిష్టకు వెళ్లడం విశేషం.

బళ్లారిలో జరిగిన ఆలయ ప్రాణ ప్రతిష్టలో రాజమౌళి, యశ్

Rajamouli Yash: సౌత్ ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, కేజీఎఫ్ మూవీతో నార్త్ లోనూ పేరు సంపాదించిన కన్నడ స్టార్ యశ్ ఓ ఆలయ ప్రాణ ప్రతిష్టకు వెళ్లారు. ఈ ఇద్దరూ గుడిలో ఉన్న ఫొటోలు, వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బళ్లారిలోని శ్రీ అమృతేశ్వర ఆలయంలో వీళ్లు కనిపించారు.

గుడిలో కలిసిన రాజమౌళి, యశ్

దర్శక ధీరుడు రాజమౌళి, కన్నడ సూపర్ స్టార్ యశ్ బళ్లారిలో జరిగిన ఓ ఆలయ ప్రాణ ప్రతిష్టకు హాజరవడం నిజంగా విశేషమే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాజమౌళి ధోతీ కట్టుకొని రాగా.. యశ్ ఎల్లో కలర్ కుర్తాపైజామాలో వచ్చాడు. ఆలయం దగ్గరకు యశ్ రాగానే అతని కారును వందల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు.

అతనితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. యశ్ బాస్ అంటూ వాళ్లు అరవడం వీడియోల్లో కనిపించింది. మరోవైపు రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నాడు. గుడిలో విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆవరణలో ఏర్పాటు చేసిన ఓ భారీ ఆంజనేయుడి విగ్రహాన్ని రాజమౌళి పరిశీలించాడు.

ఈ ఆలయాన్ని వారాహి చలన చిత్రంకు చెందిన ఫిల్మ్ మేకర్ సాయి కొర్రపాటి కట్టడం విశేషం. 2012లో రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈగ మూవీతోనే ఈ సంస్థ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో మొత్తంగా 16 సినిమాలను నిర్మించింది. అందులో లెజెండ్, రాజుగారి గదిలాంటి హిట్స్ ఉన్నాయి.

రాజమౌళి, యశ్ ఇప్పుడేం చేస్తున్నారంటే?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మరో మూవీ చేయని రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధం కాగా.. షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఏడాది కాలంగా రాజమౌళి ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. ఈ అడ్వెంచర్ డ్రామా మూవీ షూటింగ్ వచ్చే వేసవిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ పెట్టనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరోవైపు కేజీఎఫ్ 2 తర్వాత యశ్ కూడా ఇంత వరకూ మరే సినిమా చేయలేదు. ఈ రాకీ భాయ్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతేడాది ఈ మూవీని అతడు అనౌన్స్ చేశాడు. గీతూ మోహన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక నితేష్ తివారీ రామాయణంలోనూ యశ్ రావణుడిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నా.. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.