Impotence In Men : ఋషులు ఇవి తిని శృంగారానికి దూరంగా ఉండేవారు.. ఇలా నపుంసకులవుతారు!
Impotence In Men : నపుంసకత్వముతో బాధపడే మగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇది.. కొన్ని పద్ధతుల ద్వారా కూడా వస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారం కూడా సరిగా ఉండాలి. ఏం తినాలో.. ఏం తినకూడదో కూడా తెలిసి ఉండాలి.
పురుషులు సంతానోత్పత్తిని పెంచడానికి అనేక పదార్థాలు తీసుకుంటారు. కానీ సంతానోత్పత్తిని తగ్గించే విషయాల గురించి తక్కువ అవగాహన ఉంటుంది. ఆ విషయాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. సంతానోత్పత్తిని పెంచడానికి కొన్ని శతాబ్దాలుగా ప్రభావవంతంగా ఉన్నట్లే, దానిని తగ్గించే చర్యలు కూడా శతాబ్దాలుగా ఉన్నాయి. కొంతమంది కావాలనే వాటిని పాటిస్తారు. మరికొందరు అనుకోకుండా తీసుకుని.. ఇబ్బందుల పాలవుతారు.
ముఖ్యంగా పురాతన కాలంలో, తమను తాము కామానికి అతీతంగా ఉంచుకోవాలనుకునే వ్యక్తులు కొన్నింటిని ఉపయోగించారు.
అరటి రూట్ రసాన్ని ఋషులు తీసుకునేవారని చెబుతారు. మనిషికి అరటి రూట్ రసాన్ని నీటిలో కలిపి కొన్ని రోజుల పాటు ఇస్తే, సంతానోత్పత్తి అంతమవుతుంది. పూర్వకాలంలో సెక్స్‌కు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని గడిపే సాధువులు, ఋషులకు కూడా ఇలాంటి పద్ధతి పాటించేవారని అంటారు. కుండలో అరటి చెట్టును నాటినట్లయితే, పొరపాటున కూడా దాని రసాన్ని తాగకండి. దీన్ని తాగడం వల్ల మనిషి 3 రోజుల్లో నపుంసకుడి అవుతాడు. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం దీనికి కారణం.
మీ ఇంట్లోనే, మీ ఎదురు ఇంట్లోనే.. ఊరగాయలను చేస్తుంటారు. అవి చూస్తే.. నోరు ఆగదు. దీంతో తినాలే ఆశ కలగుతుంది. అయితే ఏదైనా మితంగా తింటే ఏం కాదు. కానీ అతిగా తింటేనే అనారోగ్యం. పచ్చళ్లు తినడం మీకు ఎక్కువగా అలవాటు ఉంటే.. వెంటనే ఆపేయండి. పురుషులు మామిడికాయ పచ్చడి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మామిడికాయ ఊరగాయ మగ హార్మోన్లను తగ్గిస్తుంది. ఇది నపుంసకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే పురుషులు మామిడికాయ పచ్చడిని ఎప్పుడూ తినకూడదు. ఏ పచ్చడి అయినా మితంగానే తినాలి. మరీ ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు ఎదుర్కొంటారు.
ఉసిరికాయను తీసుకోవడం వలన స్త్రీలకు చాలా రోగాలు నయమవుతాయి. ఉసిరిని మహిళలకు ఒక వరంగా భావిస్తారు. పురుషులకు ఉసిరి శాలం లాంటిది. ఒక వ్యక్తి ఉసిరిని ఎక్కువగా తింటే, అతని శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది నపుంసకత్వానికి మొదటి దశ. అందువల్ల పొరపాటున కూడా మీ ఆహారంలో ఉసిరిని ఎక్కువగా చేర్చవద్దు.
పూర్వకాలంలో సాధువులు, ఋషులు సెక్స్ డ్రైవ్‌ను ఆపడానికి మాత్రమే వీటిని ఎక్కువగా తినేవారని చెబుతారు. ఈ కారణంగా, పొరపాటున కూడా అతిగా తినవద్దు.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. పైన చెప్పిన సమాచారానికి HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే.. సరైన నిపుణుడిని సంప్రదించండి.