Mahesh Babu Remuneration: ఆ మూడు పదాలు పలకడానికి రూ.5 కోట్లు తీసుకున్న మహేష్ బాబు!-mahesh babu remuneration for phone pe is now talk of the town telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Remuneration: ఆ మూడు పదాలు పలకడానికి రూ.5 కోట్లు తీసుకున్న మహేష్ బాబు!

Mahesh Babu Remuneration: ఆ మూడు పదాలు పలకడానికి రూ.5 కోట్లు తీసుకున్న మహేష్ బాబు!

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 03:28 PM IST

Mahesh Babu Remuneration: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగిపోనున్న వేళ ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. ఓ యాడ్ కోసం మూడు పదాలు పలకడానికి మహేష్ ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఓ యాడ్ షూట్లో మూడు పదాలు పలకడానికి రూ.5 కోట్లు తీసుకున్న మహేష్ బాబు
ఓ యాడ్ షూట్లో మూడు పదాలు పలకడానికి రూ.5 కోట్లు తీసుకున్న మహేష్ బాబు

Mahesh Babu Remuneration: మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న రేంజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే వచ్చిన గుంటూరు కారం మూవీకి నెగటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించిందంటే దానికి కారణం అతనికి ఉన్న స్టార్‌డమ్. అయితే ఆ స్టార్ స్టేటస్ తోనే ఇప్పుడు మహేష్ ఓ యాడ్ కోసం మూడే మూడు పదాలు పలకడానికి ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు యాడ్

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు యాడ్స్ లోనూ మహేష్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఈ సూపర్ స్టార్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవడానికి బ్రాండ్స్ పోటీ పడుతుంటాయి. తాజాగా యూపీఐ యాప్ ఫోన్ పే కూడా అదే ప్రయత్నం చేసింది. ఈ బ్రాండ్ కోసం థ్యాంక్ యూ బాస్ అనే మూడు పదాలు పలకడానికి మహేష్ బాబు ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్టు వెల్లడించింది.

ఫోన్ పేలో ట్రాన్జాక్షన్ చేసిన ప్రతిసారీ చివర్లో థ్యాంక్యూ బాస్ అనే మహేష్ బాబు వాయిస్ ను యూజర్లు వింటారు. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్స్ వాడే వాళ్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. నిజానికి ఇదో మంచి ఐడియానే. ఫోన్ పే తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి మహేష్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్ ను ఎంచుకోవడం కూడా బాగుంది. అయితే దీనికోసం ఈ సూపర్ స్టార్ తీసుకున్న రెమ్యునరేషనే ఆశ్చర్యం కలిగిస్తోంది.

మహేష్ బాబు నెక్ట్స్ మూవీ

ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ కావడంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజైంది. అయితే తొలి షో నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. పైగా అదే రోజు హనుమాన్ కూడా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా కలెక్షన్లు భారీగా పెరిగిపోయాయి.

అయినా కూడా గుంటూరు కారం ఏకంగా రూ.120 కోట్ల షేర్ సాధించడం విశేషం. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోతున్నాడు. ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ లెవల్లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథ రాయడం పూర్తి చేశారు. షూటింగ్ ప్రారంభం కావడమే మిగిలి ఉంది. అయితే రాజమౌళితో సినిమా కావడం, అందులోనూ ఇండియానా జోన్స్ స్టైల్ కథ కావడంతో ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి.

Whats_app_banner